ఎవడ్రా వీడు?.. వామ్మో.. వాడి పబ్లిక్ టాక్ మామూలుగా ఉండదు..
Publish Date:Mar 11, 2022
Advertisement
ఈ ఫోటో చూడగానే.. చాలామందే గుర్తు పట్టేసి ఉంటారు. సినిమా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు.. యూట్యూబ్‌లో మూవీ పబ్లిక్ టాక్ చూసేవాళ్లకు ఇతను బాగా తెలుసు. కొత్త సినిమా అనగానే వాలిపోతాడు. ఆన్‌లైన్లో ఫస్ట్ టికెట్ బుక్ చేసేది ఇతనే కావొచ్చు. హైదరాబాద్ ఐమాక్స్‌లో ఫస్ట్ షో చూసేస్తాడు. ఇక సినిమా అయిపోగానే.. మొదలవుతుంది ఇతని షో. మూవీని మించి.. అంతకుమించి అన్నట్టు ఓవరాక్షన్ చేసేస్తాడు. అది ఏ సినిమా అయినా గానీ.. అది ఏ హీరో అయినా గానీ.. బ్రో.. బ్రో.. అంటూ గొంతు చించుకుని అరుస్తాడు. తన ఒపినియన్ పేరుతో.. స్మాల్ సైజ్ సినిమా చూపిస్తాడు. మనోడు కూడా మంచి నటుడే. మైకులు, కెమెరా ముందు అతగాడి ఎక్స్‌ప్రెషన్స్ ఓ రేంజ్‌లో ఉంటాయి. జబర్దస్త్ షో ను మించి కామెడీ చేస్తాడు. జూనియర్ ఆర్టిస్టులను మించి యాక్టింగ్ చేస్తాడు. చేతులు ఊపుతూ.. బట్టలు చించుకుంటూ.. తల కొట్టుకుంటూ.. ఏడుస్తూ.. నవ్వుతూ.. రెచ్చిపోతూ.. వామ్మో.. వాడి పబ్లిక్ టాక్ మామూలుగా ఉండదు. బీభత్సమే. అసలు సినిమాలో ఏమున్నా.. లేకపోయినా.. థియేటర్ బయట అతను చెప్పే టాక్ ఓ రేంజ్‌లో ఉంటుంది. పాపం.. అతని బ్లడ్ గ్రూప్ పాజిటివ్ కాబోలు.. మాగ్జిమమ్ పాజిటివ్‌గానే రివ్యూ ఇస్తుంటాడు. ఇతన్ని చూడగానే యూట్యూబ్ ఛానెల్స్ మైకులన్నీ వాడి మూతి ముందు వాలిపోతాయి. మైకులను చూసి అతనొస్తాడో.. లేక, అతన్ని చూసి మైకులు వస్తాయో.. వాళ్ల బంధం.. అదో టైపు. అందుకే, యూట్యూబ్‌లో తెగ పాపులర్ ఇతను. సినిమా పబ్లిక్ టాక్ మినహా.. మరెక్కడా కనిపించడు. ప్రతీవారం మిస్ కాకుండా.. ఐమాక్స్‌కు అటెండ్ అవుతుంటాడు. సొంత ఖర్చులతో సినిమా చూస్తాడో.. లేదంటే, సినిమా వాళ్లో, యూట్యూబ్ వాళ్లో టికెట్ స్పాన్సర్ చేస్తారో తెలీదు. ఇక, ఇతని పబ్లిక్ టాక్ వీడియోలకు నెటిజన్లు దారుణమైన కామెంట్లు పెడుతుంటారు. అబ్బా.. ఈ సైకో గాడు మళ్లీ వచ్చాడురా.. అంటూ కొందరు, వీడూ వీడి ఓవరాక్షన్.. ఏదైనా పని చేసుకొని బతుకొచ్చుకదరా.. చెత్తనాయాల.. పనికిమాలినోడు.. వీడినెవరికైనా చూపించండ్రా.. ఇలా రకరకాల పోస్టులు పెడుతుంటారు. పనిలో పనిగా అతని ముందు మైకులు పెట్టిన.. యూట్యూబ్ ఛానెల్స్‌ను కూడా కుమ్మేస్తుంటారు. మీకు వీడే దొరికాడా? ఇంకేం పని లేదా? ఇంకెవరూ లేరా? అంటూ సోషల్ మీడియాలో ఆటాడుకుంటారు. పాజిటివో, నెగటివో.. మొత్తానికి ఇతను మాత్రం ఫుల్ ఫేమస్. అతని పేరు గానీ, ఊరు గానీ, చేసే పని గానీ.. పెద్దగా డీటైల్స్ తెలీవు. కానీ, అతని యాక్షన్, ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్, డైలాగ్స్ చూస్తుంటే, వింటుంటే.. ఇతనికి తప్పకుండా జబర్దస్త్‌లోనో, ఏదైనా సినిమాలోనే ఒక్క ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అతనిలో మంచి డైలాగ్ రైటర్ కూడా ఉన్నాడండోయ్. ప్రతీ సినిమాకు.. సినిమా టైటిల్, హీరో, హీరోయిన్ పేర్లతో.. ప్రాస, పంచ్‌లతో సొంతంగా డైలాగ్స్ రాసుకొచ్చి మరీ.. పబ్లిక్ టాక్స్‌లో వినిపిస్తుంటాడు. మల్టీ టాలెంటెడ్ కాబోలు మనోడు. ఇచ్చేయండి.. ఓ సినిమా ఛాన్స్ ఇచ్చి చూడండి డ్యూడ్.. పోయేదేముంది.. మా అంటే మళ్లీ రివ్యూలు చెప్పుకుంటాడులెండి....
http://www.teluguone.com/news/content/interesting-person-in-movie-public-talks-videos-39-132897.html





