పంచుకుంటే నష్టపోయేది లేదు!

Publish Date:Nov 19, 2020

Advertisement

అది హిమాలయాలకు దగ్గరలోని ఒక పల్లెటూరు. ఆ ఊరిచివర ఒక ఆశ్రమం ఉండేది. ఒక రోజు ఊరిలోని రైతు ఆ ఆశ్రమంలోకి ప్రవేశించాడు. నేరుగా అక్కడ ఓ చెట్టు కింద ధ్యానం చేసుకుంటున్న సాధువు దగ్గరకి వెళ్లాడు. కళ్లు తెరిచి చూసిన సాధువుకి రైతు, రైతు చేతిలో యాపిల్‌ పళ్లు కనిపించాయి.

 

‘స్వామీ నేను ఎప్పుడు ఈ ఆశ్రమంలోకి అడుగుపెట్టినా మీరు నన్ను ఆదరంగా చూసేవారు. నా సమస్యలని విని సానుకూలమైన పరిష్కరాలు చెప్పేవారు. పంటలు సరిగా పండక నాకు నష్టం వచ్చినప్పుడు నా ఆకలిని తీర్చేవారు. నేను నాటిన యాపిల్‌ చెట్లు ఈసారి విరగకాశాయి. మీరు నా పట్ల చూపించిన అభిమానానికి కృతజ్ఞతగా వాటి పళ్లను మీకు ఇవ్వాలనుకుంటున్నాను. కాదనకండి!’ అంటూ సాధువు చేతిలో పళ్లని ఉంచి వెళ్లిపోయాడు.

 

రైతు తన పట్ల చూపిన కృతజ్ఞతకి సాధువు మురిసిపోయాడు. ‘తన గురువుగారు చూపిన సన్మార్గంలో నడవడం వల్లనే కదా, ఇలాంటి జనానికి తన పట్ల గౌరవం ఏర్పడింది!’ అనుకున్నాడు. వెంటనే తన దగ్గర ఉన్న పళ్లను గురువుగారికి ఇవ్వాలని అనిపించింది. గురువుగారి గదిలోకి ప్రవేశించి ఆయన పాదాల దగ్గర యాపిల్‌ పళ్లను ఉంచి జరిగిందంతా చెప్పాడు. తన శిష్యుడు ప్రయోజకుడు కావడం చూసి గురువుగారికి ముచ్చట వేసింది. అంతకుమించి, అతనికి లభించిన బహుమతిని తన పాదాల దగ్గర ఉంచడం చూసి సంతోషం కలిగింది.

 

అంతలో గురువుగారికి ఆశ్రమంలోని ఇతర శిష్యులు కూడా గుర్తుకువచ్చారు. వారిలో ఒక శిష్యుడు పాపం వారం రోజుల నుంచీ విపరీతమైన జ్వరంతో బాధపడుతున్నాడు. వెంటనే ఆ శిష్యుని గదిలోకి ప్రవేశించారు గురువుగారు. గురువుగారి రాకతో శిష్యుడు పరమానందభరితుడయ్యాడు. ఆయన పరామర్శనీ, దాంతోపాటుగా అందించిన యాపిల్‌ పళ్లనీ చూసేసరికి అతని రోగం సగం తగ్గిపోయినంత ఓపిక వచ్చేసింది.

 

ఆ యాపిల్ పళ్లని చూస్తూ కూర్చున్న శిష్యుడికి రోజూ తన బాగోగులు చూసుకునే వంటవాడు గుర్తుకువచ్చాడు. పాపం ఆ వంటవాడు తనకి ఏ ఆహారం సరిపడుతుంది, ఎలాంటి పథ్యం చేయాలి అన్న విషయాలను చాలా శ్రద్ధగా గమనించేవాడు. శ్రమ అనుకోకుండా తనకి రోజూ ప్రత్యేకంగా వంట చేసేవాడు. వెంటనే తన కృతజ్ఞతకి గుర్తుగా శిష్యుడు వంటగదిలోకి వెళ్లి వంటవాడి చేతిలో యాపిల్ పళ్లని ఉంచాడు. యాపిల్‌ పళ్లని చూసిన వంటవాడికి నోట మాట రాలేదు. ఏదో ఆశ్రమంలో ఉంటూ నలుగురితో పాటుగా పొట్ట నింపుకుందామని అనుకున్నాడు కానీ, వారు తనని ఇంత గౌరవంగా చూసుకుంటారని అనుకోలేదు. యాపిల్ పళ్లదేముంది! తాను ఎప్పుడూ తినేవే! కానీ ఈసారి చేతికి వచ్చిన పళ్లు చాలా అపురూపమైనవి. అవి తన పట్ల ఓ సాధువు చూపిన అభిమానానికి గుర్తు. అందుకనే వాటిని తన ఇంటికి తీసుకువెళ్లి కొడుకు చేతిలో పెట్టాడు. రోగంతో బాధపడిన శిష్యుడికి తను చేసిన సేవ గురించి చెబుతూ ‘నువ్వు కూడా నాలాగా ఇతరుకు సాయపడే గుణాన్ని అలవర్చుకోవాలి’ అంటూ భుజం తట్టాడు.

 

‘తండ్రి చెప్పింది నిజమే కదా!’ అనిపించింది కొడుకుకి. ఒకసారి తమ గతాన్నంతా అతను నెమరువేసుకున్నాడు. ఏడాది క్రితం తమ కుటుంబం కటిక దరిద్రంలో ఉండేది. వంటవాడి ఇంట్లో వండుకునేందుకు గింజలే లేవయ్యే! అలాంటి పరిస్థితుల్లో తమ ఇంటికి వచ్చిన ఓ సాధువు తన తండ్రిని తీసుకువెళ్లి వాళ్ల ఆశ్రమంలో చేర్పించాడు. ‘ఈ రోజున తను వేళకి ఇంత తినగలుగుతున్నాడంటే ఆ ఆశ్రమం చలవే!’ అనుకున్నాడు కొడుకు. వెంటనే ఆశ్రమం వైపు బయల్దేరాడు. అక్కడ పదులకొద్దీ సాధువులు తిరుగుతున్నారు. కానీ ఆ రోజు తన తండ్రికి సాయం చేసిన వ్యక్తిని మాత్రం స్పష్టంగా గుర్తుపట్టాడు కొడుకు. పరుగెత్తుకుంటూ వెళ్లి పళ్లని అతని చేతిలో పెట్టాడు. ఆ సాధువు ఎవరో కాదు.... పళ్లని గురువుగారి పాదాల చెంత ఉంచినవాడే! సంతోషాన్ని ఒకరితో పంచుకోవాలనుకుంటే, అది తిరిగి ఎలా తన దగ్గరకే వస్తుందో సాధువుకి అర్థమైపోయింది. పంచుకునే గుణంలో ప్రతి ఒక్కరి మనసూ తృప్తి చెందుతుందని తెలిసిపోయింది.

- నిర్జర.

By
en-us Political News

  
భారతదేశంలో ధనికుల కంటే పేదవారే ఎక్కువ.  పేదవారిలో కూడా చాలా పేదవారు,  ఒక మోస్తరు పేదవారు అని కూడా ఉంటారు. అయితే కాలం ఎంత గడిచినా జీవితాలలో ఏ మాత్రం మార్పు లేకుండా పేదవారిగానే ఉండిపోయే...
పిల్లలు జీవితంలోని ప్రతి దశలో  ఆత్మవిశ్వాసంతో, బాధ్యతాయుతంగా నిలబడాలని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటారు. నేటికాలంలో మంచి పేరెంటింగ్ అంటే కేవలం మంచి విద్యను అందించడం లేదా..
వేసవికాలం అనగానే మండే ఎండలు గుర్తుకు వస్తాయి.  ప్రతి ఏడాది ఈ ఎండల ప్రభావం పెరుగుతూనే ఉంటోంది. ఈ కారణంగానే చాలామంది ఇళ్లలో ఏసీలు పెట్టించుకుంటారు.  అయితే ఏసీ పెట్టించుకునే అంత స్తోమత లేనివారు కనీసం కూలర్ అయినా...
వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాలు , రెండు విభిన్న మనస్తత్వాల కలయిక కూడా.  పెళ్లి తర్వాత ప్రతి జంట తమ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది..
నేటి కాలంలో ఫిట్‌నెస్‌పై అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా జిమ్ వెళ్లేవారు తమ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు...
మీ జుట్టు మీ అందానికి ఒక కిరీటం వంటిది. కానీ నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, కాలుష్యం మరియు రసాయనాల వాడకం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటోంది. మీ జుట్టును ఒత్తుగా, పొడవుగా మరియు ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం...
ప్రేమించిన వారిని వదిలి వేరొకరిని పెళ్లి చేసుకుంటున్నారా? మీ జీవితం మరియు మీ భాగస్వామి భవిష్యత్తు కోసం ఈ విషయాలు తప్పక తెలుసుకోండి...
ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద ఆరోగ్య సమస్య హార్మోన్ల అసమతుల్యత (Hormonal Imbalance). మనం ఎంత ప్రయత్నించినా బరువు తగ్గకపోవడం, ఎప్పుడూ అలసటగా అనిపించడం, మానసిక ఒత్తిడి.. ఇవన్నీ మీ హార్మోన్లు పంపే సంకేతాలు కావచ్చు...
పుట్టిన తర్వాత పిల్లలు పెద్దగా అయినా.. వారు చదువులు పూర్తయ్యి,  పెళ్ళి చేసుకుని, వారు కూడా పిల్లలను కన్నా సరే.. తల్లిదండ్రులకు మాత్రం తమ పిల్లలు ఎంతవాళ్లైనా ఇంకా చిన్న పిల్లలు గానే అనిపిస్తూ ఉంటుంది...
జీవితంలో విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ విజయం కొందరే సాధిస్తారు. దీనికి కారణాలు చాలా ఉంటాయి...
భారతీయుల ఇళ్లలో చాలా వరకు కరివేపాకు మొక్క పెంచుతూ ఉంటారు. ఇంటి బయట ఏ మాత్రం కాస్త స్థలం ఉన్నా సరే.. మొదటగా కరివేపాకు మొక్కనే పెంచుతూ ఉంటారు. కరివేపాకు మొక్క ఎదుగుదలకు కూడా భారతీయ...
వేసవి కాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో కూలర్ల దుమ్ము దులిపి వాడటానికి సిద్దం చేస్తుంటారు.  అయితే చాలా మంది ఇబ్బంది పడే సమస్య కూలర్ నుండి దుర్వాసన రావడం.  కూలర్ ను శుభ్రం చేసి వాడటానికి సిద్దం చేసినా సరే..
భారతీయుల ఆహారంలో బెల్లం ప్రధాన పదార్థం. తీపి పదార్థాల తయారీ నుండి కూరలలో కూడా రుచి కోసం బెల్లం వాడుతూ ఉంటారు.  అయితే వేసవి కాలంలో బెల్లం విషయంలో పెద్ద సమస్య ఎదురవుతుంది....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.