ఫోన్లో మాట్లాడేటప్పుడు...

Publish Date:Sep 3, 2020

Advertisement

ఒకప్పుడంటే ఫోన్లో మాట్లాడటం విలాసం. కానీ ఇప్పుడో! పక్క ఇంట్లో ఉన్న మనిషితో కూడా ఫోన్లోనే మాట్లాడేస్తున్నాం. ఇలాంటి విచ్చలవిడి వాడకంలోని లాభనష్టాల మాట అటుంచితే ఫోన్లో మాట్లాడటం కూడా కళే అంటున్నారు నిపుణులు. మనిషి ఎదురుగుండా ఉండడు కాబట్టి మొహమాటమూ, భయమూ లేకుండా ఫోన్లో చెలరేగిపోతూ ఉంటాము. అలాంటి సమయాలలో కొన్ని కనీస మర్యాదలు పాటించాలని సూచిస్తున్నారు...

 

ముందుగానే నిర్ణయించుకోండి

ఏదన్నా విషయం గురించి మాట్లాడాలనుకునేటప్పుడు, ఓ నిమిషం సేపైనా మీరు చెప్పాలనుకున్న విషయం ఏమిటి? దానిని అవతలివారికి ఎలా తెలియచేయాలనుకుంటున్నారు? అన్న అంశం మీద దృష్టి పెట్టండి. మీ మాటలకు అవతలి వ్యక్తి ఎలా స్పందించే అవకాశం ఉంది! దానికి మీ దగ్గర తగిన జవాబు ఉందా లేదా! అన్నది తరచి చూసుకోండి. లేకపోతే సంభాషణ మధ్యలో మాటలు తడుముకోవాల్సి ఉంటుంది.

 

పరిచయంతో మొదలు

మన జీవితంలో ఎదురుపడిన ప్రతి ఒక్కరి దగ్గరా మన ఫోన్‌ నెంబరు ఉండాలన్న నిబంధన లేదు. కానీ చాలామందికి తమను తాము పరిచయం చేసుకునేందుకు అహం అడ్డు వస్తుంది. ‘నేనే మాట్లాడుతున్నాను’, ‘ఏంటి విశేషాలు’... అంటూ నేరుగా సంభాషణలోకి దిగిపోతుంటారు. అవతలివారు సదరు మనిషిని గుర్తపట్టలేక ఇబ్బందిపడుతూ ఉంటారు, ఒకవేళ గుర్తుపట్టినా సంభాషణ మొదలయ్యే తీరు చాలా అమర్యాదగా తోస్తుంది. 

 

కనీస మర్యాదలు

ఒక వ్యక్తి ఎదురుపడినప్పుడు నమస్కారం చెప్పడం, క్షేమసమాచారాలు అడగడం కనీస మర్యాదు. ఫోన్‌ సంభాషణలకు కూడా ఇదే వర్తిస్తుంది. అంతేకాదు! అవతలి వ్యక్తి హోదాలో ఎంత చిన్నవారైనా కూడా దురుసుగా మాట్లాడటం, వేళాకోళం చేయడంతో మన గురించి చెడు అభిప్రాయాన్నే మిగులుస్తుంది. చాలామంది ఫోన్లో మాట్లాడేటప్పుడు తమకి ఉన్న హాస్య చతురతని అంతా చూపిద్దామనుకుని గీత దాటుతూ ఉంటారు. దీంతో మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది.

 

సాఫీగా సంభాషణ

ఫోన్లో మన వాదనని వినిపించేందుకు ఎంతగా ప్రాధాన్యతని ఇస్తామో, అవతలివారి మాటని వినేందుకు కూడా అంతే ప్రాధాన్యతని ఇవ్వాలి. మాటిమాటికీ అడ్డు తగలడం, హెచ్చుస్థాయిలో మాట్లాడటం వల్ల వాదన కాస్తా వివాదంగా మారిపోయే అవకాశం ఉంది. తొందరగా మాట్లాడేయాలన్న కంగారులో ఏదిపడితే అది మాట్లాడేసే ప్రమాదమూ లేకపోలేదు. ఇక ఏదన్నా ముఖ్య విషయం మాట్లాడలనుకునేటప్పుడు టీవీ, ట్రాఫిక్‌ వంటి శబ్దాలు లేని సందర్భాన్ని ఎంచుకోవడం మంచిది.

 

సమయం

కొంతమందికి ఫోన్‌ చూస్తే చాలు పూనకం వచ్చేస్తుంది. ‘సరే అయితే!, ‘ఇక ఉంటాను’ లాంటి సూచనలు ఇస్తున్నా కూడా సంభాషణని మరింతగా పొడిగిస్తూ ఉంటారు. ఇలాంటి సంభాషణలకు వీలైనంత దూరంగా ఉండటమే మంచిది. ఫోన్ సంభాషణ ఎలా మొదలుపెట్టాలి అన్నదే కాదు, ఎంతసేపట్లో ముగించాలన్నది కూడా తెలిసి ఉండాలి. ఇద్దరిలో ఎవరో ఒకరు ఇక చాలు అన్న సూచనని ఇచ్చినప్పుడు ఆ సంభాషణని ముగించడం మేలు.

- నిర్జర.

By
en-us Political News

  
భారతదేశంలో ధనికుల కంటే పేదవారే ఎక్కువ.  పేదవారిలో కూడా చాలా పేదవారు,  ఒక మోస్తరు పేదవారు అని కూడా ఉంటారు. అయితే కాలం ఎంత గడిచినా జీవితాలలో ఏ మాత్రం మార్పు లేకుండా పేదవారిగానే ఉండిపోయే...
పిల్లలు జీవితంలోని ప్రతి దశలో  ఆత్మవిశ్వాసంతో, బాధ్యతాయుతంగా నిలబడాలని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటారు. నేటికాలంలో మంచి పేరెంటింగ్ అంటే కేవలం మంచి విద్యను అందించడం లేదా..
వేసవికాలం అనగానే మండే ఎండలు గుర్తుకు వస్తాయి.  ప్రతి ఏడాది ఈ ఎండల ప్రభావం పెరుగుతూనే ఉంటోంది. ఈ కారణంగానే చాలామంది ఇళ్లలో ఏసీలు పెట్టించుకుంటారు.  అయితే ఏసీ పెట్టించుకునే అంత స్తోమత లేనివారు కనీసం కూలర్ అయినా...
వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాలు , రెండు విభిన్న మనస్తత్వాల కలయిక కూడా.  పెళ్లి తర్వాత ప్రతి జంట తమ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది..
నేటి కాలంలో ఫిట్‌నెస్‌పై అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా జిమ్ వెళ్లేవారు తమ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు...
మీ జుట్టు మీ అందానికి ఒక కిరీటం వంటిది. కానీ నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, కాలుష్యం మరియు రసాయనాల వాడకం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటోంది. మీ జుట్టును ఒత్తుగా, పొడవుగా మరియు ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం...
ప్రేమించిన వారిని వదిలి వేరొకరిని పెళ్లి చేసుకుంటున్నారా? మీ జీవితం మరియు మీ భాగస్వామి భవిష్యత్తు కోసం ఈ విషయాలు తప్పక తెలుసుకోండి...
ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద ఆరోగ్య సమస్య హార్మోన్ల అసమతుల్యత (Hormonal Imbalance). మనం ఎంత ప్రయత్నించినా బరువు తగ్గకపోవడం, ఎప్పుడూ అలసటగా అనిపించడం, మానసిక ఒత్తిడి.. ఇవన్నీ మీ హార్మోన్లు పంపే సంకేతాలు కావచ్చు...
పుట్టిన తర్వాత పిల్లలు పెద్దగా అయినా.. వారు చదువులు పూర్తయ్యి,  పెళ్ళి చేసుకుని, వారు కూడా పిల్లలను కన్నా సరే.. తల్లిదండ్రులకు మాత్రం తమ పిల్లలు ఎంతవాళ్లైనా ఇంకా చిన్న పిల్లలు గానే అనిపిస్తూ ఉంటుంది...
జీవితంలో విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ విజయం కొందరే సాధిస్తారు. దీనికి కారణాలు చాలా ఉంటాయి...
భారతీయుల ఇళ్లలో చాలా వరకు కరివేపాకు మొక్క పెంచుతూ ఉంటారు. ఇంటి బయట ఏ మాత్రం కాస్త స్థలం ఉన్నా సరే.. మొదటగా కరివేపాకు మొక్కనే పెంచుతూ ఉంటారు. కరివేపాకు మొక్క ఎదుగుదలకు కూడా భారతీయ...
వేసవి కాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో కూలర్ల దుమ్ము దులిపి వాడటానికి సిద్దం చేస్తుంటారు.  అయితే చాలా మంది ఇబ్బంది పడే సమస్య కూలర్ నుండి దుర్వాసన రావడం.  కూలర్ ను శుభ్రం చేసి వాడటానికి సిద్దం చేసినా సరే..
భారతీయుల ఆహారంలో బెల్లం ప్రధాన పదార్థం. తీపి పదార్థాల తయారీ నుండి కూరలలో కూడా రుచి కోసం బెల్లం వాడుతూ ఉంటారు.  అయితే వేసవి కాలంలో బెల్లం విషయంలో పెద్ద సమస్య ఎదురవుతుంది....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.