తెలంగాణ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇళ్లు 400-600 చ.అడుగుల మధ్యే నిర్మించుకోవాలని అలాంటి వాటికే బిల్లులు చెల్లిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రతి మండలంలోని ఓ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. కొన్ని ప్రాంతాల్లో 600 చ.అడుగులు దాటి నిర్మించుకుంటున్నారని.. వాటికి బిల్లులు హోల్డ్ చేశామన్నారు. నిరుపేదలకు గూడు కల్పించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం తీసుకొచ్చిందని పొంగులేటి అన్నారు. ఈ పథకం నిరు పేదలకు మాత్రమే లబ్ధి చేకూరాలని ఆయన ఆకాంక్షించారు. ఇందులో ఎలాంటి పొరపాట్లకు, తప్పులకు తావు ఉండొద్దని ఇంజనీర్లకు సూచించారు. ఆ బాధ్యతను ఇంజనీర్లపైనే పెడుతున్నట్లు చెప్పారు. అదేవిధంగా అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయితే ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు న్యాక్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి ఈ కామెంట్స్ చేశారు. పైలట్ గ్రామాల్లో ఇళ్ల నిర్మాణం చురుగ్గా జరుగుతోందని అన్నారు. మిగిలిన గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక కొద్ది రోజుల్లోనే పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు.
నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్స్ లో శిక్షణ పొందిన అసిస్టెంట్ ఇంజనీర్లకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇవాళ సర్టిఫికెట్లు అందజేశారు. హౌసింగ్ కార్పొరేషన్‌లో 350 మంది ఔట్ సోర్సింగ్ అసిస్టెంట్ ఇంజనీర్లను సర్కార్ నియమించింది. హౌసింగ్ అసిస్టెంట్ ఇంజనీర్లకు ఆరు రోజులపాటు అధికారులు శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసుకున్న అసిస్టెంట్ ఇంజనీర్లకు సర్టిఫికెట్లు అందజేశారు. అలాగే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో 21 మందికి ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. గ్రేడ్ -2లో పనిచేస్తున్న10 మంది సబ్ రిజిస్ట్రార్లను గ్రేడ్-1కి, సీనియర్ సహాయకులుగా పనిచేస్తున్న 11 మందికి గ్రేడ్-2 పదోన్నతులు కల్పించింది. పదోన్నతులు పొందిన ఉద్యోగులకు సర్టిఫికెట్లను మంత్రి పొంగులేటి అందజేశారు. భారతదేశంలో పేదలకు ఏటా రూ.5 లక్షలతో 4.5 లక్షల ఇండ్లు నిర్మిస్తున్న ఏకైక రాష్ట్రమని రె మంత్రి పొంగులేటి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పేదల ఆత్మగౌరవం కోసం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించామన్నారు. ఈ ఏడాది రూ.22,000 కోట్లతో 4.5 లక్షల ఇండ్లు నిర్మిస్తామని, లబ్దిదారుల ఎంపిక త్వరలో పూర్తవుతుందని, పైలట్ గ్రామాల్లో నిర్మాణం శరవేగంగా సాగుతోందని చెప్పారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/indiramma-illu-39-197390.html
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని.
అయితే ఆయన తాజాగా నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు, వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో కలకలం రేపింది.
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు. ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం.