గాల్లోనే పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌కు మళ్లిన ఇండిగో విమానం. !
Publish Date:Oct 11, 2026
Advertisement
ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో పవర్ బ్యాంక్‌లో మంటలు చెలరేగడం కలకలం రేపింది. విమానం గాల్లో ఉండగా ఓ ప్రయాణికుడికి చెందిన పవర్ బ్యాంక్ నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఇండిగో విమానం 6E6115లో ఈ ఘటన చోటుచేసుకుంది.పరిస్థితిని గమనించిన విమాన సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. విమానంలోని అగ్నిమాపక భద్రతా పరికరాలను ఉపయోగించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయినప్పటికీ, ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా విమానాన్ని చెన్నైకి తీసుకెళ్లకుండా హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు. [ IndiGo Flight, IndiGo Flight Fire, Power Bank Fire, Delhi to Chennai Flight, Flight Diverted to Hyderabad, Shamshabad Airport, Hyderabad Airport, Emergency Landing, Flight Safety, IndiGo 6E6115, Power Bank Incident, Aircraft Fire Incident, Aviation News, Hyderabad Breaking News, Flight Emergency ]
విమానం శంషాబాద్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందని పలువురు అభిప్రాయపడ్డారు. అప్రమత్తంగా వ్యవహరించిన పైలట్, విమాన సిబ్బందిని ప్రయాణికులు అభినందించారు.సాధారణంగా మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు విద్యుత్ అందించే పవర్ బ్యాంక్ విమానంలో మంటలకు కారణం కావడం చర్చనీయాంశంగా మారింది. అసలు మంటలు ఎందుకు చెలరేగాయి? పవర్ బ్యాంక్‌లో సాంకేతిక లోపం ఏమైనా ఉందా? అనే అంశాలపై అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం. గాల్లో విమానంలోనే మంటలు చెలరేగడంతో ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నప్పటికీ, సిబ్బంది అప్రమత్తతతో విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
http://www.teluguone.com/news/content/indigo-flight-25-234064.html





