గోవా టు హైదరాబాద్‌.. డ్రగ్స్‌ దందా... ఒకరు అరెస్ట్‌.!

Publish Date:Oct 11, 2026

Advertisement

గోవా కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్‌ దందా హైదరాబాద్‌ వరకు విస్తరించినట్లు పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గోవా నుంచి హైదరాబాద్‌కు మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర నెట్‌వర్క్‌పై తెలంగాణ ఈగల్‌ (EAGLE) ఫోర్స్‌, హైదరాబాద్‌ పంజాగుట్ట పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో ప్రధాన సరఫరాదారుగా అనుమానిస్తున్న కుస్టోడియో ఫెర్నాండెజ్‌ అలియాస్‌ క్రిస్టీని గోవాలో అరెస్టు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా అతడి బ్యాంకు ఖాతాల్లో సుమారు రూ.48.4 లక్షల క్రెడిట్‌ లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. నిందితుడి మొబైల్‌ ఫోన్‌ డేటా ఆధారంగా తెలంగాణకు చెందిన 25 మందికి పైగా వ్యక్తుల వివరాలు కూడా వెలుగులోకి రావడంతో దర్యాప్తును మరింత విస్తృతం చేశారు. ఈ డ్రగ్స్‌ నెట్‌వర్క్‌ గుట్టు రట్టు కావడానికి పంజాగుట్టలో నమోదైన కేసు కీలకంగా మారింది. 2026 మే 9న గోవా నుంచి తీసుకొచ్చిన మాదకద్రవ్యాలను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఆర్‌. కేశవ్‌ రాజ్‌ సింగ్‌ను పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

అతడి వద్ద ఉన్న కారును తనిఖీ చేయగా డ్యాష్‌బోర్డులో 13 గ్రాముల ఎండీఎంఏ (MDMA), 7 గ్రాముల చరస్‌ లభించాయి. దీంతో ఎన్డీపీఎస్‌ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో ఆయుష్‌ గుప్తా, రోహన్‌ విలియమ్స్‌, లక్కిరెడ్డి నిఖిల్‌ అనురాగ్‌ పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. వీరు మాదకద్రవ్యాలు కొనుగోలు చేసేందుకు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల విచారణలో కేశవ్‌ రాజ్‌ సింగ్‌ కీలక విషయాలు వెల్లడించిన వివరాలు గోవాలోని డ్రగ్స్‌ సరఫరాదారుల వరకు పోలీసులను తీసుకెళ్ళాయి. మారేడుపల్లికి చెందిన వేదాంక్‌, గోవాకు చెందిన క్రిస్టీ అలియాస్‌ ఫెర్నాండెజ్‌ వద్ద నుంచి మాదకద్రవ్యాలు కొనుగోలు చేసి పరిచయస్తులకు విక్రయిస్తున్నట్లు తెలిపాడు. 2026 ఏప్రిల్‌ రెండో వారంలో గోవాకు వెళ్లి సుమారు రూ.40 వేల విలువైన ఎండీఎంఏ, చరస్‌ కొనుగోలు చేసినట్లు వెల్లడించాడు. వాటిని హైదరాబాద్‌లో దాదాపు రూ.80 వేలకు విక్రయించాలని ప్రణాళిక వేసుకున్నట్లు విచారణలో పేర్కొన్నాడు.ఈ సమాచారం ఆధారంగా గోవాలో ఉంటూ హైదరాబాద్‌కు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ప్రధాన వ్యక్తులపై పోలీసులు దృష్టి సారించారు. 

ఈ క్రమంలోనే ఉత్తర గోవాలోని కలంగుట్‌, బార్డేజ్‌ ప్రాంతాలకు చెందిన క్రిస్టీని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. క్రిస్టీ అరెస్టు అనంతరం అతడి బ్యాంకు ఖాతాలను పరిశీలించిన పోలీసులు సుమారు రూ.48.4 లక్షల క్రెడిట్‌ లావాదేవీలను గుర్తించారు. డ్రగ్స్‌ కొనుగోళ్లకు సంబంధించిన నగదు వివిధ ఏటీఎంల ద్వారా అతడి ఖాతాల్లో జమ అయినట్లు దర్యాప్తులో వెల్లడైంది.గోవాకు చెందిన నిందితుడి అనుచరులు హైదరాబాద్‌కు వచ్చి వినియోగదారులకు మాదకద్రవ్యాలు అందజేసేవారని, వారి నుంచి నగదు తీసుకుని స్థానిక ఏటీఎంల ద్వారా క్రిస్టీ ఖాతాల్లో జమ చేసేవారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విధంగా నగదు బదిలీలకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తూ డ్రగ్స్‌ సరఫరా వ్యవస్థలో ఎవరెవరి పాత్ర ఉందనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. క్రిస్టీ మొబైల్‌ ఫోన్‌ను ఫోరెన్సిక్‌ విశ్లేషణ చేయగా హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన పలువురి వివరాలు బయటపడ్డాయి. 

డ్రగ్స్‌ కొనుగోలు నెట్‌వర్క్‌తో సంబంధాలు ఉండవచ్చని భావిస్తున్న తరుణ్‌, అవ్యక్త్‌ రెడ్డి, శ్రీరామ్‌, విక్రాంత్‌, రిచు, గోకుల్‌, విష్ణు, సూద్‌, చేతన్‌, అరవింద్‌, హమీద్‌, సునీల్‌, అజయ్‌ వర్మ, సలీత్‌, పరాజిత్‌, వినీత్‌, అర్జున్‌, ఈశ్వర్‌, శరణ, కరణ్‌, ప్రీతమ్‌, తేజ్‌దీప్‌, రవీందర్‌, మనోజ్‌, అధిప్‌ తదితరుల పేర్లు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం... అయితే, మొబైల్‌ ఫోన్‌లో పేరు లేదా ఫోన్‌ నంబర్‌ ఉన్నంత మాత్రాన సంబంధిత వ్యక్తులను నేరస్థులుగా పరిగణించలేమని దర్యాప్తు అధికారులు స్పష్టం చేశారు. వారి కాల్‌ డేటా, ఆర్థిక లావాదేవీలు, ఇతర ఆధారాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే చట్టప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ డ్రగ్స్‌ నెట్‌వర్క్‌లో ‘నిగి’ అనే నైజీరియన్‌ పౌరుడి పాత్రపైనా పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. గోవా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ భారతీయ అనుచరుల ద్వారా మాదకద్రవ్యాలను సరఫరా చేయిస్తున్నాడనే అనుమానంతో అతడికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. గోవా, హైదరాబాద్‌ మధ్య సాగుతున్న డ్రగ్స్‌ సరఫరా మార్గాలు, నగదు లావాదేవీలు, మధ్యవర్తుల పాత్రపై ఈగల్‌ ఫోర్స్‌, పంజాగుట్ట పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మొబైల్‌ ఫోన్‌ డేటా, బ్యాంకు లావాదేవీల ఆధారంగా ఈ నెట్‌వర్క్‌లోని ఇతర వ్యక్తుల పాత్రను నిర్ధారించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

 

 

[ Goa to Hyderabad Drug Racket, Hyderabad Drugs Case, Custodio Fernandez, Christy Drug Supplier, Telangana EAGLE Force, Panjagutta Police, MDMA Drugs, Charas Seizure, Inter-State Drug Network, ₹48.4 Lakh Bank Transactions, Goa Drug Smuggling, Hyderabad Drug Supply, Narcotic Drugs Case, NDPS Act, Drug Racket Investigation, Telangana Drugs News, Hyderabad Crime News ]

By
en-us Political News

  
ఏకంగా 21 పెళ్లిళ్లు చేసుకున్న బెగ్గర్.!
భారతీయ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రధాన ఎన్నికల సంఘం (సీఈసీ) జ్నేಶ್ కుమార్ రాజీనామా డిమాండ్ కలకలం రేపుతోంది.
ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో పవర్ బ్యాంక్‌లో మంటలు చెలరేగడం కలకలం రేపింది.
చంద్రబాబు అరెస్ట్ సమయంలో రోడ్డెక్కింది మేమే.. డిప్యూటీ సీఎం.!
పాత కరెన్సీ నోట్లకు భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తామంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చి అమాయకులను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ల
దేశ రాజధానిలో నిరసనల నేపథ్యంలో విధించిన కఠిన నిబంధనలపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది.
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకున్న ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
ఆడుతూ పాడుతూ గడపాల్సిన వయసులోనే ఐదేళ్ల చిన్నారి అరేలియా జీవితం విషాదాంతమైంది.
భర్త మంచానికే పరిమితమయ్యాడు.. కుటుంబ బాధ్యతలు ఓవైపు.. జీవితంలో ఎదురైన కష్టాలు మరోవైపు
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
విశాఖపట్నంలో అర్ధరాత్రి వేళ హైవేపై జరిగిన కార్ ఛేజింగ్‌ కలకలం రేపింది.
దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతల అరెస్టు వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.