నల్ల సముద్రంలో చావు భయం..ప్రాణాలరచేతిలో పెట్టుకుని 13 మంది భారత నావికులు.!

Publish Date:Jul 29, 2026

Advertisement

యుద్ధాలు  సరిహద్దులకే పరిమితం కావడం లేదు. ఆ యుద్ధంతో ఎటువంటి సబంధం లేకుండా బతుకు కోసం సముద్ర అలలపై కొలువులు చేసే నావికుల జీవితాలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి.  ప్రస్తుతం ఉక్రెయిన్   రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా  నల్ల సముద్రంలో  భయానక పరిస్థితి నెలకొంది.  ఉక్రెయిన్‌లోని  చోర్నోమోర్స్క్   పోర్టులో నిలిపి ఉంచిన  ఎం.వీ. అమీర్1  వాణిజ్య కార్గో నౌకలో 13 మంది భారత నావికులు సహా మొత్తం 15 మంది సిబ్బంది చిక్కుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయంభయంగా గడుపుతున్నారు.  నిరంతర   క్షిపణి, ఆత్మాహుతి డ్రోన్ దాడుల మధ్య ఏ క్షణంలో  ఏం జరుగుతుంతో.. ఏ క్షణాన ఊపిరి ఆగిపోతుందో అన్న భయంతో క్షణమొక యుగంగా గడుపుతున్నారు.  

ఫార్వార్డ్ సీమెన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎఫ్సీయూఐ) సామాజిక మాధ్యమ  వేదికగా  షేర్ చేసిన నివేదిక వీడియోతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది.  నౌక పరిసర ప్రాంతాల్లో నిరంతరం పేలుళ్లు జరుగుతుండటం, దట్టమైన నల్లటి పొగ ఆకాశాన్ని కమ్మేస్తుండటం ఎఫ్సీయూ ఐవిడుదల చేసిన వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. యుద్ధ క్షేత్రంలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం దారుణమని ఆ నివేదిక పేర్కొంది.  ఓడకు అతి  సమీపంలో వరుసగా డ్రోన్లు, క్షిపణులు  పడుతుండటంతో సిబ్బంది  తీవ్ర భయాందోళనల్లో కూరుకుపోయారని పేర్కొంది.  

భారత ప్రభుత్వం, విదేశాంగ మంత్రిత్వ శాఖ, సదరు షిప్పింగ్ కంపెనీ యాజమాన్యం తక్షణమే జోక్యం చేసుకుని, ఆ నౌకలో చిక్కుకున్న  మంది బారత నావికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చి స్వదేశానికి తరలించాలని ఎఫ్ఎస్‌యూఐ విజ్ఞప్తి చేసింది. యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకోకుంటే ఆ నావికుల ప్రాణాలు పోయే అవకాశం ఉందని పేర్కొంది.  

నల్ల సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు పెరగడం ఇదే మొదటిసారి కాదు. గత వారంలో ఎంవీ ఒమోర్ఫీ అనే నౌకపై జరిగిన డ్రోన్ దాడిలో ఒక భారత నావికుడు దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఆ  ఘటనపై ఇండియా తీవ్రంగా స్పందించింది. న్యూఢిల్లీలోని ఉక్రెయిన్ రాయబారి ఒలెక్సాండర్ పాలిష్‌చుక్‌ను విదేశాంగ శాఖ నేరుగా పిలిపించి.. నావికులపై, వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ నిరసన వ్యక్తం చేసింది.  ఇప్పుడు   మరో 13 మంది ఇండియన్స్ నల్ల సముద్రంలో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని క్షణమొక యుగంగా గడుపుతున్న పరిస్థితి ఆందోళనకలిగిస్తోంది.   ప్రభుత్వం వెంటనే విదేశాంగ దౌత్య మార్గాల ద్వారా ఒత్తిడి పెంచి తమ వారిని సురక్షితంగా ఇంటికి చేరుస్తుందని నావికుల కుటుంబ సభ్యులు కంటిమీద కునుకు లేకుండా నిరీక్షిస్తున్నారు.

Indian sailors stuck in Ukraine, Chornomorsk port attack, MV Amir 1 cargo ship, Black Sea drone attacks, Forward Seamens Union of India, TeluguOne

By
en-us Political News

  
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎం పోస్టులు ఇప్పిస్తామంటూ ఉమ్మడి వరంగల్, హనుమకొండ జిల్లాల్లో రూ.లక్షల్లో వసూలు చేస్తున్న దళారీల దందా వెలుగులోకి వచ్చింది. యూనియన్ ముసుగులో జరుగుతున్న ఈ అక్రమాలపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజారెడ్డి విచారణ ప్రకటించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్‌లోని సరూర్ నగర్ సాగరిక ఇంటెగ్రేటెడ్ హైస్కూల్‌లో రాఖీలు, తిలకం తొలగింపు వివాదంపై బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి టీచర్‌ను హిజాబ్‌‌పై ప్రశ్నించడం సంచలనంగా మారింది. పోలీసులు కార్పొరేటర్‌పై సుమోటో కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్న కూతురిపై లైంగిక దాడికి యత్నించిన భర్త శ్రీనివాస్‌ను భార్య రమాదేవి గొడ్డలితో నరికి చంపింది. అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లా సీఐఎస్ఎఫ్ క్యాంపులో హెడ్ కానిస్టేబుల్ ఏకే 47 రైఫిల్‌తో చేసిన విచక్షణారహిత కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి చెందారు. సేవా పవర్ ప్రాజెక్ట్ వద్ద జరిగిన ఈ దారుణ ఘటనపై సీఐఎస్ఎఫ్ డీజీ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
ఒడిశా తాల్చేర్ ప్రాంతంలో సంచలనం సృష్టించిన దారుణ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్ మాధాపూర్‌లో స్పా సెంటర్ ముసుగులో నడుస్తున్న అక్రమ వ్యభిచార రాకెట్‌ను ఎస్‌ఓటీ పోలీసులు మట్టుబెట్టారు. నలుగురు యువతులను రక్షించి, రూ. 45 వేల నగదు, 8 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
యాదాద్రి భువనగిరి జిల్లా చల్లూరులో భూభారతి వెబ్‌సైట్ ద్వారా ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండానే 7.18 ఎకరాల భూమి వేరొకరి పేరు మీదకు మారిపోయింది. యజమానులకు తెలియకుండా జరిగిన ఈ భారీ భూ భాగోతం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఏపీ సచివాలయ ఉద్యోగాలు, డీఎస్సీ నియామకాలు మరియు మెడికల్ సీట్లలో నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్ల అక్రమాలపై విచారణ ముమ్మరమైంది. హైకోర్టు ఆదేశాలు, విజిలెన్స్ తనిఖీలు మరియు సాప్ చేపట్టిన స్కిల్ టెస్ట్ వివరాలు ఇక్కడ చూడండి.
150 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న వందేమాతరం గేయానికి జాతీయ గీతంతో సమాన హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ తెచ్చింది. 3 నిమిషాల 10 సెకన్ల ఆలాపన, సుప్రీంకోర్టు విచారణ మరియు చట్టపరమైన నిబంధనల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
హైదరాబాద్ రాయదుర్గంలో ఐటీ కంపెనీ మహిళా ఉద్యోగిపై ఫుడ్ వెండర్ షేక్ నబీ కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి లైంగిక దాడి చేశాడు. ప్రైవేట్ వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తూ రూ. 43 లక్షలు నొక్కేసి మూడేళ్లు వేధించిన నిందితుడిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు.
విజయవాడ ఎన్‌టీపీఎస్ కాలువలో లభించిన మహిళ శరీర భాగాల మిస్టరీ వీడింది. చేతిపై ఉన్న ఈక టాటూ ఆధారంగా మృతురాలిని మంగళగిరికి చెందిన 29 ఏళ్ల కళ్యాణిగా గుర్తించిన పోలీసులు, విచారణలో మటన్ షాప్ షఫీ చేసిన కిరాతక హత్యను ఛేదించారు.
కన్యాకుమారి యూట్యూబర్ ఇంట్లో ఏకంగా 118 సవర్ల (944 గ్రాములు) బంగారం, భారీగా నగదు చోరీకి గురయ్యాయి. సోషల్ మీడియాలో రీల్స్ కోసం చూపించిన సంపదే దొంగలను ఆకర్షించిందా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.