డిజిటల్ అరెస్ట్ కేటుగాళ్లకు నో బెయిల్.. సుప్రీం ఆదేశాలు.!

Publish Date:Jul 29, 2026

Advertisement

దేశవ్యాప్తంగా అందరినీ  భయాందోళనలకు గురిచేస్తూ, లక్షలాది రూపాయలను కొల్లగొడుతున్న  డిజిటల్ అరెస్ట్  సైబర్ నేరాలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం   తీవ్రంగా స్పందించింది. సైబర్ కేటుగాళ్లు పన్నుతున్న ఈ డిజిటల్ పద్మవ్యూహం కేవలం ఒక సాధారణ మోసం కాదని పేర్కొంది. డిజిటల్ అరెస్టును  పట్టపగలు జరిగే  బందిపోటు దోపిడీతో సమానమని అభివర్ణించింది.   ఇలాంటి  డిజిటల్ దోపిడీల్లో భాగమైన నిందితులకు అత్యంత అసాధారణ పరిస్థితుల్లో మినహా ఎట్టిపరిస్థితుల్లోనూ బెయిల్ మంజూరు చేయరాదని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు దేశంలోని అన్ని ట్రయల్ కోర్టులతో పాటు రాష్ట్రాల హైకోర్టులకు కూడా సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.  

 రోజురోజుకూ పెరిగిపోతున్న ఈ సైబర్ ముఠాల దందాను అరికట్టడానికి   సాధారణ చట్టాలు సరిపోవనీ, అందుకే ఇకపై డిజిటల్ అరెస్టు మోసాలను పాతకాలపు ఐటీ చట్టాల కింద కాకుండా,  వ్యవస్థీకృత నేరాల నియంత్రణ చట్టం కింద నమోదు చేసి,   దర్యాప్తు జరపాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది.  

  డిజిటల్ అరెస్ట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక నిందితుడు, ప్రధాన సైబర్ క్రిమినల్ కోసం కేవలం బ్యాంక్ ఖాతాను తెరిచి సహకరించానని, అంతకు మించి తనకు ఎలాంటి ప్రత్యక్ష ప్రమేయం లేదా కుట్ర లేదని పేర్కొంటూ బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేయడమే కాకుండా, ఆ బెయిలు పిటిషన్ ను తోసిపుచ్చింది.  సైబర్ మోసగాళ్లకు ఖాతాలు సమకూర్చడం, డబ్బు మళ్లించడానికి మార్గం సుగమం చేయడం కూడా దోపిడీలో భాగస్వామిగా ఉండటమేనని విస్పష్టంగా పేర్కొంది.   

Supreme Court on Digital Arrest, No Bail for Cyber Criminals, Organised Crime Control Act, Cyber Crime India, Supreme Court News

By
en-us Political News

  
ఒక టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో ఖవాజా ఆసిఫ్ తాను పీఓకేలో నిరసనలు చేస్తున్న వారిని భారత్‌తో సమానమైన వర్గంలో చేరుస్తున్నానని పేర్కొన్నారు. వారిని కూడా భారతదేశం లాంటి శత్రువులుగానే పరిగణిస్తున్నాననీ, అందుకే ఆ ఆందోళనకారులతో చర్చిందేదే లేదనీ, వారు పాకిస్థాన్ శత్రువులని చెప్పారు.
మూడు దశాబ్దాల భవిష్యత్ ను ముందుగానే చూడగల విజనరీ అయిన చంద్రబాబు నాయుడు 1997లో ఉత్తరాంధ్రకు అంతర్జాతీయ విమానాశ్రయ ఆవశ్యకతను గుర్తించారు. ఆ దిశగా అడుగులు వేశారు. ఇక హుద్‌హుద్ తుఫాను అనంతరం.. సురక్షిత, ఆధునిక విమానాశ్రయం ప్రతిపాదనను ఆయన మరింత గట్టిగా ముందుకు తీసుకువెళ్లారు. ఓ వైపు సముద్ర తీరం, మరొకవైపు మన్యప్రాంతాల నడుమ వ్యూహాత్మక ప్రదేశంగా భోగాపురాన్ని అయిన ఎంపిక చేశారు.
మొదట చర్చల సందర్భంగా, నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులు, యువతపై కొత్త ఎఫ్ఐఆర్ లు నమోదు చేయబోమని, ఇప్పటికే నమోదైన పాత కేసులను కూడా పూర్తిగా ఉపసంహరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేసిన ఆయన ఇప్పుడు.. వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉందంటూ ఆ హామీ అమలుపై వెనక్కు తగ్గిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మిసిర్ బేస్రాపై ఝార్ఖండ్, బిహార్, ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో పోలీసులపై దాడులు, నరమేధాలు, ఐఈడీ పేలుళ్లు, వసూళ్లు సహా ఏకంగా 150కి పైగా కేసులు నమోదయ్యాయి. 2007లో ఖుంటీ పోలీసులు ఇతడిని అరెస్ట్ చేసినప్పటికీ, 2009లో బిహార్‌లోని లఖిసరాయ్ కోర్టు సముదాయంపై మావోయిస్టులు దాడి చేసి అతడిని విడిపించుకుపోయారు. ఆ సంఘటన తర్వాత దాదాపు రెండు దశాబ్దాల అజ్ఞాతంలోనే ఉన్నారు.
వర్షాల తీవ్రత వల్ల పలు జిల్లాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. కామరూప్, ధుబ్రి, లఖింపూర్, దిబ్రూగఢ్ వంటి ప్రధాన ప్రాంతాల్లో నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో వందలాది గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. రహదారులు, వంతెనలు కొట్టుకుపోవడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది.
ఇన్ స్పెక్టర్, బాధిత మహిళ కొంత కాలం పాటు సహజీవనం చేసినట్లు కూడా విచారణలో వెలుగులోకి వచ్చింది. అనంతరం ఈ పరిణా మాల నేపథ్యంలో బాధిత మహిళ ఫిర్యాదుపై ఉన్నతాధి కారులు చేపట్టిన విచారణలో ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు తేలడంతో శాఖాపరమైన చర్యల్లో భాగంగా ఆయనను సస్పెండ్ చేస్తూ హైదరా బాద్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్ లోని పలు ప్రాంతాలలో రహదారులు జలమయమయ్యాయి. వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల మేరకు రెండు గంటల వ్యవధిలోనే నగరంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
ఫార్వార్డ్ సీమెన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా సామాజిక మాధ్యమ వేదికగా షేర్ చేసిన నివేదిక వీడియోతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. నౌక పరిసర ప్రాంతాల్లో నిరంతరం పేలుళ్లు జరుగుతుండటం, దట్టమైన నల్లటి పొగ ఆకాశాన్ని కమ్మేస్తుండటం ఎఫ్సీయూ ఐవిడుదల చేసిన వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
మీ పుస్తకాల అభిరుచికి సరిపోయే సరైన నవలల కోసం వెతుకుతున్నారా? నా లైబ్రరీలోని పుస్తకాలతో ఛాట్‌జీపీటీ చేసిన అద్భుత ప్రయోగం, 30 నిమిషాల్లో అది అందించిన పర్సనలైజ్డ్ బుక్ రికమండేషన్ల రహస్యాలు ఇక్కడ చదవండి.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజా నివేదిక ప్రకారం బంగారం ధరలు త్వరలోనే దిగివచ్చే అవకాశం ఉంది. పసిడి మార్కెట్ పరిస్థితులు, తగ్గుదలకు గల కారణాలు మరియు తాజా ధరల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
కాలిఫోర్నియాలోని 330 MW డేటా సెంటర్ కూలింగ్ కోసం 287 మిలియన్ గాలన్ల వ్యవసాయ నీటిని మళ్లించే ప్రయత్నాన్ని వాటర్ డిస్ట్రిక్ట్ అడ్డుకుంది. $10 బిలియన్ల ప్రాజెక్ట్ చుట్టూ రేగిన చట్టపరమైన పోరాటం మరియు రైతు ఆందోళనల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
3D టీవీలు కనుమరుగవుతున్న వేళ, బ్లూ రే నుండి ఆపిల్ విజన్ ప్రో స్పేషియల్ వీడియోల వరకు అన్ని 3D ఫార్మాట్లను ప్లే చేసే ఉచిత SyLC 3D ప్లేయర్ గురించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ డైట్ అడిగి తెలుసుకుని, ఏడాదిన్నర పాటు పాటించిన సంజూ శాంసన్ ఆ తర్వాత ఎందుకు గివ్ అప్ ఇచ్చాడో ఓపెన్‌గా చెప్పేశాడు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.