భారత్ అన్నంత పనీ జరిగింది. పహల్గాం ఉగ్రదాడికి తప్పక బదులు తీర్చుకుంటాని ప్రకటించిన భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్ చేసింది. మంగళవారం (మే6) అర్ధరాత్రి దాటిన తరువాత ఒంటిగంట నలభై నాలుగు నిమిషాల సమయంలో ఒక్కసారిగా పీవోజేకేలోని ఉగ్ర శిబిరాలపై బాంబుల వర్షం కురిపించింది.
ఇప్పటికే బిక్కు బిక్కుమని బతుకుతున్న ఉగ్రవాదులకు భారత వైమానిక దళాల దాడులతో దిమ్మ తిరిగిపోయింది. పాక్ లోని ఉగ్ర వాదులుండే స్థావరాలను ఖచ్చితంగా టార్గెట్ చేసిన భారత సైన్యం.. దుమ్ము రేపింది. మొత్తం 9 ఉగ్ర స్థావరాలపై భారత ఆర్మీ మెరుపు దాడులకు పాల్పడింది. ఈ దాడి ఉగ్రస్థావరాలపైనే కానీ పాకిస్థాన్ సైనిక స్థావరాలపై కాదని ఇండియన్ ఆర్మీ స్పష్టం చేసింది.
ముఖ్యంగా లష్కరే తోయిబా హెడ్ క్వార్టర్ మురిడ్కే, జైష్ ఏ మహమద్ కేంద్ర స్థానం బహవల్పూర్ లో ఈ దాడులు జరిపింది. పాక్ ఆర్మీ సైతం ఈ దాడులు జరిగినట్టు ప్రకటించింది. ఈ దాడులలో పలువురు ఉగ్రవాదులు హతం అయ్యారు. మరింత మంది గాయపడ్డారు. అయితే పాక్ ఆర్మీ మాత్రం ముగ్గరు మృతి చెందగా, 12 మంది క్షతగాత్రులయ్యారని ప్రకటించింది. ఇదిలా ఉంటే బుధవారం (మే 7) దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్ నడుపుతున్న వేళ.. పాకిస్థాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లోని ఉగ్ర స్థావరాలపై భారత్ మెరుపు దాడి చేయడం గమనార్హం. ఆపరేషన్ సింధూర్ పేరిట భారత ఆర్మీ చేసిన ఈ దాడులపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ భారత్ మాతాకీ జై అని ఎక్స్ లో పోస్ట్ చేశారు. భారత సైన్యం న్యాయం జరిగింది. జైహింద్ అని ట్వీట్ చేసింది.
అయితే ఇదే దాడి అంశంపై పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. సైతం స్పందించారు. మోసపూరితంగా శతృవు తమపై దాడి జరిపిందనీ.. ఈ దాడికి బదులు చెబుతామని ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత సరిహద్దులోని పూంచ్ రాజౌరి సెక్టార్లో పాక్ సైన్యం కాల్పులు జరిపింది. దీన్ని సమర్ధవంతంగా తిప్పి కొట్టారు భారత సైనికులు దీటుగా తిప్పికొట్టారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/indian-army-attacks-on-terrorists-bases-in-pok-39-197595.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.