కర్ణాటక మాజీమంత్రి, ఎమ్మెల్యే గాలి జనార్థన్ రెడ్డిని పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. ఓబులాపురం మైనింగ్ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు మంగళవారం (మే7) గాలి సహా ఐదుగురికి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తుది తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పు అనంతరం గాలి జనార్ధనరెడ్డి సహా ఐదుగురినీ పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. కోర్టు ఆవరణలోనే వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం చంచల్ గుడా జైలుకు తరలించారు.
అంతకు ముందు తుది తీర్పునకు ముందు.. తాను ఇప్పటికే నాలుగేళ్ల జైలు జీవితం అనుభవించాననీ, దానిని పరిగణనలోనికి తీసుకుని శిక్ష తగ్గించాలనీ కోరారు. దీనిపై కోర్టు సీరియస్ అయ్యింది. మీ నేరాలకు యావజ్జీవ శిక్షకు అర్హులు అని వ్యాఖ్యానించింది. అక్రమ మైనింగ్ కేసులో పదేళ్ల జైలు ఎందుకు విధించకూడదో చెప్పండంటూ ప్రశ్నించింది. అనంతరం ఏడేళ్ల శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
గతంలో ఇదే అక్రమ మైనింగ్ కేసులో అరెస్టైన గాలి జనార్దన్ రెడ్డి తనకు బెయిలు కోసం ఏకంగా న్యాయమూర్తికే ముడుపులు ఇచ్చారు. అప్పట్లో కూడా చంచల్ గూడ జైలులో ఉన్న గాలి జనార్దన్ రెడ్డి తనకు బెయిలు వచ్చేలా సమీపబంధువు మధ్యవర్తిత్వంతో న్యాయమూర్తికి వంద కోట్టు ముడుపులు చెల్లించేలా డీల్ కుదుర్చుకున్నారు. ఆ డీల్ మేరకే గాలి జనార్దన్ రెడ్డికి అప్పట్లో బెయిలు లభించింది. అయితే ఈ కేసులో అప్పటి న్యాయమూర్తి పట్టాభిరామారావు కూడా అరెస్టయ్యారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/gali-janardanreddy-in-chanchalaguda-jail-39-197597.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.