కామన్వెల్త్ గేమ్స్-2022 .. భారత్ శుభారంభం
Publish Date:Jul 29, 2022
Advertisement
కామన్వెల్త్ గేమ్స్‌లో తొలి రోజు భారత క్రీడాకారుల ఆధిపత్యంలో దూసుకుపోతున్నారు. మిక్స్‌డ్ టీం గ్రూప్-ఎ బ్యాడ్మింటన్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పీవీ సింధు 3-0తో విజయం సాధించింది. కిడాంబి శ్రీకాంత్, మిక్స్‌డ్ డబుల్స్ జట్టు తమ మ్యాచ్ లను గెలిచి ఇండియాను 2-0 ఆధిక్యంలో తీసుకెళ్లారు.
ఘనాతో జరిగిన హాకీ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు సంపూర్ణ ఆధిపత్యం సాధించి 5-0తో విజయం సాధించింది. అలాగే, 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ స్విమ్మింగ్‌లో శ్రీహరి నటరాజ్ సెమీస్‌కు అర్హత సాధించాడు. ఇండియన్ బాక్సర్ శివ థాపా 63 కేజీల విభాగంలో పాకిస్థాన్ బాక్సర్ సులేమాన్ బలోచ్‌ను 5-0తో విజయం సాధించారు. మహిళల టీటీ జట్టు దక్షిణాఫ్రికాను 3-0తో ఓడించింది
స్విమ్మింగ్ లో తొలి రోజు భారత్ శుభారంభం చేసింది. వంద మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ స్విమ్మింగ్‌లో భారత స్విమ్మర్ శ్రీహరి నటరాజ్ సెమీఫైనల్స్‌కు చేరుకున్నాడు. కాగా పాకిస్థాన్ బాక్సర్ సులేమాన్ బలోచ్‌తో జరిగిన 63 కేజీల బౌట్‌లో భారత బాక్సర్ శివథాపా 5-0 తో ఓడించి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నాడు. భారత మహిళల టీటీ జట్టు గ్రూప్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను 3-0తో ఓడించింది.
శ్రీజ ఆకుల-రీత్ టెన్నిసన్‌తో కూడిన డబుల్స్ జట్టు లైలా ఎడ్వర్డ్స్-డేనిషా జయవంత్ పటేల్‌తో కూడిన జట్టును వరుస సెట్లలో ఓడించింది. శ్రీజ అకుల, రీత్ టెన్నిసన్ డబుల్స్ జట్టు లైలా ఎడ్వర్డ్స్ , డానీషా జయవంత్ పటేల్‌లను వరుస గేమ్‌లలో ఓడిం చింది. స్టార్ టీటీ ప్లేయర్ మనీకా బాత్రా.. ముష్ఫిక్ కలామ్‌ను 11-5, 11-3, 11-2తో మట్టికరిపించింది. ఆ తర్వాత డేనిష్ జయవంత్‌ను శ్రీజ ఆకుల ఓడించింది. అయితే, భారత్‌కు తొలి రోజు కొన్ని పరాజయాలు కూడా తప్పలేదు. స్విమ్మింగ్ (50 మీటర్ల బటర్‌ఫ్లై, 400 మీటర్ల ఫ్రీ స్టైల్), సైక్లింగ్ ఈవెంట్స్‌లో పరాజయాలు మూటగట్టుకుంది.
ఇదిలా ఉండగా, భారత మహిళలతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించి బోణీ కొట్టింది. భారత్ నిర్దేశించిన 155 పరుగుల విజయ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా మరో ఓవర్ మిగిలి ఉండగానే 7 వికెట్లు కోల్పోయి పూర్తిచేసింది. భారత బౌలర్ రేణుక సింగ్ ఆసీస్ టాపార్డర్‌ను కూల్చినప్పటికీ చివరి వరుస బ్యాటర్లు ఆష్లీ గార్డెనర్, గ్రేస్ హారిస్ భారత్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి జట్టుకు విజయాన్ని అందించారు. గార్డెనర్ 35 బంతుల్లో 9 ఫోర్లతో52, గ్రేస్ హారిస్ 20 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 37 పరుగులు చేశారు. అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన హర్మన్‌ప్రీత్జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్ 52 సెంచరీ సాధించగా, షెఫాలీ వర్మ 48 పరుగులు చేసి రెండు పరుగుల తేడాతో అర్ధ సెంచరీ మిస్సైంది. ఆసీస్ బౌలర్లలో జొనాసెన్ 4 వికెట్లు పడగొట్టింది. భారత జట్టు తన రెండో మ్యాచ్‌ను ఈ నెల 31న పాకిస్థాన్‌తో ఆడనుంది.
http://www.teluguone.com/news/content/india-great-start-at-games-39-140843.html





