బొమ్మ.. వామ్మో..
Publish Date:Sep 1, 2020
Advertisement
బొమ్మల మార్కెట్ 66వేలకోట్లపైనే.. చిన్నారుల్లో మేధాశక్తిని, సృజనాత్మకతను పెంచుతూ మనోవికాసానికి ఉపయోగేవాటిలో బొమ్మలదే అగ్రస్థానం. ఒక్కప్పుడు మట్టితో, కర్రతో, లక్కతో బొమ్మలను తయారుచేసేవారు. కాలక్రమేణా వస్తువుల తయారీలో ప్లాస్టిక్ వచ్చి చేరడంతో వివిధ రంగుల్లో, రూపాల్లో బొమ్మలను తయారు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ బొమ్మల పరిశ్రమ టర్నోవర్ దాదాపు తొంభై బిలియన్ల యూస్ డాలర్లు. అంటే మన కరెన్సీలో 66,18,83,25,00,00 రూపాయలు అన్నమాట. వేల కోట్ల టర్నోవర్ జరుగుతుంది కాబట్టే మన ప్రధానమంత్రి నోట బొమ్మల మాట వచ్చిందన్నమాట. వామ్మో బొమ్మ అని ఇప్పుడు అనండి. పూర్వకాలంలో మట్టిపిడతలు, కొయ్యబొమ్మలతో పిల్లలు ఆడుకునేవారు. మన దేశంలో బొమ్మల తయారీకి ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు చాలానే ఉన్నాయి. అయితే ప్రపంచీకరణ, పారిశ్రామికరణ నేపధ్యంలో అన్ని రంగాల్లో మాదిరిగానే బొమ్మల పరిశ్రమలోనూ విప్లవాత్మక మార్పులు వచ్చి లోకల్ బొమ్మలకు గిరాకీ తగ్గిపోయింది. చిన్నారుల చేతిలో గిల్లక్కాయ కూడా ఇంపోర్ట్ చేసుకున్నదే. ఇప్పుడు కేంద్రప్రభుత్వం వోకల్ ఫర్ లోకల్ నినాదంతో తిరిగి స్థానిక ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించే పనిలో నిమగ్నమైంది. ఆటవస్తువుల తయారీలో, చవకైన వస్తువుల తయారీలో ప్రపంచ మార్కెట్ ను ఆక్రమించిన చైనాను దెబ్బకొట్టడం కూడా ఎత్తుగడే. ఏదీ ఏమైనా మన చిన్నారులకు కావల్సిన బొమ్మలను మనమే తయారుచేసుకుందాం అంటూ ప్రధాని మోడీ పిలుపు ఇవ్వడంతో ఆయారాష్ట్రాలు తమ రాష్ట్రంలో కనిపించకుండా పోయిన బొమ్మలను.. బొమ్మల పరిశ్రమలను, తయారీదారులను వెతుకుతున్నారు. 400 వందల ఎకరాల్లో.. మానవ నాగరికతలో బొమ్మలు బొమ్మలతో ఆడుకోవడంతో పిల్లలు మొదటి పాఠాలను నేర్చుకుంటారు. సమాజంలోని సామాజిక-సాంస్కృతిక చరిత్రను ప్రతిబింబిస్తాయి. రాతితో చెక్కబడిన బొమ్మల నుంచి అత్యంత ఆధునిక బార్బీ బొమ్మల వరకు, మానవ నాగరికత బొమ్మలలో ప్రతిబింబిస్తుంది. దేశం పేరుగాంచిన బొమ్మల తయారీ ప్రాంతాలు ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపుమేరకు దేశంలోని బొమ్మల తయారీ కేంద్రాలన్నీ కళకళలాడి.. కళాకారులకు చేతినిండ పని.. చిన్నారులకు ఆరోగ్యకరమైన బొమ్మలు అందితే వోకల్ ఫర్ లోకల్ నినాదం నిజమైనట్లే..
కర్ణాటక ప్రభుత్వం దేశంలోనే మొదటి అతి పెద్ద బొమ్మల పరిశ్రమ తమ రాష్ట్రంలోని కొప్పాలలో అభివృద్ధి చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. బొమ్మల తయారీ కోసం తమ రాష్ట్రానికి ఐదువేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని, దాదాపు 40వేల మందికి ఉపాధి లభిస్తుందని లెక్కలు వేస్తున్నారు. నాలుగువందల ఎకరాల్లో అత్యంత విశాలంగా పరిశ్రమను నెలకొల్పి ఆధునిక ఆటవస్తువులను తయారుచేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
భారతీయ సంస్కృతిలో, సంప్రదాయంలో బొమ్మలకు విశేషస్థానం ఉంది. అనేక జానపద కథలు, ఇతిహాసాలు,పురాణాల్లో బొమ్మల ప్రస్తావన ఉంది. బొమ్మలతో కథలు చెప్పే విధానం చాలా పురాతనమైంది. చిన్నారుల్లో, సృజనాత్మక మానసిక వికాసం పెంచేలా ఈ బొమ్మలు ఉండేవి. వివిధ ఆకారాలు, సైజుల్లో బొమ్మలు తయారుచేసే వృత్తిపై ఆధారపడిన కళాకారుల కుటుంబాలు వేలసంఖ్యలో ఉన్నాయి. కలప, రాయి, బంకమట్టి, వస్త్రం, జంతువుల తోలు మొదలైన వాటిని బొమ్మల తయారీలో వాడుతారు.
భారతదేశంలో, సింధు లోయ నాగరికత ఉన్న ప్రదేశం నుండి వెలికితీసిన తొలి బొమ్మలు ఐదువేల సంవత్సరాల నాటివి. బొమ్మల సంస్కృతి ఇప్పటికీ మనుగడలో ఉన్నా వాటి రూపురేఖలు, తయారీ విధానం, ఉపయోగించే ముడిపదార్థంలో మార్పులు వచ్చాయి. భారతదేశంలోని ప్రతి ప్రాంతానికి బొమ్మలు తయారు చేయడంలో ప్రత్యేకమైన శైలి ఉంది. ప్రతి బొమ్మకు స్వంత కథ ఉంది. బొమ్మల తయారీకి సాంప్రదాయ కేంద్రాలుగా అనేక ప్రాంతాలు పేరుగాంచాయి. తెలంగాణలోని నిర్మల్, ఆంధ్రప్రదేశ్ లోని కొండపల్లి కొయ్యబొమ్మలకు ప్రసిద్ధి. కర్ణాటకలోని చన్నపట్నం, తమిళనాడులోని తంజావూరు, అస్సాంలోని ధుబ్రీ, ఉత్తరప్రదేశ్ లోని వారణాసి వంటి బొమ్మల తయారీ కేంద్రాలు ఎన్నో ఉన్నాయి.
http://www.teluguone.com/news/content/india-can-become-big-hub-for-toy-production-39-103516.html