Publish Date:Mar 24, 2013
ఆస్ట్రేలియాపై ఇండియా రికార్డ్ విజయం సాధించింది. ఢిల్లీలో జరిగిన చివరి టెస్టు లో భారత్ ఆరు వికెట్లతో గెలుపొందింది. నాలుగు టెస్టుల సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసి చరిత్ర సృష్టించింది. 80ఏళ్ల భారత్ క్రికెట్ చరిత్రలో ఇదే అతి పెద్ద సిరీస్ విజయం. చివరిసారిగా 1993-94లో ఇంగ్లండ్‌పై అజహరుద్దీన్ టీం 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. రవీంద్ర జడేజా 'మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్', రవిచంద్రన్ అశ్విన్ కు 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్' వరించాయి.
తొలి ఇన్నింగ్స్‌లో ఎనిమిది వికెట్ల నష్టంతో 266 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్ కేవలం 6 పరుగులు మాత్రమే జోడించి మిగిలిన ఇషాంత్(0),ఓజా(0) వెను వెంటనే ఔటయ్యారు. దీంతో భారత్ తొలిఇన్నింగ్స్‌లో 272 పరుగులు చేసి 10 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.
అనంతరం సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఆటగాళ్లపై భారత బౌలర్లు విరుచుకుపడ్డారు. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 164 పరుగులకే ఆలౌట్ అయి, భారత్ ముందు 155 పరుగులు విజయలక్ష్యాన్ని ఉంచింది. ఆసీస్ ఆటగాడు సిడల్ ఒంటిపోరాటం చేశాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో సిడిల్ అర్ధసెంచరీ పూర్తి చేశాడు. కోవాన్(24),వేడ్(19) స్మిత్(18) పరుగులు మినహా మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత్ బౌలర్లు జడేజాకు ఐదు వికెట్లు, అశ్విన్, ఓజాకు చెరో రెండు వికెట్లు, ఇషాంత్ శర్మకు ఒక వికెట్ దక్కాయి.
తర్వాత 155 పరుగుల విజయమే లక్ష్యంగా ఆట ప్రారంభించిన భారత్ నిలకడగా ఆడి ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. పుజారా (82)పరుగులు, ధోని(11) పరుగులతో నాటౌట్‌గానిలిచారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/india-australia-36-21886.html
రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు రేపు సందర్శించనున్నారు. ప్రాజెక్టు నిర్మాణం పనుల పురోగతిని సీఎం స్వయంగా పరిశీలించనున్నారు.
టీటీడీ శ్రీవాణి దర్శన టికెట్ల జారీ విధానంలో మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
సోషల్ మీడియాలో కుట్ర పూరిత విద్వేష పోస్టులు పెట్టేవారిపై కఠినంగా వ్యవహరించాలని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.
ఎంపీ అవినాష్ రెడ్డి అంత క్రిమినల్ బుర్ర నాకు లేదని పులివెందుల టీడీపీ ఇన్‌చార్జి బీటెక్ రవి విమర్శించారు.
గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను ఒక్కొక్కటిగా వెలికి తీసుకున్నామని, అక్రమార్కులెవరినీ వదలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి సవిత స్పష్టంచేశారు
హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ వినియోగం, విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు.
జగన్ మీడియా తప్పుడు రాతలపై వేసిన పరువునష్టం కేసులో విశాఖ 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో క్రాస్ ఎగ్జామినేషన్‌కి మంత్రి నారా లోకేష్ హాజరు కానున్నారు.
2025వ సంవత్సరంలో టీమ్ వర్క్ తో చేయడం వల్లే పెట్టుబడుల్లో బెటర్ రిజల్ట్స్ సాధించామని సీఎం చంద్రబాబు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు క్రీడలకు ప్రోత్సాహం ఇవ్వడంలో ముందుంటారన్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్రీడా నగర నిర్మాణం కూడా ఒక భాగం చేసిన సంగతి తెలిసిందే. అదే ఇప్పుడు ధోనీ చంద్రబాబు భేటీకి అత్యంత ప్రాధాన్యత కలగడానికి కారణమైంది.
టోలి చౌక్ వద్ద జిప్టో డెలివరీ బాయ్ వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా స్కిడ్ అయ్యి కింద పడిపోయాడు.
ఆంధ్ర గ్రంథాలయం నిర్వాహకులను అభినందిస్తూ ఎన్టీఆర్ స్వదస్తూరితో రాసిన లేఖ ఆంధ్రప్రదేశ్ పౌర గ్రంథాలయం ఏర్పాటు చేసిన స్టాల్‌లో ప్రదర్శనకు ఉంచారు
కరూర్ తొక్కిసలాట కేసులో టీవీకే చీఫ్ స్టార్ హీరో విజయ్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది.
ఈ స్కామ్ బయటపడగానే అమర్ దీప్ తన ఛార్టర్డ్ ఫ్లైట్ లో దుబాయ్ పారిపోయాడు. దీంతో తెలంగాణ పోలీసులు అమర్ దీప్ పై లుక్ ఔట్ నోటీసు జారీ చేశారు. ఇప్పుడు తాజాగా ఆయన దుబాయ్ నుంచి ముంబైకి వచ్చిన విషయాన్ని ఇమ్మిగ్రేషన్ అధికారుల ద్వారా తెలుసుకున్న తెలంగాణ పోలీసులు ముంబై వెళ్లి అమర్ దీప్ ను అరెస్టు చేశారు.