లక్ష వీసాలు రద్దు.. అమెరికా సంచలన నిర్ణయం
Publish Date:Jan 12, 2026
Advertisement
దేశ భద్రతకు ప్రథమ తాంబూలం అన్న విధానంలో భాగంగానే ట్రంప్ సర్కార్ కఠినాతి కఠినమైన వలస విధానాలను అనుసరిస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. అమెరికా పౌరుల భద్రత, దేశ సార్వభౌమత్వ పరిరక్షణే తమ ప్రథమ ప్రాధాన్యమని పేర్కొంది. జాతీయ, ప్రజా భద్రతకు ముప్పు కలిగించే విదేశీయుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్న అమెరికా విదేశాంగ శాఖ.. రద్దు చేసిన వీసాలలో 8 వేలవిద్యార్థి వీసాలు ఉన్నట్లు తెలిపింది. అలాగే స్పెషల్ టాలెంట్ వీసాలు పాతిక వందలు ఉన్నాయని వివరించింది. వీసా గడువు ముగిసినా దేశంలోనే ఉండిపోవడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, దాడులు, దొంగతనాలు వంటి నేరాలకు పాల్పడటం వీసాల రద్దుకు ప్రధాన కారణాలుగా అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. అమెరికాలో ఉంటున్న విదేశీయులు అక్కడి చట్టాలకు కట్టుబడి ఉండేలా కంటిన్యూయస్ వెట్టింగ్ సెంటర్ అనే కొత్త విభాగాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపిన అమెరికా విదేశాంగ శాఖ వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా పోస్టులను కూడా నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది.
http://www.teluguone.com/news/content/america-cancils-one-lac-foriegn-visas-in-one-year-36-212434.html





