Publish Date:Jun 10, 2025
ఆంధ్రప్రదేశ్ లో సంపద సృష్టించి, ఆ సృష్టించిన సంపదను పేదలకు పంచడమే తన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పునరుద్ఘాటించారు. ఈ లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్రంలో స్వర్ణాంధ్ర కార్యాలయాలను ప్రారంభించారు. ఈ కార్యాలయాల ద్వారా ప్రభుత్వ సేవలు ప్రజలను మరింత చేరువ అవుతాయని ఆయన చెప్పారు. ఇప్పటికే డిజిటల్ గవర్నెన్స్ ద్వారా దాదాపు 300 సేవలను వాట్సాప్ ద్వారా ప్రజలకు చేరువ చేసిన తెలుగుదేశం కూటమి సర్కార్ ప్రభుత్వం.. గ్రామీణ పేదలకు మరింత చేరువ అయ్యే లక్ష్యంతోనే స్వర్ణాంధ్ర కార్యాలయాలను తీసుకువచ్చినట్లు చంద్రబాబు చెప్పారు.
సర్వీస్ సెక్టార్ నుంచి ఆదాయం పెంచడం ద్వారా ఆ పెంచిన ఆదాయాన్ని పేదలకు మరిన్ని పథకాలను అమలు చేయడం ద్వారా అందిస్తామన్న చంద్రబాబు.. ప్రస్తుతం సేవా రంగం ద్వారా నూటికి ఆరు రూపాయల ఆదాయం వస్తున్నదని, దీనిని మరింత పెంచడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని వివరించారు. ఈ స్వర్ణాంధ్ర కార్యాలయాలను వర్చువల్ గా ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీలను అమలు చేసి తీరుతామని భరోసా ఇచ్చారు.
మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం పథకాన్ని ఆగస్టు 15 నుంచి అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. అభివృద్ధి, సంక్షేమాలను సమాంతరంగా ముందుకు తీసుకు వెడతామన్న చంద్రబాబు.. జగన్ ప్రభఉత్వ విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడుతున్నామన్నారు. 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తా మన్న చంద్రబాబు రాజధాని అమరావతిని కూడా మరో మూడేళ్లలోనే పూర్తి చేయనున్నట్టు తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/increase-inome-through-service-sector-39-199643.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!