గుండె ఆరోగ్యం నుంచి జ్ఞాపకశక్తి వరకు.. మంచి నిద్రతో కలిగే అద్భుత ప్రయోజనాలివే!
Publish Date:Aug 24, 2026
Advertisement
మన శరీరం సజావుగా సాగడానికి ఆహారం ఎంత ముఖ్యామో, ప్రశాంతమైన నిద్ర కూడా అంతే అవసరం. మనం రోజంతా పడే కష్టం, శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి నుంచి శరీరం తనను తాను రీచార్జ్ చేసుకునేది కేవలం నిద్రలోనే. రాత్రి వేళ మనం నిద్రపోతున్నప్పుడు కణాల పునరుద్ధరణ, హార్మోన్ల నియంత్రణ, జీవక్రియల సమతుల్యత వంటి అత్యంత కీలకమైన ప్రక్రియలు జరుగుతాయి. అయితే నేటి ఆధునిక జీవనశైలిలో పని భారం, అర్ధరాత్రి వరకు గడిపే డిజిటల్ స్క్రీన్ టైమ్, మానసిక ఆందోళనల కారణంగా చాలామంది సరిపడా నిద్రకు దూరమవుతున్నారు. అయితే నిద్ర విషయంలో చిన్నపాటి అలసత్వం కూడా మన ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనం రోజూ నిద్రపోయే సమయంలో కేవలం ఒక 1 గంట నిద్ర తగ్గినా దాని నెగెటివ్ ప్రభావం వెంటనే మన శరీరంపై చూపిస్తుంది. ఆ ఒక్క 1 గంట నిద్రలోటును భర్తీ చేసుకుని శరీరం మళ్లీ మామూలు స్థితికి రావడానికి కనీసం 4 రోజుల సమయం పడుతుందని అనేక సైంటిఫిక్ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. రాత్రి పూట సరైన నిద్ర లేకపోతే మరుసటి రోజే విపరీతమైన అలసట, జ్ఞాపకశక్తి మందగించడం, తీవ్రమైన చికాకు, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు వెంటాడుతాయి. వెంటనే కాకపోయినా దీర్ఘకాలంలో నిద్రలేమి అనేక తీవ్రమైన శారీరక, మానసిక అనారోగ్యాలకు దారితీస్తుంది. మనం నిద్రపోయే సమయంలోనే మెదడులో రోజంతా పేరుకుపోయిన వ్యర్థాలు తొలగిపోతాయి. దీనివల్ల జ్ఞాపకశక్తి మెరుగవ్వడమే కాకుండా, సమస్యలను త్వరగా పరిష్కరించే మానసిక సామర్థ్యం పెరుగుతుంది. అలాగే మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ బలోపేతం కావడం, గుండె ఆరోగ్యం మెరుగుపడటం, రక్తపోటు నియంత్రణలో ఉండటం నిద్రపైనే ఆధారపడి ఉంటాయి. నిద్ర లోపిస్తే ఇమ్యూనిటీ తగ్గిపోవడంతో పాటు గుండె సంబంధిత సమస్యల ప్రమాదం పెరుగుతుంది. sleep benefits for brain and heart tips for better deep sleep daily.
http://www.teluguone.com/news/content/importance-of-good-sleep-health-tips-sleep-benefits-35-229684.html





