బండి భగీధర్ కేసుపై తక్షణ చర్యలు.. డీజీపీకి సీఎం ఆదేశాలు

Publish Date:May 11, 2026

Advertisement

తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కేసుపై ముఖ్యమంత్రి నేరు గా జోక్యం చేసుకోవడం ప్రాధాన్యత సంతరించు కుంది. కేసు నమోదై   రోజులు గడిచినా   ఆ కేసు పై   చర్యలు తీసుకోకపోవడంతో ప్రభుత్వం  స్పందించింది.పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో బండి భగీరథ్ పై నమోదైన కేసుపై వెంటనే విచారణ ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర డిజిపి సివి ఆనంద్ ను ఆదేశించారు.   ఈ నెల 8న ఫిర్యాదు  వచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలే దని సీఎం రేవంత్ రెడ్డి సీవీ ఆనందర్ ను నిలదీశారు.  కేసులో జాప్యంపై  స్వయంగా సీఎం   రాష్ట్ర డీజీపీని ప్రశ్నించడం విశేషం. 

ఈ నేపథ్యంలోనే రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ కేసు వివరాలను ముఖ్యమంత్రికి సమగ్రంగా వివరించారు. అదే సమయంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టాల్సి వచ్చిందనీ, పోలీస్ సిబ్బంది ఎక్కువగా ఆ బాధ్యతల్లో నిమగ్నమ య్యారని డిజిపి ఆనంద్ వివరించారు. ఈ కారణంగా కేసు దర్యాప్తులో కొంత ఆలస్యం జరిగిందని డిజిపి ముఖ్యమంత్రి కి తెలిపారు.

అయితే కేసు ప్రాముఖ్యత ను దృష్టిలో పెట్టుకుని ఇకపై ఎలాంటి ఆలస్యం సహించ బోమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని వేగంగా దర్యాప్తు జరిపించాలని, అవసరమైతే ప్రత్యేక దర్యాప్తు బృందా లను  ఏర్పాటు చేయాలని ఆదేశించారు.  కేసులో నిజానిజాలు త్వరితగతిన వెలికితీయాలని, బాధ్యులపై చట్టప రమైన చర్యలు తీసుకోవా లని  సూచించారు.

ప్రభుత్వం నేరాల విషయం లో రాజీ పడబోదనే సందేశం ఇవ్వడమే లక్ష్యంగా ఈ ఆదేశాలు ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి నేరుగా  పర్యవే క్షణలోకి తీసుకోవడంతో ఈ కేసు  దర్యాప్తు మరింత వేగం అందుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పుడు ప్రత్యేక బృందాల దర్యాప్తు ఎలా సాగుతుంది? కేసులో మరిన్ని వివరాలు బయటకు వస్తాయా? అన్నది రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.

By
en-us Political News

  
డోనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్ వేదికగా చేసిన ఈ ప్రకటన మేరకు వచ్చే నెల 1 నుండి రెండేళ్ల పాటు అమెరికాలోకి దిగుమతి అయ్యే అన్ని రకాల జనరిక్ ఔషధాలపై సుంకం సున్నా శాతంగానే కొనసాగుతుంది. అయితే ఈ రెండేళ్ల వ్యవధి ముగిసిన వెంటనే, మొదటి ఏడాదిలోనే దిగుమతి సుంకాలను 100 శాతానికి పెంచుతారు. ఆ తర్వాత వచ్చే ఏడాదికి ఈ సుంకాన్ని 200 శాతానికి పెంచుతామని ట్రంప్ హెచ్చరించారు.
అలాగే బహ్రెయిన్‌లోని దిగ్గజ సంస్థ అయిన అమెజాన్ ప్రధాన డేటా సెంటర్‌ను కూడా ధ్వంసం చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. తమ దేశ పౌర వసతులపై అమెరికా దళాలు జరిపిన దాడులకు తగిన రీతిలో జవాబు చెప్పడానికే ఈ సాంకేతిక కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. అయితే ఈ ఆరోపణలు, క్షిపణి దాడి ఘటనను అమెజాన్ కానీ, బహ్రెయిన్ ప్రభుత్వం కానీ ధ్రువీకరించలేదు.
బాబాయ్ త్వరగా కోలుకోవాలంటూ జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు క్షణాల్లో వైరల్ అయ్యింది. బాబాయ్ పట్ల ఎన్టీఆర్ చూపించిన ఈ ప్రేమాభిమానాల పట్ల నందమూరి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది దావోస్ లోని ప్రపంచ ఆర్ధిక సదస్సులో కుదుర్చుకున్న మరో ఒప్పందం ఇవాళ సాకారమైంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో గత కొన్ని నెలలుగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ముంబై నటి కాదంబరి జత్వాని వ్యవహారం
తన ఆరోగ్యం, ఆసుపత్రి అనుభవాల గురించి తాజాగా నెట్టింట షేర్ చేసిన పోస్టు ఆయన అభిమానులను, సినీ వర్గాలనూ కలవరానికి గురి చేసింది. ఆసుపత్రి వాతావరణం, శస్త్రచికిత్స, అనంతరం ఐసీయూలో వైద్యుల నిరంతర పర్యవేక్షణ వంటి కష్టతరమైన దశలను ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో జరుగుతున్న శ్రీ జగదాంబికా అమ్మవారి బోనాల మహోత్సవాల సందర్భంగా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు విస్తృత స్థాయిలో ట్రాఫిక్ బందోబస్తు చేపట్టారు.
ప్రధాని ఇంటి ఎదుట బైఠాయించిన రాహుల్, ఖర్గే..!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో జాతీయ రాజకీయం అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరిగింది.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఛలో సంసద్ పార్లమెంట్ మార్చ్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
ఉత్తరాంధ్ర ప్రాంత ప్రగతికి ఊపిరి పోసేందుకు తమ జీవనాధారమైన భూములను ప్రభుత్వం సేకరించడానికి సహకరించిన రైతులకు కృతజ్ఞతగా, గౌరవంగా భోగాపురం విమానాశ్రయం నుంచి ఉచితంగా ఒకసారి విమానంలో ప్రయాణించే అవకాశం కల్పించారు. ఈ మేరకు ఆయన అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
కాకినాడలో జరుగుతున్న NBK111 సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడిన ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నంద మూరి బాలకృష్ణను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఫోన్‌లో పరామర్శిం చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పొగాకు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముడి పొగాకు (HSN 2401)పై ప్రస్తుతం అమలులో ఉన్న 40 శాతం జీఎస్టీని 28 శాతానికి తగ్గించాలని
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.