ఐఏఎస్ ల విమర్శలను తిప్పికొట్టిన సిబిఐ
Publish Date:Feb 8, 2012
Advertisement
న్యూఢిల్లీ: ఐఏఎస్ అధికారులు సిబిఐ దర్యాఫ్తుపై చేసిన విమర్శలపై సిబిఐ స్పందించింది. ఐఏఎస్ అధికారులు సిబిఐపై ఆరోపణలు చేయడం శోచనీయమని సిబిఐ అధికార ప్రతినిధి ధరణి మిశ్రా అన్నారు. సిబిఐ విచారణ ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారులు తమ విచారణపై ఆరోపణలు చేయడం సహజమేనని అన్నారు. ఐఏఎస్ల ఆరోపణలు తమ విచారణపై ఎలాంటి ప్రభావం చూపవని అన్నారు. సిబిఐ రూల్స్ ప్రకారమే విచారణ జరుగుతుందని అన్నారు. భయం, పక్షపాతం లేకుండా సిబిఐ విచారణ కొనసాగుతోందని అన్నారు. కేంద్ర కార్యాలయం ఆదేశాల ప్రకారమే సిబిఐ పని చేస్తోందన్నారు. ఎమ్మార్ కేసులో ఎవరి ఒత్తిళ్లు లేవని, స్వతంత్రంగానే వ్యవహరిస్తోందన్నారు. కాగా ఇటీవల ఐఏఎస్ అధికారులు సిబిఐ విచారణపై మండిపడుతున్న విషయం తెలిసిందే. సిబిఐ ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు, కర్నాటక మాజీ మంత్రి గాలి గనుల కేసు, ఎమ్మార్ కేసును దర్యాఫ్తు చేస్తోంది.
http://www.teluguone.com/news/content/ias-24-11699.html





