ఐఎఎస్ ల తరపున చంద్రబాబు
Publish Date:Feb 4, 2012
Advertisement
రాజమండ్రి: ఐఎఎస్ అధికారుల అరెస్టుకు వైయస్ రాజశేఖర రెడ్డే కారణమని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఐఎఎస్ అధికారులకు తమ ప్రభుత్వ హయాంలో పదోన్నతులు కల్పిస్తే కాంగ్రెసు ప్రభుత్వం వారిని జైలు పాలు చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. మద్యం సిండికేట్ల మూలవిరాట్లను అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసు నిందితులను అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేశాన్ని పాలించే అర్హతను కాంగ్రెసు పార్టీ కోల్పోయిందని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో అవినీతి, అక్రమాలకు పాల్పడినవారి వివరాలను వెల్లడించేందుకు ఐఎఎస్ అధికారులు ముందుకు రావాలని తెలుగుదేశం పార్టీ నాయకులు కోరారు.
అవినీతి మంత్రులకు శిక్ష పడేలా వెంటనే నిజాలను సిబిఐ ముందు చెప్పాలని తెలుగుదేశం పార్టీ నాయకుడు మండవ వెంకటేశ్వర రావు శనివారం హైదరాబాదులో మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఐఎఎస్, ఐపియస్ వ్యవస్థల మధ్య చిచ్చు పెట్టి అసలు సమస్యలను పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆనయ అన్నారు.
http://www.teluguone.com/news/content/ias-24-11610.html





