మారిన్ పై మస్తు కోపమొచ్చేది.. స్టార్ షట్లర్ పీవీ సింధు ఎమోషనల్ పోస్టు!

Publish Date:Mar 28, 2026

Advertisement

మహిళల బ్యాడ్మింటిన్ లో కరోలినా మారిన్ రిటైర్మెంట్ తో ఒక శకం ముగిసింది.  స్పెయిన్ తరపున అంతర్జాతీయ వేదికలపై తిరుగులేని ఆధిపత్యం చలాయించిన దిగ్గజ క్రీడాకారిణి కరోలినా మారిన్  మోకాలి గాయాల కారణంగా  బ్యాట్మింటిన్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.  తనదైన శైలిలో స్మాష్ లతో, ఫోర్ హ్యాండ్, బ్యాక్ హ్యాండ్ ర్యాలీలతో ఆటపై తనదైన ముద్ర వేసిన ఈ స్పెయిన్ భామ రిటైర్మెంట్ పై భారత ఏస్ షట్లర్, ఒలింపిక్ మెడల్ విజేత పీవీ సింధు స్పందించింది.  

కరోలినా మారన్ కు దీటైన ప్రత్యర్థిగా గుర్తింపు పొందిన పీవీ సింధూ సోషల్ మీడియా వేదికగా కరోలినాతో తన అనుబంధం గురించి ఆసక్తికర అంశాలను షేర్ చేసింది.  తన క్రీడా ప్రయాణంలో  తనకు అత్యంత ఇష్టమైన ప్రత్యర్థి కరోలినా మారిన్ అని పేర్కొన్న సింధూ.. మైదానంలో తామిద్దరం తలపడిన ప్రతిసారీ గట్టి పోటీ నడిచేదని పేర్కొంది.  మ్యాచ్ జరుగుతుండగా కరోలినా తీరు ప్రత్యర్థిని తప్పుదోవపట్టించేదిగా ఉంటుందని సింధూ పేర్కొన్నారు. ఆ విషయంలో కరోలినా పై తనకు విపరీతమైన కోపమొచ్చేదని చెప్పారు. ఆమె అరుపులూ, రెచ్చగొట్టి, ప్రత్యర్థి ఏకాగ్రతను దెబ్బతీసే ఎత్తుగడల పట్ల తను కోపగించుకున్న విషయాన్ని సింధు ఆ పోస్టులో వివరించింది. అయితే ఆట ముగిసన తరువాత మాత్రం ఇద్దరం మంచి స్నేహితులమని పేర్కొంది.

గతంలో మాడ్రిడ్ లో కరోలినాతో కలిసి కాఫీ తాగుతూ సరదాగా గడిపిన క్షణాలను కూడా సింధూ ఆ పోస్టులో గుర్తు చేసుకుని వివరించింది.  2016 రియో ఒలింపిక్స్ ఫైనల్స్‌లో సింధుపై విజయం సాధించి కరోలినా మారిన్ స్వర్ణం గెలవగా, 2018 ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫైనల్లోనూ సింధుకు కరోలినా మారిన్ చుక్కలు చూపించింది.

ఈ రెండు ప్రధాన టోర్నీలలో ఓటమి పాలైనప్పటికీ, ఆ చేదు జ్ఞాపకాలను దాటి వారిద్దరి తమ మధ్య  స్నేహం చిగురించిందని సింధు పేర్కొంది.  ప్రస్తుతం కరోలినా మారిన్ పై సింధు సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టు తెగ వైరల్ గా మారింది.  క్రీడాకారుల మధ్య ఉండాల్సిన ఆరోగ్యకరమైన పోటీకి వీరిరువురూ నిలువెత్తు నిదర్శనంగా నెటిజనులు ప్రశంసలు గుప్పిస్తున్నారు. 

By
en-us Political News

  
హైదరాబాద్‌లోని మియాపూర్ హఫీజ్‌పేట్‌లో ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ చేతిలో 27 ఏళ్ల లేడీ డాక్టర్ సృజన హత్యకు గురైన దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు పోలీసుల దర్యాప్తు నివేదిక.
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎం పోస్టులు ఇప్పిస్తామంటూ ఉమ్మడి వరంగల్, హనుమకొండ జిల్లాల్లో రూ.లక్షల్లో వసూలు చేస్తున్న దళారీల దందా వెలుగులోకి వచ్చింది. యూనియన్ ముసుగులో జరుగుతున్న ఈ అక్రమాలపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజారెడ్డి విచారణ ప్రకటించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్‌లోని సరూర్ నగర్ సాగరిక ఇంటెగ్రేటెడ్ హైస్కూల్‌లో రాఖీలు, తిలకం తొలగింపు వివాదంపై బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి టీచర్‌ను హిజాబ్‌‌పై ప్రశ్నించడం సంచలనంగా మారింది. పోలీసులు కార్పొరేటర్‌పై సుమోటో కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్న కూతురిపై లైంగిక దాడికి యత్నించిన భర్త శ్రీనివాస్‌ను భార్య రమాదేవి గొడ్డలితో నరికి చంపింది. అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లా సీఐఎస్ఎఫ్ క్యాంపులో హెడ్ కానిస్టేబుల్ ఏకే 47 రైఫిల్‌తో చేసిన విచక్షణారహిత కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి చెందారు. సేవా పవర్ ప్రాజెక్ట్ వద్ద జరిగిన ఈ దారుణ ఘటనపై సీఐఎస్ఎఫ్ డీజీ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
ఒడిశా తాల్చేర్ ప్రాంతంలో సంచలనం సృష్టించిన దారుణ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్ మాధాపూర్‌లో స్పా సెంటర్ ముసుగులో నడుస్తున్న అక్రమ వ్యభిచార రాకెట్‌ను ఎస్‌ఓటీ పోలీసులు మట్టుబెట్టారు. నలుగురు యువతులను రక్షించి, రూ. 45 వేల నగదు, 8 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
యాదాద్రి భువనగిరి జిల్లా చల్లూరులో భూభారతి వెబ్‌సైట్ ద్వారా ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండానే 7.18 ఎకరాల భూమి వేరొకరి పేరు మీదకు మారిపోయింది. యజమానులకు తెలియకుండా జరిగిన ఈ భారీ భూ భాగోతం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఏపీ సచివాలయ ఉద్యోగాలు, డీఎస్సీ నియామకాలు మరియు మెడికల్ సీట్లలో నకిలీ స్పోర్ట్స్ సర్టిఫికెట్ల అక్రమాలపై విచారణ ముమ్మరమైంది. హైకోర్టు ఆదేశాలు, విజిలెన్స్ తనిఖీలు మరియు సాప్ చేపట్టిన స్కిల్ టెస్ట్ వివరాలు ఇక్కడ చూడండి.
150 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న వందేమాతరం గేయానికి జాతీయ గీతంతో సమాన హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ తెచ్చింది. 3 నిమిషాల 10 సెకన్ల ఆలాపన, సుప్రీంకోర్టు విచారణ మరియు చట్టపరమైన నిబంధనల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
హైదరాబాద్ రాయదుర్గంలో ఐటీ కంపెనీ మహిళా ఉద్యోగిపై ఫుడ్ వెండర్ షేక్ నబీ కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి లైంగిక దాడి చేశాడు. ప్రైవేట్ వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తూ రూ. 43 లక్షలు నొక్కేసి మూడేళ్లు వేధించిన నిందితుడిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు.
విజయవాడ ఎన్‌టీపీఎస్ కాలువలో లభించిన మహిళ శరీర భాగాల మిస్టరీ వీడింది. చేతిపై ఉన్న ఈక టాటూ ఆధారంగా మృతురాలిని మంగళగిరికి చెందిన 29 ఏళ్ల కళ్యాణిగా గుర్తించిన పోలీసులు, విచారణలో మటన్ షాప్ షఫీ చేసిన కిరాతక హత్యను ఛేదించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.