అమెరికాలో హైదరాబాద్ యువకుడిపై కత్తితో దాడి..!

Publish Date:Jul 16, 2026

Advertisement

 

అమెరికాలో హైదరాబాద్‌కు చెందిన యువకుడిపై జరిగిన దారుణ కత్తి దాడి తీవ్ర కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్‌గా  మారి చెక్కర్లు కొడుతున్నారు.. హైదరాబాద్‌లోని టోలిచౌకీ ప్రాంతానికి చెందిన సయ్యద్ సోహైల్ అమెరికాలోని ఓ షాపింగ్ మాల్‌లో ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం, ఓ అమెరికన్ వ్యక్తి సోహైల్ వద్దకు వచ్చి ముందుగా "నువ్వు ముస్లిమేనా?" అని ప్రశ్నించాడు. అనంతరం ఎలాంటి వాగ్వాదం లేదా రెచ్చగొట్టే పరిస్థితి లేకుండానే ఒక్కసారిగా కత్తితో విచక్షణారహితంగా దాడి చేసినట్లు అధికారులు తెలిపారు.

ఈ దాడిలో సోహైల్‌కు శరీరంలోని వివిధ భాగాల్లో సుమారు 15 కత్తిపోట్లు తగిలినట్లు సమాచారం. తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలిన ఆయనను అక్కడున్న పలువురు వెంటనే రక్షించి సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతోంది.

ప్రాథమిక విచారణలో ఈ దాడి పూర్తిగా మత విద్వేషం కారణంగానే జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితుడిని లక్ష్యంగా చేసుకుని అతని మతాన్ని ప్రశ్నించిన తర్వాత దాడికి పాల్పడటం వల్ల, ఈ కేసును హేట్ క్రైమ్ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.

ఘటన అనంతరం నిందితుడిని పోలీసులు అక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు. అతనిపై ప్రస్తుతం హత్యాయత్నం  కేసు నమోదు చేశారు. దర్యాప్తు పూర్తయ్యాక ద్వేష నేరం కింద అదనపు అభియోగాలు నమోదు చేసే అవకాశాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాధితుడిపై నిందితుడు విచక్షణారహి తంగా కత్తితో దాడి చేస్తున్న దృశ్యాలు చూసి నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

భారతీయ సంఘాలు కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమెరికా అధికారులను కోరుతున్నాయి. అమెరికాలో ఇటీవలి కాలంలో జాతి, మత విద్వేషంతో జరిగే దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన మరోసారి భారతీయులతో పాటు ఇతర వలసదారుల భద్రతపై ఆందోళనలను రేకెత్తించింది. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడి పై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Hyderabad youth attacked with knife in America, Syed Sohail,Religious hatred, America, Donald Trump


 

By
en-us Political News

  
రైలు ఢీకొట్టిన వేగానికి స్కూల్ వ్యాన్ పూర్తిగా ముక్కలై, పట్టాల పక్కన పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు, ఒక సైక్లిస్ట్ అక్కడికక్కడే మృతి చెందారు. వ్యాన్ డ్రైవర్‌తో పాటు మరో నలుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
క్వార్టర్ ఫైనల్ పోరులో పీవీ సింధు, జపాన్ మాజీ ప్రపంచ ఛాంపియన్ నొజోమీ ఒకుహారాతో తలపడాల్సి ఉంది. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందే జపాన్ క్రీడాకారిణి ఒకుహారా గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలగింది. దీంతో సింధుకు ఆటోమేటిగ్గా సెమీస్ బెర్త్‌ ఖరారు అయిపోయింది.
గూగుల్ నుండి సరికొత్త ఏఐ ఇమేజ్ ఎడిటర్ గూగుల్ పిక్స్ ఆగస్టు 18న అధికారికంగా విడుదల కాబోతోంది. అడోబ్, కాన్వాలకు పోటీగా వస్తున్న ఈ టూల్ ఫీచర్లు, ఉచిత ఆఫర్ వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
అమెజాన్ ప్రైమ్ డే ముగిసినా రోబోట్ వాక్యూమ్ క్లీనర్లపై 70 శాతం వరకు భారీ డిస్కౌంట్లు కొనసాగుతున్నాయి. డ్రీమ్, రోబోరాక్ మరియు ఎకోవాక్స్ బ్రాండ్లపై లభిస్తున్న క్రేజీ ఆఫర్ల పూర్తి వివరాలు మీకోసం.
మంత్రి వాకిటి శ్రీహరి తీవ్రమైన జ్వరం, ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు ఆసుపత్రి వర్గాల సమాచారం. గత రెండు రోజులుగా ఆయన నీరసంగా ఉండటం, జ్వరం తగ్గకపోవడంతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం వాటికి శ్రీహరి ఆరోగ్యం నిలకడగా ఉందనీ, ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ వైద్యులు తెలిపారు.
అమెరికా ఎన్నికల నిబంధనలను సమూలంగా మార్చేందుకు ట్రంప్ ప్రతిపాదిస్తున్న సేవ్ అమెరికా యాక్ట్ అంటే ఏమిటి? పౌరులపై దీని ప్రభావం ఎలా ఉంటుందో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
జులై 17 శుక్రవారం నాడు దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. హైదరాబాద్, విజయవాడ సహా ప్రధాన నగరాల్లో 22, 24 క్యారెట్ల తులం పసిడి ధరలపై రూ.760 వరకు తగ్గుదల నమోదైంది. నేటి లేటెస్ట్ గోల్డ్ రేట్స్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
బులియన్ మార్కెట్లో బంగారం వెండి నిష్పత్తి 69 కి చేరింది. 2026 లో 80 మార్కు దాటిన ఈ రేషియో ప్రస్తుతం సాధారణ స్థితికి రావడంతో ఏ లోహంలో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయో నిపుణుల విశ్లేషణ ఇక్కడ చదవండి.
రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి భవిష్యత్ పెట్టుబడులపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. బంగారం, ఆయిల్ కంటే నీటి హక్కులకే ఎక్కువ డిమాండ్ ఉంటుందని తెలిపారు.
భారత సరిహద్దుల్లో భద్రతా బలగాలు నిరంతరం నిఘా ఉంచడంతో, ఈసారి భూమార్గాలను విడిచిపెట్టి జలమార్గాల ద్వారా చొరబడేందుకు వాటర్ ఫోర్స్ విభాగాన్ని రంగంలోకి దించింది. ఈ వాటర్ ఫోర్స్ నీటి అడుగున ఉండి పోరాడేందుకు ఇస్తున్న శిక్షణకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో బహిర్గతం కావడంతో లష్కరే ఉగ్రకుట్ర బయటపడింది.
అమెరికాలో ఓటింగ్ విధానాన్ని మార్చేందుకు డోనాల్డ్ ట్రంప్ తీసుకొస్తున్న సేవ్ అమెరికా యాక్ట్ SAVE America Act 2026 బిల్లు విశేషాలు, పౌరసత్వ నిరూపణ నిబంధనలు మరియు దీనివల్ల ఓటర్లపై పడే ప్రభావం గురించిన పూర్తి వివరాలు.
టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నారా? జూలై 19న లార్డ్స్ వేదికగా జరిగే మ్యాచ్ హిట్ మ్యాన్ కెరీర్‌లో చివరిదా? అసలు నిజమేంటో ఇక్కడ చదవండి.
భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్సీ మార్పుపై మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్మన్‌ప్రీత్ కౌర్ ఫిట్‌నెస్‌ను ప్రశ్నిస్తూ, వన్డే, టెస్ట్ ఫార్మాట్లకు స్మృతి మందానను కెప్టెన్ చేయాలని సెలెక్టర్లకు కీలక సూచన చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.