హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. జలమయమైన రోడ్లు..!

Publish Date:Jul 28, 2026

Advertisement

 

 అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సజ్జనార్ విజ్ఞప్తి..!

హైదరాబాద్‌ను భారీ వర్షం ముంచెత్తింది. సాయంత్రం ఆఫీస్ వేళల్లో వర్షం దంచికొట్టడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించింది. రహదారులపై భారీగా నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

కుండపోత వర్షంతో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, నాంపల్లి, కోఠి, మలక్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీ నగర్, వనస్థలిపురం, హయత్‌నగర్ సహా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.

గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, సికింద్రాబాద్, బేగంపేట్, మణికొండ, కాచిగూడ ప్రాంతాల్లోనూ భారీ వర్షం ప్రభావం కనిపించింది. పలు చోట్ల ట్రాఫిక్ కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో ఉద్యోగులు, ప్రయాణికులు గంటల తరబడి రోడ్లపైనే చిక్కుకుపోయారు.

పరిస్థితిని పర్యవేక్షిస్తున్న హైడ్రా, డీఆర్ఎఫ్, జీహెచ్‌ఎంసీ మాన్సూన్ బృందాలు నీటి తొలగింపు, సహాయక చర్యలు చేపట్టాయి. వర్షం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

 నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీ.సీ. సజ్జనార్ తన ఎక్స్ వేదిక ద్వారా సూచించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోవడం, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరా యం ఏర్పడే అవకాశం ఉన్నందున అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని కోరారు.

ముఖ్యంగా నీటితో నిండిన రహదారులు, నాలాలు, చెరువుల సమీప ప్రాంతాల్లో ప్రయాణించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షపు నీటి లోతు అంచనా వేయకుండా వాహనాలను నీటిలోకి తీసుకెళ్లడం ప్రమాదకరమని, వాహనదారులు వేగాన్ని నియంత్రిస్తూ ట్రాఫిక్ పోలీసుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. చెట్లు, విద్యుత్ స్తంభాలు, బలహీన నిర్మాణాల సమీపంలో నిలబడకుండా జాగ్రత్తగా ఉండాలని కూడా హెచ్చరించారు.

భారీ వర్షాల పరిస్థితిని హైదరాబాద్ సిటీ పోలీస్ యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తోందని, జీహెచ్‌ఎంసీ, విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖ తదితర ప్రభుత్వ విభా గాలతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపడుతున్నా మని కమిషనర్ వెల్లడిం చారు. ఎక్కడైనా రహదారులపై నీరు నిలిచినా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తినా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు తీసుకు నేందుకు ప్రత్యేక బృందాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

ప్రజలు వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని, అత్య వసర పరిస్థితుల్లో వెంటనే డయల్–100కు కాల్ చేయాలని సూచించారు. అదేవిధంగా హైదరాబాద్ సిటీ పోలీస్ సిబ్బంది 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉండి అవసరమైన సహాయం అందిస్తారని భరోసా ఇచ్చారు.ప్రజల భద్రతే ప్రభుత్వ ప్రాధాన్యమని, భారీ వర్షాల సమయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తం గా ఉంటూ అధికారుల సూచనలను పాటిస్తే ప్రమాదాలను నివారిం చవచ్చని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్  విజ్ఞప్తి చేశారు.


Hyderabad Rains, Heavy Rainfall in Hyderabad, Hyderabad Rain Alert, GHMC, Monsoon Teams, IMD, Hydra, DRF, GHMC, 
 

By
en-us Political News

  
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావారనికి తోడు రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఉక్కపోత, ఎండ దెబ్బతో అల్లాడిపోయిన ప్రజలకు ఈ వర్షాలు పెద్ద ఉపశమనాన్ని అందించినప్పటికీ.. భారీ వర్షాల హెచ్చరిక ఆందోళన కలిగిస్తోంది.
ఇంత కాలంగా ప్రభుత్వ శాఖలలో ముఖ్యమైన స్థానాల్లో ఉన్న కొందరు అధికారులు అదనపు బాధ్యతలు స్వీకరించినప్పుడు లేదా వేర్వేరు ప్రాజెక్టుల ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నప్పుడు ప్రతి పదవికి ఒక వాహనం చొప్పున బహుళ వాహనాలను ఉపయోగిస్తూ వస్తున్నారు. అయితే, సెప్టెంబర్ 2022 నాటి పాత మార్గదర్శకాలకు అనుబంధంగా తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ద్వారా ఆర్థిక శాఖ వ్యయ విభాగం అటువంటి సదుపాయాలకు చెక్ పెట్టాయి.
హక్కుల హననానికి తోడు పీవోకేలో గళమెత్తుతున్న ప్రజలపై పాక్ బలగాలు పాశవిక అణచివేతకు పాల్పడుతున్నారు. గత రెండు రోజులుగా రావల్‌కోట్, మీర్పూర్ ప్రాంతాల్లో పాక్ బలగాలు జరిపిన దాడులు, కాల్పుల్లో 40 మంది పౌరులు తమ ప్రాణాలను కోల్పోయారు. పీవోకేలో జనం ప్రాథమిక హక్కులు, న్యాయమైన డిమాండ్ల కోసం చేపట్టిన శాంతియుత నిరసనలపై పాక్ సైన్యం యుద్ధం ప్రకటించింది.
ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి వద్ద ఉన్న ఈ సహజసిద్ధ జలపాతం గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పరవళ్లు తొక్కుతోంది
మద్యం విధానం పేరుతో గత ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ అవకతవకలు, అక్రమాలపై సమగ్ర విచారణ జరుపుతున్న విచారణాధికారులు, ఈ కేసులో మాజీ మంత్రి పాత్రపై కీలక ఆధారాలు సేకరించారు. ఈ నేపథ్యంలో అరెస్టు ముప్పు నుంచి తప్పించుకునేందుకు, ఆయన సుప్రీం కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు.
ఒక టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో ఖవాజా ఆసిఫ్ తాను పీఓకేలో నిరసనలు చేస్తున్న వారిని భారత్‌తో సమానమైన వర్గంలో చేరుస్తున్నానని పేర్కొన్నారు. వారిని కూడా భారతదేశం లాంటి శత్రువులుగానే పరిగణిస్తున్నాననీ, అందుకే ఆ ఆందోళనకారులతో చర్చిందేదే లేదనీ, వారు పాకిస్థాన్ శత్రువులని చెప్పారు.
మూడు దశాబ్దాల భవిష్యత్ ను ముందుగానే చూడగల విజనరీ అయిన చంద్రబాబు నాయుడు 1997లో ఉత్తరాంధ్రకు అంతర్జాతీయ విమానాశ్రయ ఆవశ్యకతను గుర్తించారు. ఆ దిశగా అడుగులు వేశారు. ఇక హుద్‌హుద్ తుఫాను అనంతరం.. సురక్షిత, ఆధునిక విమానాశ్రయం ప్రతిపాదనను ఆయన మరింత గట్టిగా ముందుకు తీసుకువెళ్లారు. ఓ వైపు సముద్ర తీరం, మరొకవైపు మన్యప్రాంతాల నడుమ వ్యూహాత్మక ప్రదేశంగా భోగాపురాన్ని అయిన ఎంపిక చేశారు.
మొదట చర్చల సందర్భంగా, నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులు, యువతపై కొత్త ఎఫ్ఐఆర్ లు నమోదు చేయబోమని, ఇప్పటికే నమోదైన పాత కేసులను కూడా పూర్తిగా ఉపసంహరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేసిన ఆయన ఇప్పుడు.. వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉందంటూ ఆ హామీ అమలుపై వెనక్కు తగ్గిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మిసిర్ బేస్రాపై ఝార్ఖండ్, బిహార్, ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో పోలీసులపై దాడులు, నరమేధాలు, ఐఈడీ పేలుళ్లు, వసూళ్లు సహా ఏకంగా 150కి పైగా కేసులు నమోదయ్యాయి. 2007లో ఖుంటీ పోలీసులు ఇతడిని అరెస్ట్ చేసినప్పటికీ, 2009లో బిహార్‌లోని లఖిసరాయ్ కోర్టు సముదాయంపై మావోయిస్టులు దాడి చేసి అతడిని విడిపించుకుపోయారు. ఆ సంఘటన తర్వాత దాదాపు రెండు దశాబ్దాల అజ్ఞాతంలోనే ఉన్నారు.
వర్షాల తీవ్రత వల్ల పలు జిల్లాల్లో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. కామరూప్, ధుబ్రి, లఖింపూర్, దిబ్రూగఢ్ వంటి ప్రధాన ప్రాంతాల్లో నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో వందలాది గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. రహదారులు, వంతెనలు కొట్టుకుపోవడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది.
ఇన్ స్పెక్టర్, బాధిత మహిళ కొంత కాలం పాటు సహజీవనం చేసినట్లు కూడా విచారణలో వెలుగులోకి వచ్చింది. అనంతరం ఈ పరిణా మాల నేపథ్యంలో బాధిత మహిళ ఫిర్యాదుపై ఉన్నతాధి కారులు చేపట్టిన విచారణలో ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు తేలడంతో శాఖాపరమైన చర్యల్లో భాగంగా ఆయనను సస్పెండ్ చేస్తూ హైదరా బాద్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్ లోని పలు ప్రాంతాలలో రహదారులు జలమయమయ్యాయి. వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల మేరకు రెండు గంటల వ్యవధిలోనే నగరంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
రోజురోజుకూ పెరిగిపోతున్న ఈ సైబర్ ముఠాల దందాను అరికట్టడానికి సాధారణ చట్టాలు సరిపోవనీ, అందుకే ఇకపై డిజిటల్ అరెస్టు మోసాలను పాతకాలపు ఐటీ చట్టాల కింద కాకుండా, వ్యవస్థీకృత నేరాల నియంత్రణ చట్టం కింద నమోదు చేసి, దర్యాప్తు జరపాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.