గోదావరి వరద ఉధృతి: భద్రాచలం వద్ద 40 అడుగులకు చేరిన నీటిమట్టం.!

Publish Date:Sep 27, 2026

Advertisement

గోదావరి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. దీంతో అధికార యంత్రాంగం ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసింది.  ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వస్తున్న వరద నీటితో గోదవరి నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 40 అడుగులకు చేరుకుంది. ఈ నేపథ్యంలో  రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు రంగంలోకి దిగారు.  ప్రజలు  నది పరిసర ప్రాంతాలకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు.

ఇక కూనవరం వద్ద గోదావరి నీటిమట్టం  14.8 మీటర్లు, పోలవరం వద్ద 9.98 మీటర్లు నమోదైంది.  ధవళేశ్వరం బ్యారేజీ వద్ద  ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో  5.61 లక్షల క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ఇది మరింత పెరిగి  8 నుంచి 9 లక్షల క్యూసెక్కుల స్థాయికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

 వరదల కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది.  వరద ప్రభావిత జిల్లాల్లో అత్యవసర సహాయక మరియు రక్షణ చర్యల నిమిత్తం ప్రత్యేకంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్  బృందాలను మోహరించారు. అత్యవసర పరిస్థితులు తలెత్తితే తక్షణమే స్పందించేలా ఈ బృందాలను   సిద్ధంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. 

నది నీటి మట్టాలు ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్న తరుణంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు  సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచించారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావం మరో రెండు రోజుల పాటు ఉండే అవకాశం ఉన్నందున.. గోదావరి వరద మరింత ఉధృతమయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.  

వరద ఉద్ధృతి కారణంగా ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు, కల్వర్టులు,  కాజ్‌వేల వద్ద ప్రజలు  జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ మార్గాలను దాటేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరించారు.  

[Godavari River Flood, Bhadrachalam Water Level, Dhavaleswaram Barrage, AP Disaster Management, NDRF SDRF Teams]

By
en-us Political News

  
నాగర్‌కర్నూల్ జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ పేరిట రూ.29.27 కోట్ల విలువైన 12,530 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైన భారీ కుంభకోణం వివరాలు.
కృష్ణా జిల్లాలో దీపావళి టపాసులు కాల్చే సమయంలో కెమికల్ డ్రమ్ పేలి పదేళ్ల బాలుడు మృతి చెందిన విషాదకర సంఘటన పూర్తి వివరాలు. పిల్లల భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
హైదరాబాద్ మల్కాజిగిరి నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తూ గల్లంతైన రాము, లక్ష్మి దంపతుల అదృశ్యం వెనుక మిస్టరీ ఏంటి? కూతురితో చివరి కాల్, ఫోన్లు స్విచ్ఛాఫ్ అయిన వైనంపై పూర్తి వివరాలు.
ఒడిలో చిన్నారిని పెట్టుకుని ఎన్నో కలలు కన్న ఆ తల్లి ఆశలు క్షణాల్లో ఆవిరైపోయాయి. పసిబిడ్డ అకస్మాత్తుగా మృతి చెందడంతో ఆ కుటుంబంలో నెలకొన్న హృదయ విదారక విషాదంపై పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
విశాఖపట్నంలో ప్రేమ పేరుతో జరిగిన ద్రోహం వల్ల తీవ్ర మనోవేదనకు గురై అప్పులపాలైన యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన పూర్తి వివరాలు వెబ్‌ స్టోరీలో చదవండి.
రాష్ట్ర విభజన ప్రక్రియ ముగిసిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం సిఫార్సుల మేరకు ఆమ్రపాలిని ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు కేటాయించింది. అయితే ఈ కేటాయింపును సవాలు చేస్తూ ఆమె గతంలో కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు.
హైదరాబాద్‌ బొల్లారం పరిధిలోని కౌకూర్‌లో బతుకమ్మ వేడుకల్లో అదృశ్యమైన ఐదేళ్ల చిన్నారి రూ.20 లక్షల డిమాండ్ కోసం హత్యకు గురైంది. గేటెడ్ కమ్యూనిటీ సంపులో శవంగా తేలిన పాప ఉదంతంపై పూర్తి వివరాలు.
హైదరాబాద్ మాదాపూర్‌లో పనిచేస్తున్న 36 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనారోగ్య సమస్యలతో హీలియం గ్యాస్ పీల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
అక్టోబర్ 10న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారీ ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో దేశ రాజధానిలో హై అలర్ట్ ప్రకటించారు. 12,000 మంది బలగాలు, సీఆర్పీఎఫ్ మోహరింపు మరియు పోలీసు ఆంక్షల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
నాగ్‌పూర్‌లో రెండేళ్ల లైంగిక వేధింపులను తట్టుకోలేక 45 ఏళ్ల తండ్రిని క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపిన 17 ఏళ్ల మైనర్ బాలిక. అర్ధరాత్రి పోలీసులకు ఫోన్ చేసి లొంగిపోయిన చిన్నారి. ఈ దిగ్భ్రాంతికర సంఘటన పూర్తి వివరాలు చదవండి.
పంజాబ్‌లో ఆప్ నేత అమరిందర్ సింగ్ మండోఫల్‌ను పీసీఎస్ ఆఫీసర్‌నంటూ నమ్మించి పెళ్లాడి, నగలతో పరారైన కిలాడీ మహిళ మన్విందర్ కౌర్ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు చదవండి.
ఒడిశాలోని బ్రహ్మపూర్‌లో మద్యం మత్తులో తీవ్ర దారుణం జరిగింది. డబ్బుల వివాదంతో స్నేహితుడి గొంతు కోసి హత్య చేసిన వ్యక్తి అర్ధరాత్రి పోలీసుల తనిఖీల్లో రక్తపు మరకలతో చిక్కాడు. ఈ ఘోర క్రైమ్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.