వారం రోజుల్లో పది కేసులు సాల్వ్.. 20 మంది అరెస్టు!

Publish Date:Oct 30, 2025

Advertisement

హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల ఘనత

క్రిమినల్స్ పై సైబర్ క్రైమ్ పోలీసులు కొరడా ఝుళిపించారు. సైబర్ నేరాలకు పాల్పడుతున్న దాదాపు 20 మందిని హైదరాబాద్ క్రైమ్ పోలీసులు వారం రోజుల వ్యవధిలో అరెస్టు చేసి దాదాపు పది కేసులను ఛేదించారు.  వీటిలో మూడు కోట్ల ఆన్లైన్ టికెట్ బుకింగ్,  డిజిటల్ వాలెట్ మోసాలకు పాల్ప డుతున్న ఐదుగురు నిందితులు కూడా ఉన్నారు. హైదరాబాద్ సైబర్ పోలీసులు  అక్టోబర్ 22 నుండి 28 వరకు అంటే వారం రోజుల వ్యవధిలో దేశ వ్యాప్తంగా జరిగిన సైబర్ నేరాలపై దృష్టి సారించి... మొత్తం 10 ప్రధాన కేసులను ఛేదించారు. వివిధ రాష్ట్రాల్లో మోసా లకు పాల్పడుతున్న   20 మందిని  అరెస్టు చేశాడు. విచారణలో దేశంలోని పలు రాష్ట్రాలలో సైబర్ నేరాలకు పాల్పడు తున్న ముఠాలు విస్తరించి ఉన్నట్లు గా తేలింది. అరెస్టు చేసిన 20 మందిలో  14 మంది ట్రేడింగ్ మోసాలకు పాల్ప డినట్లుగా పోలీ సులు గుర్తిం చారు.

అరెస్టు చేసిన వారి వద్ద నుండి 24 మొబైల్ ఫోన్లు, 19 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. పది కేసులలో ఆన్లైన్ టికెట్ బుకింగ్, డిజిటల్ వాలెట్ కేసు ప్రధానమైనది. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆన్లైన్ ట్రావెల్ కంపెనీని టార్గెట్ గా చేసుకొని భారీ స్థాయి మోసాలకు పాల్పడిన ముఠా వ్యవహారాన్ని బట్టబయలు చేశారు. ఈ మోసంలో కంపెనీకి 3,0091,683 నష్టం వాటిల్లింది. దక్షిణ భారత రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలలో ఇటువంటి మోసా లు జరిగినట్లుగా దర్యాప్తులో బయటపడింది. ఈ కేసులో ఐదుగురిని  అరెస్టు చేశారు. 

చెన్నుపాటి శివ నారాయణ, కడలి నారాయణస్వామి, అడుగుల రాజ్ కుమార్, జడ్డా బ్రహ్మయ్య, పేరి చర్ల వర్మలు  ఆన్లైన్ ట్రావెల్ కంపెనీని టార్గెట్ గా చేసుకొని భారీ స్థాయిలో మోసాలకు పాల్ప డ్డారు. ఈ ఏడాది మే నుండి జూలై వరకు ఆన్లైన్ టికెట్ బుకింగ్, డిజిటల్ వాలెట్ ఫ్లాట్ ఫామ్ లో అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లుగా ఓ సంస్థ గుర్తించింది.  కంపెనీ అంతర్గత ఆడిట్ లో టిక్కెట్లు బుకింగ్ చేసిన సంఖ్య, వాస్తవ ఆదాయం మధ్య విపరీతమైన తేడా ఉన్నట్లుగా తేలింది. దీంతో అంతర్గత ఏజెంట్లు, కొంతమంది యూజర్లు వాలెట్ సిస్టంలో ఉన్న టెక్నికల్ లోపాన్ని ఉపయోగించి అక్రమంగా డబ్బులు సంపాదించినట్లుగా తేలింది.  ఈ నిందితులు వాలెట్ రీఛార్జ్ చేసుకొని టికెట్ బుక్ చేసే వారు. వెనువెంటనే ఆ టికెట్ రద్దు చేసేవారు. సాఫ్ట్వేర్ లోపం కారణంగా రిఫండ్ డబ్బు తిరిగి జమ అవ్వడమే కాకుండా అసలు వాలెట్లో ఉన్న మొత్తాన్ని కూడా రెండు సార్లు చూపించేది. ఈ అవకాశాన్ని ఉపయోగించి వారు మళ్ళీ మళ్ళీ అదే పని చేసేవారు. ఈ విధంగా ఫేక్ బ్యాలె న్స్ తో ఇతరులకు టికెట్లు బుక్ చేసి కస్టమర్ల దగ్గర నుండి నేరుగా తమ ఖాతాలోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకు నేవారు. నింది తులు ఈ విధమైన మోసాలకు పాల్పడుతూ కోట్లలో డబ్బులు సంపాదిం చారు. అయితే ఈ విధంగా జరిగిన మోసాలను కంపెనీ గుర్తించి సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీ సులను ఆశ్రయించింది.

కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగి ఆన్లైన్ టికెట్ బుకింగ్ మరియు డిజిటల్ వాలంట్ మోసాలకు పాల్ప డుతున్న ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరు చేసిన మోసా నికి కంపెనీకి మూడు కోట్లకు పైగా నష్టం వాటిల్లిన ట్లుగా దర్యాప్తులో తేలింది. సైబర్ నేరాల బారిన పడకుండా సంస్థలు, వ్యక్తులు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా పోలీసులు సూచించారు. ఏదైనా అనుమానస్పద లావాదేవీలు గుర్తిస్తే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930 లేదా www. Cyber crime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని సైబర్ క్రైమ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వెల్లడించారు

By
en-us Political News

  
అక్టోబర్ 10న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారీ ఆందోళనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో దేశ రాజధానిలో హై అలర్ట్ ప్రకటించారు. 12,000 మంది బలగాలు, సీఆర్పీఎఫ్ మోహరింపు మరియు పోలీసు ఆంక్షల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
నాగ్‌పూర్‌లో రెండేళ్ల లైంగిక వేధింపులను తట్టుకోలేక 45 ఏళ్ల తండ్రిని క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపిన 17 ఏళ్ల మైనర్ బాలిక. అర్ధరాత్రి పోలీసులకు ఫోన్ చేసి లొంగిపోయిన చిన్నారి. ఈ దిగ్భ్రాంతికర సంఘటన పూర్తి వివరాలు చదవండి.
పంజాబ్‌లో ఆప్ నేత అమరిందర్ సింగ్ మండోఫల్‌ను పీసీఎస్ ఆఫీసర్‌నంటూ నమ్మించి పెళ్లాడి, నగలతో పరారైన కిలాడీ మహిళ మన్విందర్ కౌర్ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు చదవండి.
ఒడిశాలోని బ్రహ్మపూర్‌లో మద్యం మత్తులో తీవ్ర దారుణం జరిగింది. డబ్బుల వివాదంతో స్నేహితుడి గొంతు కోసి హత్య చేసిన వ్యక్తి అర్ధరాత్రి పోలీసుల తనిఖీల్లో రక్తపు మరకలతో చిక్కాడు. ఈ ఘోర క్రైమ్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి!
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో భర్త మరొక మహిళతో ఉండగా చూసిన భార్య కారును అడ్డుకోగా, ఆమెను 100 మీటర్లు బానెట్‌పై ఈడ్చుకెళ్లిన షాకింగ్ ఘటన వైరల్‌గా మారింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
కరేబియన్ సముద్రంలో డ్రగ్స్ అక్రమ రవాణా బోటుపై అమెరికా సైన్యం జరిపిన దాడిలో నలుగురు మరణించారు. సెప్టెంబర్ 2025 నుండి ఇప్పటివరకు జరిగిన 70 దాడుల్లో 235 మంది మృతి చెందిన పూర్వాపరాలు మరియు పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
హైదరాబాద్‌లోని మియాపూర్ హఫీజ్‌పేట్‌లో ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ చేతిలో 27 ఏళ్ల లేడీ డాక్టర్ సృజన హత్యకు గురైన దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు పోలీసుల దర్యాప్తు నివేదిక.
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎం పోస్టులు ఇప్పిస్తామంటూ ఉమ్మడి వరంగల్, హనుమకొండ జిల్లాల్లో రూ.లక్షల్లో వసూలు చేస్తున్న దళారీల దందా వెలుగులోకి వచ్చింది. యూనియన్ ముసుగులో జరుగుతున్న ఈ అక్రమాలపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజారెడ్డి విచారణ ప్రకటించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్‌లోని సరూర్ నగర్ సాగరిక ఇంటెగ్రేటెడ్ హైస్కూల్‌లో రాఖీలు, తిలకం తొలగింపు వివాదంపై బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి టీచర్‌ను హిజాబ్‌‌పై ప్రశ్నించడం సంచలనంగా మారింది. పోలీసులు కార్పొరేటర్‌పై సుమోటో కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్న కూతురిపై లైంగిక దాడికి యత్నించిన భర్త శ్రీనివాస్‌ను భార్య రమాదేవి గొడ్డలితో నరికి చంపింది. అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లా సీఐఎస్ఎఫ్ క్యాంపులో హెడ్ కానిస్టేబుల్ ఏకే 47 రైఫిల్‌తో చేసిన విచక్షణారహిత కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి చెందారు. సేవా పవర్ ప్రాజెక్ట్ వద్ద జరిగిన ఈ దారుణ ఘటనపై సీఐఎస్ఎఫ్ డీజీ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
ఒడిశా తాల్చేర్ ప్రాంతంలో సంచలనం సృష్టించిన దారుణ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్ మాధాపూర్‌లో స్పా సెంటర్ ముసుగులో నడుస్తున్న అక్రమ వ్యభిచార రాకెట్‌ను ఎస్‌ఓటీ పోలీసులు మట్టుబెట్టారు. నలుగురు యువతులను రక్షించి, రూ. 45 వేల నగదు, 8 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.