హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్ ఆక్టోపస్ 3.0

Publish Date:May 16, 2026

Advertisement

దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాలను అడ్డుకునేందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు  ఆపరేషన్ ఆక్టోపస్ 3.0   పేరుతో 15 రాష్ట్రాల్లో ఏకకాలంలో నిర్వహించిన దాడేలలె  సైబర్ నేరగాళ్లకు సహక రిస్తున్న కీలక ముఠాల గుట్టు రట్టు చేశారు. రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్ సహా మొత్తం 15 రాష్ట్రాల్లో పోలీసులు సమన్వయంతో  ఈ ఆపరేషన్ చేపట్టారు. 

సైబర్ మోసాలకు ఉపయోగించే సిమ్ కార్డులను అక్రమంగా సరఫరా చేస్తున్న ముఠాలపై ప్రధానంగా దృష్టి సారించిన హైదరాబాద్ సైబర్ పోలీసులు  ఇప్పటివరకు 10 మంది ఏజెంట్లను అరెస్ట్ చేశారు. అలాగే సైబర్ నేరగాళ్లకు మధ్యవర్తులుగా పనిచేస్తున్న మరో 30 మందికి నోటీసులు జారీ చేశారు.  నెట్‌వర్క్ స్థాయిలో పనిచేస్తున్న ఈ ముఠాలు దేశవ్యాప్తంగా సైబర్ మోసాలకు సహకరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం 15 రాష్ట్రాల్లో ఆపరేషన్ కొనసాగుతుండగా మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. 

గతంలో కూడా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు  ఆపరేషన్ ఆక్టోపస్ 1.0 లో సైబర్ క్రిమినల్స్ కు బ్యాంక్ అకౌంట్స్ అందిస్తున్న అకౌంట్ హోల్డర్లపై చర్యలు తీసుకోగా,  ఆపరేషన్ ఆక్టోపస్ 2.0 లో సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న బ్యాంక్ మేనేజర్లు, సిబ్బందిని లక్ష్యంగా చేసుకున్నారు. తాజాగా  ఆపరేషన్ ఆక్టోపస్ 3.0  ద్వారా సైబర్ నేరగాళ్లకు  సిమ్ కార్డులు అందిస్తున్న నెట్‌వర్క్‌ను టార్గెట్ చేస్తూ, సైబర్ క్రైమ్ మూలాలను కట్టడి చేయడంపై పోలీసులు దృష్టి పెట్టారు.

By
en-us Political News

  
మళ్లీ ఐ బొమ్మ పేరు తెరపైకి రావడంతో టాలీవుడ్‌లో కలకలం రేగింది.
మంత్రి నారా లోకేష్ త‌న‌యుడు నారా దేవాన్ష్ డినో డీట్స్ పేరుతో యూట్యూబ్ ఛాన‌ల్ ఆరంభించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ మత్తులో కొందరు యువకులు చేస్తున్న పనులు తీవ్ర కలకలం రేపుతున్నాయి
బండి భగీరథ్ కేసు రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది.
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది.
తెలంగాణ ఎప్‌సెట్‌ ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి.
తిరువనంతపురం నుండి ఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది.
హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఒక్క ఎస్టీ విద్యార్థి కూడా ఉన్నత విద్యకు దూరం కాకూడదన్నదే తమ లక్ష్యమని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం చేశారు.
ఆఫ్రికా దేశం కాంగోలో ఎబోలా వైరస్ తీవ్ర రూపం దాల్చింది. 80 మందికి పైగా మరణించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది.
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో తీవ్ర కలకలం రేపిన ఒక ఘోర సంఘటన స్థానికంగా పెను సంచలనంగా మారింది.
వాహనదారులపై ఇంధన ధరల భారం మరోసారి తీవ్రరూపం దాల్చింది.
హైదరాబాద్‌లో ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనుల దృష్ట్యా ఉప్పల్ రింగ్ రోడ్ చౌరస్తాను 3 నెలల పాటు తాత్కాలికంగా మూసివేశారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.