నగరంలో కల్తీ మాఫియా... ఇప్పుడు నీటిలో కూడా కల్తీ!

Publish Date:Apr 7, 2026

Advertisement

 

హైదరాబాద్ నగరంలో కల్తీ దందాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే పాలు, పండ్లు, మసాలాలు, అల్లం-వెల్లుల్లి, టీ పౌడర్, మాంసం వంటి అనేక ఆహార పదార్థాల్లో కల్తీ ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల కుళ్లిపోయిన గొర్రె, మేక మాంసం, చికెన్‌ను ప్రముఖ హోటల్స్, రెస్టారెంట్లకు సరఫరా చేస్తున్న ఘటనలు బయటపడడంతో ప్రజలు బయట భోజనం చేయడానికే భయపడే పరిస్థితి ఏర్పడింది.

ఇప్పుడు తాజాగా త్రాగే నీటిలో కూడా కల్తీ బయటపడటం మరింత ఆందోళన కలిగిస్తోంది. నగరంలోని అంబర్‌పేట్ ప్రాంతంలో అక్రమంగా నడుస్తున్న వాటర్ ప్లాంట్లపై అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. బోర్‌వెల్ నుంచి వచ్చే నీటిని ఎలాంటి శుద్ధి ప్రక్రియ లేకుండా నేరుగా ప్యాకెట్లలో నింపి “మినరల్ వాటర్” పేరుతో విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తక్కువ ధరకు లభిస్తున్న ఈ ప్యాకెట్ నీటిని ప్రజలు విస్తృతంగా వినియోగిస్తున్నట్లు తెలిపారు.

ఈ వ్యవహారంపై సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ విభాగం సంయుక్తంగా దాడులు చేపట్టాయి. దాడుల సమయంలో ప్లాంట్లలోని పరిస్థితులు చూసి అధికారులు షాక్‌కు గురయ్యారు. అపరిశుభ్రమైన వాతావరణం, లీకేజీలతో ఉన్న యంత్రాలు, పాకురు పట్టిన ట్యాంకులు, ఎలాంటి శుద్ధి లేకుండా నీటిని ప్యాకింగ్ చేయడం వంటి అంశాలు బయటపడ్డాయి. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పలు ప్లాంట్లను అధికారులు సీజ్ చేసి, నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు.

ఇప్పటికే ప్రతి వస్తువులో కల్తీ వెలుగులోకి వస్తున్న తరుణంలో, ఇప్పుడు త్రాగే నీటిలో కూడా కల్తీ బయటపడటం పరిస్థితిని మరింత భయంకరంగా మార్చింది. తక్కువ ధరకు లభించే ప్యాకెట్ నీటిని వినియోగించే ముందు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అనుమానాస్పద ఉత్పత్తులపై వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని ఫుడ్ సేఫ్టీ అధికారులు సూచించారు. నగరంలో కల్తీ దందాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని వారు హెచ్చరించారు.

By
en-us Political News

  
జీవనోపాధి కోసం ఊరు వదిలి వచ్చిన ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన ఒక నిర్లక్ష్యపు తమాషా ప్రాణాంతకంగా మారింది
కర్ణాటక రాజకీయాల్లో ఒక మాజీ శాసనసభ్యుడి వ్యవహారం ఇప్పుడు పెను సంచలనంగా మారింది.
పంజాబ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో మరో అవినీతి తిమింగలం ఏసీబీ వలలో చిక్కింది.
మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.
శబరిమలలో మహిళల ప్రవేశానికి సంబంధించిన వివాదంపై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీపై మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది.
అసెంబ్లీకి అతి సమీపంలో ఉన్న ఆల్ ఇండియా రేడియో కార్యాలయానికి తొలుత బాంబు బెదరింపు వచ్చింది. దీనిపై ఆల్ ఇండియా రేడియో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతోపోలీసులు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను బయటకు పంపించారు.
రాజధాని ప్రాంతమైన అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు మూడు ప్రతిష్ఠాత్మక సంస్థలకు ఈ ఎస్ఐపీబీ సమావేశంలో మంజూరు చేయడం ఈ అయ్యాయి. ఈ అనుమతులతో అమరావతి కేవలం పరిపాలనా కేంద్రంగానే కాకుండా టెక్నాలజీ హబ్‌గా కూడా ఎదుగుతుంది.
హైదరాబాద్ బేగంపేటలో ఉన్న 145 సంవత్సరాల ప్రాచీన వారసత్వ కట్టడం చిరాన్ ఫోర్ట్ క్లబ్ చుట్టూ వివాదం రాజుకుంది.
తాడేపల్లిలోని ఆమె నివాసంతో పాటు విజయవాడ, గుంటూరు జిల్లాల్లోని ఇతర అనుమానిత ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాలలో ఏసీబీ అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆమె పేరిట ఉన్న స్థిరాస్తులు, బ్యాంకు ఖాతాలు, బంగారు ఆభరణాలకు సంబంధించిన రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ చిక్కుల్లో పడ్డాడు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.