హైదరాబాద్‌కు క్లౌడ్ బరస్ట్ ముప్పు..ఇళ్ల నుంచి బయటకు రావొద్దు
Publish Date:Aug 7, 2025
Advertisement
హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో నగరాన్నికి క్లౌడ్ బరస్ట్ ముప్పు పొంచి ఉందని వాతవరణ నిపుణులు చెబుతున్నారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరించింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, హిమాయత్‌నగర్, లక్డీకపూల్, నాంపల్లి సహా పలు ప్రాంతాల్లో, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, అమీర్‌పేట్, మాదపూర్, కొండాపూర్, బయోడైవర్సిటీ, ఐకియా సెంటర్, ఏఎంబీ, ఇనార్బిల్ మాల్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, హైటెక్‌సిటీలో వర్షం దంచికొడుతోంది. దీంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగులంతా ఆఫీస్‌ల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు భారీ వర్ష సూచన ఉన్నందున అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.జీహెచ్ఎంసీతో పాటు పోలీస్, ట్రాఫిక్, హైడ్రా విభాగాల అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని అదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో తగిన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని ముందుగానే వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో 2.5-4 సెం.మీ వర్షం పడుతుందని ఐఎండీ వెల్లడించింది.
http://www.teluguone.com/news/content/hyderabad-39-203740.html





