Publish Date:Feb 24, 2012
హైదరాబాద్: ప్రపంచంలో పేరెన్నిక గల నీలిరంగు గ్రానైట్ కు కష్టాలొచ్చాయి.ఆర్ధిక మాంద్యం ప్రభావం, చైనా బయ్యర్లు, యూరోపియన్ దేశాలు కొనుగోలుకు దూరం కావడంతో ఎక్కడి గ్రానైట్ బ్లాకులు అక్కడే క్వారీలో నిలిచిపోయాయి. ఫలితంగా గ్రానైట్ క్వారీల యజమానులు తలలు పట్టుకుంటున్నారు.భారీగా పెట్టుబడులు పెట్టలేని గ్రానైట్ యజమానులు లిమిటెడ్ కంపెనీలు సైతం కటింగ్ అండ్ పాలిషింగ్ యూనిట్లకు అరకొర ధరలకే అమ్మకాలు జరుపుతున్నారు. ఒక క్యూబిక్ మీటర్ గ్రానైట్ బ్లాకు తీయాలంటే రూ.18 నుంచి రూ.20వేలు ఖర్చవుతుంది. అయితే దానిని రూ.14 నుంచి రూ.17వేలకే విక్రయించుకోవలసిన దుస్థితి ఏర్పడింది. ఒకపక్క ఎగుమతులు లేక మరొపక్క ధరలు పడిపోవడంతో క్వారీలు నడిపించాలా, ఆపేయాలా తేల్చుకోలేక పలు చిన్న చిన్న గ్రానైట్ కంపెనీల యజమానులు ఆలోచనలో పడ్డారు. దీనికితోడు ఇంధన ధరలు, క్వారీ పనులు నిర్వహించే ప్రొక్లెన్లు, కంప్రెషర్లు, టిప్పర్లు, డంపర్లు, జాకీల ధరలు పెరగడం, కూలీల కొరత ఏర్పడటం, పేలుడు సామాగ్రి ధరలు పెరగడం, వైర్ సా కటింగ్ పరికరాల ధరలు పెరగడంతో అన్నిరకాలుగా గ్రానైట్ పరిశ్రమ కష్టాలకు ఎదుర్కొంటుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/hyderabad-24-12154.html
275 మంది నిపుణులకు ఉద్యోగ అవకాశాలు...మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్లోని చారిత్రాత్మక చార్మినార్ ప్రాంతంలో సోమవారం నాడు అసాధారణ వాతావరణం నెలకొంది.
తెలంగాణలో ధరణి, భూభారతి భూ రికార్డుల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
కొడంగల్ నివాసంలో సీఎంను కలిసి శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్.!
సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో, అంతే స్థాయిలో నేరగాళ్ల అక్రమ మార్గాలు కూడా పెరిగిపోతున్నాయి.
విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉంటూ.. ఎండ, వాన, పగలు, రాత్రి తేడా లేకుండా ప్రజల రక్షణ కోసం శ్రమించే పోలీసుల ఆరోగ్యంపై తెలంగాణ పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది.
రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపిన ఒక అనూహ్య ఘటనలో, నకిరేకల్ శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ వేముల వీరేశంకు పెను ప్రమాదం తృటిలో తప్పింది.
హైదరాబాద్ పాతబస్తీలో మైనర్ బాలుడిపై లైంగిక వేధింపుల ఘటన తీవ్ర కలకలం రేపింది.
బాధితుల కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.వి. భాస్కర్ రెడ్డి చట్టాన్ని రక్షించాల్సిన బాధ్యతలో ఉన్న ఒక పోలీసు అధికారి కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడం గర్హనీయమని పేర్కొంటూ, కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించిన సీఐకు శిక్ష విధించింది.
తెలంగాణ రాష్ట్రంలో యాదవ సోదరుల ఆత్మగౌరవ వేడుకగా భావించే చారిత్రక సదర్ సమ్మేళనం అత్యంత వైభవంగా జరిగింది.
కదులుతున్న బస్సులోంచి తోసేయడంతో విషాదం.. ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం.!
టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన తాజా సంచలన చిత్రం ఇరుముడి చట్టపరమైన చిక్కుల్లో పడింది.
60 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు అపహరణ.!