Publish Date:Feb 24, 2012
కడప: కడప జిల్లా అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. చీకటి సామ్రాజ్యాలకు ఏర్పాటు చేసుకునే వ్యక్తులకు ఖద్దరు నేతల ఆశీస్సులు, ఖాకీల మద్దతు లభిస్తోంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి వైజాగ్ హార్బర్ లో ఉన్న హోటల్లో పనిచేసేవాడు. కొన్నేళ్ళ క్రితం కడప వచ్చాడు. వచ్చింది మొదలు ఎర్రచందనం అక్రమ రవాణా, దొంగనోట్ల చెలామణి, కొకైన్ కొనుగోలు, సరఫరా కార్యక్రమాలను విచ్చల విడిగా కొనసాగించాడు. విలాసవంతమైన భవనాలు, ఖరీదైన వాహనాలు, మందీమార్బలంతో తిరిగే ఈ కొకైన్ వీరుడికి జిల్లా కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు గట్టి మద్దతుదారులుగా ఉన్నారు. పోలీసులు కూడా ఇతనిచ్చే కాసులకోసం ఎదురు చూస్తూ ఉంటారు.
ఆయిల్ సైడింగ్ దందాలో లేడీ డాన్ గా చలామణి అవుతున్న ఒక మహిళ తన కుటుంబం సభ్యులతోపాటు ఐఓసిలోని కొంతమంది ఉద్యోగుల సహకారంతో యదేచ్ఛగా ఆయిల్ ను కొల్లగొట్టేస్తుంది. పెద్దల అండతో ఈమె పెట్రెగిపోతుంది. ఆయిల్ కొల్లగొట్టడం ద్వారా ఇప్పటికే ఆమె కోట్లాది రూపాయలు సంపాదించింది.
పురాతన దేవతా మూర్తుల విగ్రహాల వేటలో ముంబైకి చెందిన ఒక శేఠ్ కడపజిల్లాలో తిష్టవేశాడు. ఖరీదైన ఇరిడియం కాపర్ విగ్రహాల వేటలో అతను నిమగ్నమయ్యాడు. వీటి కొనుగోలు, విక్రయాల్లో అతను స్థానికి ఖద్దరు,ఖాకీలకు వాటాలు ఇస్తున్నాడు. ఈ విషయంపై జిల్లా ఎస్పీని ఇటీవల కొందరు విలేఖరులు ప్రశ్నిస్తే తమకు అతని సమాచారం ఉందని అంగీకరించారు. అయితే అతనిపై చర్య తీసుకోవడానికి మాత్రం సాహసించడం లేదు.
ఒకప్పుడు క్రికెట్ బెట్టింగ్ సామ్రాజ్యాన్ని ఏలిన నగరంలోని ఒక వ్యక్తితో చింతకొమ్మదిన్నెకు చెందిన ఒక యువకుడు జత కలిశాడు. ఇరివురు కలిసి బెట్టింగ్ సామ్రాజ్యాన్ని విస్తరించారు. పోలీసులు తమ జోలికి రాకుండా వారికి అన్ని ప్రయోజనాలు కల్పిస్తూ ఆనతికాలంలోనే అంచలంచలుగా కోట్లకు పగడలెత్తారు. ఈ చీకటి సామ్రాజ్య అధిపతుల కార్యకలాపాలతో కడప జిల్లాప్రతిష్ట మరింత దిగజారింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kadapa-24-12155.html
Publish Date:Oct 10, 2026
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే రాష్ట్ర పండుగ బతుకమ్మ వేడుకలు శనివారం నుంచి అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.
తండ్రి అంటే పిల్లలకు ఒక భరోసా, కుటుంబానికి ఒక పెద్ద దిక్కు. బయట ఎంతటి బిజీ రాజకీయ జీవితం గడిపినా, ఇంట్లో తమ వారి కోసం వారు చూపించే ప్రత్యేక శ్రద్ధ ఎంతో మధురమైనది.
ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో ఇక వర్షాలు అంతంత మాత్రమేనని వాతావరణ పరిశోధకులు చెబుతున్నారు. డిసెంబర్, జనవరిలలో శీతాకాలంలో చలి కూడా అంతంత మాత్రంగానే ఉంటుందనీ, డిసెంబర్ నుంచే రోహిణిని తలపించే ఎండలు మండిపోతాయని అంచనా వేస్తున్నారు.
కన్నబిడ్డకు అనారోగ్యం వస్తే ఏ తల్లైనా తల్లడిల్లిపోతుంది. బిడ్డకు నయం చేయించేందుకు తన దగ్గర ఉన్నదంతా ఖర్చు చేయడానికైనా వెనుకాడదు.
ఇండియాలో క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి అమెరికన్ ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఇదు అవుతుంది. అంటే ఇండియాలో ఏర్పాటు అవుతున్న అమెరికా యూనివర్సిటీ తెలంగాణకు తరలివచ్చిందన్న మాట.
తట్టి అన్నారం సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో కుక్కలు ఓ మృతదేహాన్ని పీక్కుతింటుండటాన్ని స్థానికులు గమనించారు. ఆ దృశ్యం చూసిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. చివరకు ఆమెను ఓయూ మాణికేశ్వర్‌నగర్‌కు చెందిన మంగమ్మగా గుర్తించారు.
ప్రభుత్వాలు స్వల్పకాలిక ఆర్థిక ప్రయోజనాల కోసం మద్యంపై ఆధారపడటం వల్ల వైద్యం, శాంతిభద్రతల పరిరక్షణ, కుటుంబ సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు నిష్ప్రయోజనంగా మరుతున్నాయి.
ఉద్యోగాల క్రమబద్ధీకరణ సమయంలో సమర్పించిన పీజీ, బీటెక్ తదితర విద్యార్హతల ధ్రువపత్రాలు సంబంధిత విశ్వవిద్యాలయాలు జారీ చేసినవి కావనీ, అవి నకిలీ సర్టిఫికెట్లనీ నిర్ధారణ కావడంతో వాటి ద్వారా ఉద్యోగాలు సంపాదించిన 35 మంది లెచ్చరర్లను ఊస్ట్ చేస్తూ తెలంగాణ ఇంటర్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
జూరాల ప్రాజెక్టు గద్వాల ప్రాంతానికి మాత్రమే కాకుండా సాగు, తాగునీటి అవసరాలకు కూడా కీలకమైన జలవనరు కావడంతో నీటి నుంచి దుర్వాసన రావడం, నీటి రంగుమారడంతో నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ట్రూఅప్ ప్రతిపాదనలపై విచారణ జరిపిన టీజీఈఆర్సీ తాజాగా ట్రూఆప్ చార్జీల వసూలుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం 7,635.22 కోట్ల రూపాయల ట్రూఅప్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఇందులో వ్యవసాయ వినియోగానికి సంబంధించిన 2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు