Publish Date:Feb 24, 2012
కామారెడ్డి: తెలంగాణా ఉద్యమ నేపధ్యంలో తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న టీడీపీ పార్టీకి ప్రస్తుతం కామారెడ్డి నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నిక విషమ పరీక్షగా మారింది. ఇప్పటికే తెలంగాణా నినాదంతో తెరపైకి వచ్చిన అన్ని ఉప ఎన్నికల్లోనూ ఘోర పరాభావాలను చవి చూసిన టిడిపి శ్రేణులు కామారెడ్డి ఉప ఎన్నికల్లోనైనా గట్టి పోటీనిచ్చి ఉనికిని చాటుకుంటారా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ముక్కోణపు పోటీ అనివార్యమని స్పష్టమైనప్పటికీ కాంగ్రెస్, టిఆర్ఎస్ ల మధ్యే హోరా హోరీ పోరు ఉంటుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్ వేణుగోపాలరావును ఇప్పటికే తమ పార్టీ అభ్యర్ధిగా ప్రకటించింది. టిడిపి ఎమ్మెల్యేలు మండవ వెంకటేశ్వరరావు, హనుమంత్ షిండె, అన్నపూర్ణమ్మ, ఇతర ముఖ్యనేతలంతా కామారెడ్డిలో నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి పార్టీ శ్రేణులను సమాయత్త పరిచారు. ప్రత్యేక తెలంగాణాకు టిడిపి ఎంతమాత్రం వ్యతిరేకం కాదనే నినాదంతో ప్రజల్లోకి చొచ్చుకెళ్ళే ప్రయత్నం చేయాలని భావిస్తున్నారు. ఇటీవల బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పార్టీ తరపున అభ్యర్ధిని బరిలో నిలపకపోవడం వల్ల లాభంకంటే ఎక్కువగా నష్టమే జరిగిందని స్థానిక నాయకులు అంటున్నారు. ఓటమి భయంతోనే బాన్సువాడలో టిడిపి పోటీ చేయలేదన్న అపవాదును మూటగట్టుకుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కామారెడ్డి ఉప పోరులో తలపడాలని టిడిపి నాయకత్వం నిర్ణయించింది. నిజామాబాద్ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు గట్టి పట్టు ఉండేది. అయితే తెలంగాణావాదం బలపడిన తరువాత టిడిపి ఇక్కడ బలహీనపడింది. 2010 ఉప ఎన్నికల్లో ఒక్కసారిగా డీలా పడింది. నిజామాబాద్ అర్బన్ ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధులు కనీసం డిపాజిట్లు కూడా పొందలేకపోయారు. కామారెడ్డి ఉప ఎన్నికల్లో మళ్ళీ అటువంటి పరాభవమే ఎదురవుతుందనే భయంతో తెలుగు తమ్ముళ్ళు ముమ్మర ప్రచారానికి సన్నద్దమవుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kamareddy-24-12153.html
Publish Date:Oct 10, 2026
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే రాష్ట్ర పండుగ బతుకమ్మ వేడుకలు శనివారం నుంచి అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.
తండ్రి అంటే పిల్లలకు ఒక భరోసా, కుటుంబానికి ఒక పెద్ద దిక్కు. బయట ఎంతటి బిజీ రాజకీయ జీవితం గడిపినా, ఇంట్లో తమ వారి కోసం వారు చూపించే ప్రత్యేక శ్రద్ధ ఎంతో మధురమైనది.
ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో ఇక వర్షాలు అంతంత మాత్రమేనని వాతావరణ పరిశోధకులు చెబుతున్నారు. డిసెంబర్, జనవరిలలో శీతాకాలంలో చలి కూడా అంతంత మాత్రంగానే ఉంటుందనీ, డిసెంబర్ నుంచే రోహిణిని తలపించే ఎండలు మండిపోతాయని అంచనా వేస్తున్నారు.
కన్నబిడ్డకు అనారోగ్యం వస్తే ఏ తల్లైనా తల్లడిల్లిపోతుంది. బిడ్డకు నయం చేయించేందుకు తన దగ్గర ఉన్నదంతా ఖర్చు చేయడానికైనా వెనుకాడదు.
ఇండియాలో క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి అమెరికన్ ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఇదు అవుతుంది. అంటే ఇండియాలో ఏర్పాటు అవుతున్న అమెరికా యూనివర్సిటీ తెలంగాణకు తరలివచ్చిందన్న మాట.
తట్టి అన్నారం సమీపంలో నిర్మానుష్య ప్రాంతంలో కుక్కలు ఓ మృతదేహాన్ని పీక్కుతింటుండటాన్ని స్థానికులు గమనించారు. ఆ దృశ్యం చూసిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. చివరకు ఆమెను ఓయూ మాణికేశ్వర్‌నగర్‌కు చెందిన మంగమ్మగా గుర్తించారు.
ప్రభుత్వాలు స్వల్పకాలిక ఆర్థిక ప్రయోజనాల కోసం మద్యంపై ఆధారపడటం వల్ల వైద్యం, శాంతిభద్రతల పరిరక్షణ, కుటుంబ సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు నిష్ప్రయోజనంగా మరుతున్నాయి.
ఉద్యోగాల క్రమబద్ధీకరణ సమయంలో సమర్పించిన పీజీ, బీటెక్ తదితర విద్యార్హతల ధ్రువపత్రాలు సంబంధిత విశ్వవిద్యాలయాలు జారీ చేసినవి కావనీ, అవి నకిలీ సర్టిఫికెట్లనీ నిర్ధారణ కావడంతో వాటి ద్వారా ఉద్యోగాలు సంపాదించిన 35 మంది లెచ్చరర్లను ఊస్ట్ చేస్తూ తెలంగాణ ఇంటర్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
జూరాల ప్రాజెక్టు గద్వాల ప్రాంతానికి మాత్రమే కాకుండా సాగు, తాగునీటి అవసరాలకు కూడా కీలకమైన జలవనరు కావడంతో నీటి నుంచి దుర్వాసన రావడం, నీటి రంగుమారడంతో నీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ట్రూఅప్ ప్రతిపాదనలపై విచారణ జరిపిన టీజీఈఆర్సీ తాజాగా ట్రూఆప్ చార్జీల వసూలుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం 7,635.22 కోట్ల రూపాయల ట్రూఅప్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఇందులో వ్యవసాయ వినియోగానికి సంబంధించిన 2,214.99 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక సంచలన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, ప్లాట్ల విక్రయాల పేరుతో పలువురి నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు