తాడో పేడో తేల్చుకోనున్న జూడాలు

Publish Date:Jan 26, 2012

Advertisement

హైదరాబాద్: న్యాయమైన డిమాండ్ల సాధనకు రాష్ట్రంలో జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మె రోజురోజుకూ ఉధృతమవుతోంది. ప్రభుత్వం ప్రతిసారీ మాట తప్పడంతో, ఈసారీ తాడో పేడో తేల్చుకునేందుకే జూడాలు సిద్ధమయ్యారు. వినూత్న తరహాలో నిరసనలతోపాటు..ఆమరణ దీక్షకు సైతం జూడాలు సిద్ధమయ్యారు. ఎలక్షన్ల సమయంలో ఇచ్చిన హామీలు గాలికి వదిలేసినట్లు.., తమ డిమాండ్ల పై కూడా పాలకులు చిత్తశుద్ధితో వ్యవహరించటం లేదంటూ జూనియర్ డాక్టర్లు మండిపడుతున్నారు. గతంలో ఇచ్చిన హామీల్ని నెరవేర్చటంతోపాటు., ఇతరత్రా 11 డిమాండ్లతో వారు మరో సారి ఆందోళన బాటపట్టారు. ప్రతి నెలా తొలివారంలోనే స్టైఫండ్ విడుదల చేయటంతోపాటు., రెండేళ్లకోసారి 15 శాతంగా ఉన్న స్టైఫండ్ పెంపును 40 శాతం చేయాలన్నది వారి ప్రధాన డిమాండ్. వీటితోపాటు వైద్య కళాశాలల్లో మౌళిక వసతుల కల్పన., విధుల్లో భద్రత కల్పించటం., గ్రామాల్లో తప్పనిసరి సేవల్ని రద్దు చేయటం వంటి ఇతరత్రా 11 డిమాండ్లు ఉన్నాయి. గడిచిన నెలరోజులుగా నిరసనలు తెలుపుతున్నా సానుకూలంగా స్పందించకపోవటంతో..సర్కారు వైఖరిని నిరసిస్తూ గాంధీ ఆస్పత్రిలో జూడాలు ఆమరణ దీక్షకు దిగారు. సమస్యల పరిష్కారానికి లిఖితపూర్వక హామీ ఇవ్వాలని వారు డిమాండ్‌ చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వాసుపత్రుల్లోనూ ఓపి సేవలు ఆగిపోయాయి. అత్యవసర సర్వీసుల్ని సైతం ఆపేసేందుకు జూడాలు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావటంతో..అత్యవసర సేవల్ని సైతం నిలిపేసేందుకు జూడాలు సిద్ధమవుతున్నారు.

By
en-us Political News

  
టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన తాజా సంచలన చిత్రం ఇరుముడి చట్టపరమైన చిక్కుల్లో పడింది.
60 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు అపహరణ.!
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
అవసరానికి ఆదుకుంటుందనే నమ్మకంతో ఓ వ్యక్తి ర్యాపిడో పార్సిల్ సేవలను ఆశ్రయించాడు.
బిగ్ బ్రదర్ ఆఫీసులో రియల్టర్‌కు ప్రత్యేక ఛాంబర్.. ఒక్క బిల్డర్ కోసం వేలాది కుటుంబాలను రోడ్డున పడేస్తారా?
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అమాయక యువతులను లక్ష్యంగా చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా నడుపుతున్న మరో అక్రమ ఫెర్టిలిటీ రాకెట్‌ను పోలీసులు రట్టు చేశారు.  
.గరల్స్ హాస్టల్ ముసుగులో నిర్వహిస్తున్న అక్రమ ఫెర్టిలిటీ సెంటర్ బాగోతం వెలుగులోకి వచ్చింది. పక్కాగా అందిన సమాచారంతో హైదరాబాద్ ప్రకాశ్ నగర్ లో అమినీత గరల్స్ హాస్టల్ పై దాడి చేయడంలో అక్రమ ఫెర్టిలిటీ సెంటర్ గుట్టు రట్లైంది.
పలు ప్రాంతాలలో ఇప్పటికే  రోజూవారీ సరఫరా  నిలిపివేశారు. రోజు విడిచి రోజు మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారు. ముందు ముందు ఇది రెండు రోజులు, మూడు రోజులు. వారం రోజులకు కూడా పెరిగే అవకాశం ఉందని జలమండలి అధికారులే ఆఫ్ ది రికార్డ్ చెడుతున్నారు.
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న జాతీయ స్థాయి నిరసన ర్యాలీకి తెలంగాణ నుంచి పార్టీ శ్రేణులను తరలించేందుకు ప్రత్యేక రైళ్లు కేటాయించకపోవడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ప్రయాణికురాలు తోసివేయడంతో గాయపడిన టీజీఎస్‌ఆర్టీసీ కండక్టర్ ప్రవళికకు ప్రభుత్వం అండగా ఉంటుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) కోసం ప్రభుత్వానికి దరఖాస్తు సమర్పించారు. ఈ నిర్ణయం రాష్ట్ర పాలనా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  తదుపరి సీఎస్ రేసులో  ఉన్న జయేష్ రంజన్ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోవడం సంచలనంగా మారింది. 
మరీ ముఖ్యంగా హైదరాబాద్ పై చలిపులి పంచా విసిరింది.  ఉదయం పూట ఎండ తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటున్నా, రాత్రి వేళల్లో,  తెల్లవారుజామున చలి తీవ్రత భారీగా ఉంటోంది.  
కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మకల్ సల్ఫీ నగర్‌లో చోటుచేసుకున్న ఒక అంతులేని విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.