వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేస్తా: బాలకృష్ణ
Publish Date:Jan 18, 2012
Advertisement
హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర శాసనసభ స్థానానికి పోటీ చేస్తానని ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. తన తండ్రి దివంగత ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా బసవతారకం కాన్సర్ ఆస్పత్రిలో ఎన్టీఆర్కు నివాళులు అర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు తమ కుటుంబం మొత్తం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావచ్చు, రాకపోవచ్చని, ఎవరి అభిప్రాయం వారిదని ఆయన పేర్కొన్నారు. రాజకీయాల్లో వారసత్వమనే మాటకు అర్ధం లేదన్నారు. ఈ సందర్భంగా చిరంజీవిపై ఆయన చతుర్లు విసిరారు. రాజకీయాల్లోకి వెళ్లాక చిరంజీవి బాగానే నేర్చుకున్నాడన్నారు. అందుకే మంత్రి పదవుల కోసం ఢిల్లీలో బేరాలు చేస్తున్నాడని ఆయన ఎద్దేవా చేశారు. బాలకృష్ణది చిన్న పిల్లల మనస్తత్వమన్న చిరంజీవి వ్యాఖ్యలపై ప్రశ్నించినప్పుడు ఆయన పైవిధంగా స్పందించారు.
http://www.teluguone.com/news/content/hyderabad-24-11000.html





