ప్రత్యామ్నాయం:కేబినెట్ లో డీఎస్ కు ఛాన్స్?
Publish Date:Jan 18, 2012
Advertisement
హైదరాబాద్: సీఎం మంత్రివర్గంలోకి తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి వర్గంలోని శాసనమండలి సభ్యుడు సి.రామచంద్రయ్యను తీసుకునేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆయనకు పదవి ఇవ్వడంపై కడప జిల్లా కాంగ్రెసు నేతలతో పాటు కాంగ్రెసు పార్టీ సీనియర్ శాసనమండలి సభ్యులు కూడా అసంతృప్తితో ఉన్నట్లుగా కనిపిస్తోంది. మంగళవారం కొందరు మండలి నేతలు అధిష్టానానికి సీనియర్లను పరిగణలోకి తీసుకోవాలంటూ లేఖ కూడా రాశారు. సి.రామచంద్రయ్యకు కేబినెట్లో చోటు కల్పిస్తే శాసనమండలిలో ఆయనకు సభా నాయకుడి హోదా దక్కుతుంది. ఎన్నాళ్లుగానో పార్టీకి సేవలందిస్తున్న తమకు కాకుండా రామచంద్రయ్య సభా నాయకుడు ఐతే సీనియర్లు జీర్ణించుకోలేరు. అందుకు ప్రత్యామ్నాయంగా ఎమ్మెల్సీలలో సి.రామచంద్రయ్యతో పాటు కాంగ్రెసు సీనియర్లలోని మరొకరిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీనియారిటీ, సామాజికవర్గం, ప్రాంతీయం దృష్ట్యా డి.శ్రీనివాస్‌ను మంత్రివర్గంలోకి తీసుకొని శాసనమండలి నేత హోదా కల్పించవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/hyderabad-24-10998.html





