హుజురాబాద్ పై హాట్ హాట్ గా కాంగ్రెస్ మీటింగ్.. జానారెడ్డి సంచలనం
Publish Date:Nov 3, 2021
Advertisement
హుజురాబాద్ ఉప ఎన్నిక మంటలు కాంగ్రెస్ లో చల్లరాడం లేదు. డిపాజిట్ కూడా రాకపోవడంతో పీసీసీ నేతలపై కొందరు సీనియర్లు గుస్సా అవుతున్నారు. ఓపెన్ గానే తమ అసంతృప్తిగా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు, పార్టీ పరిస్థితిపై చర్చించడానికి గాంధీ భవన్లో కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశమైంది. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితిపై కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మధ్య వాడీవేడి చర్చ జరిగినట్లు సమాచారం. పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోకుండా బలహీనపడేటట్లు చేస్తున్నారని భట్టి విక్రమార్కపై రేణుక అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను సీఎల్పీ నేతనని.. పార్టీ అభివృద్ధి కోసమే పనిచేస్తున్నట్లు భట్టి విక్రమార్క సమాధానమిచ్చినా ఆమె సంతృప్తి చెందలేదు. సీఎల్పీ నేత అయితే సమస్యలు పరిష్కరించాలే కానీ సృష్టించ వద్దని రేణుక హితవు పలికారు. అనంతరం మాజీ ఎంపీ వీహెచ్ మాట్లాడుతూ తనను మీడియా ముందు మాట్లాడవద్దని అంటున్నారని.. కొంతమంది నేతలు మాత్రం ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వారు మాట్లాడుతున్నారని అన్నారు. హుజూరాబాద్‌లో బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కాకుండా ఎస్సీని నిలబెడితే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. అభ్యర్థి విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేదన్నారు. ఓ వైపు సమావేశం జరుగుతుండగానే మరోవైపు మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ గాంధీభవన్ నుంచి వెళ్లిపోయారు. ఊహించినట్లుగానే కాంగ్రెస్ సమావేశం చాలా వాడీవేడిగా కొనసాగింది. ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ పార్టీని, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని లక్ష్యం చేసుకుని పార్టీ కీలక నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే వారిద్దరూ ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఈ సమావేశానికి హాజరై, రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తానని నిన్న జగ్గారెడ్డి తెలిపారు. అయినప్పటికీ ఆయన రాలేదు. సమావేశంలో పాల్గొన్న నేతలే హుజురాబాద్ ఫలితంపై సమీక్ష నిర్వహించారు. ఇక ఈ సమావేశానికి హాజరైన సీనియర్ నేత జానారెడ్డి మధ్యలోనే వెళ్లిపోయారు. వెళ్తూ ఆ.న పలు వ్యాఖ్యలు చేశారు. ప్రతిసారి సమావేశానికి తానిక రానని, తన అవసరం ఉన్నప్పుడే వస్తానంటూ వ్యాఖ్యానించారు. ఒకవేళ తాను ఈ సమావేశానికి హాజరుకాకపోతే, తాను రాలేదని అంటారని, ఆ మాట పడకూడదనే వచ్చి వెళ్తున్నానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జానారెడ్డి.
http://www.teluguone.com/news/content/huzurabad-by-poll-heat-in-cong-jana-reddy-hot-comments-39-125775.html





