భార్యా పిల్లలకు విషమిచ్చి.. భర్త ఆత్మహత్య

Publish Date:Jun 21, 2026

Advertisement

చిత్తూరు జిల్లాలో  ఓ కుటుంబం మొత్తం బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన ఇది.  చిత్తూరు రూరల్ మండలం బంగారెడ్డిపల్లి గ్రామంలో  జరిగిన ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది.  బంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన దామోదర్ అనే వ్యక్తి   భార్య నిర్మల కొంతకాలంగా   తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది.

 ఆమె అనుభవిస్తున్న బాధను నిరంతరం గమనిస్తున్న దామోదర్ తీవ్ర మానసిక ఆవేదనకు గురయ్యాడు. భార్య అనారోగ్యంపై బెంగ పెట్టుకున్న ఆయన, తాము లేకపోతే పిల్లల భవిష్యత్తు ఏమౌతుందోననే ఆందోళనతో  తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు.  భార్య నిర్మలకు,  కన్నబిడ్డలైన 8వ తరగతి చదువుతున్న కుమారుడు దిలీప్, 6వ తరగతి చదువుతున్న కుమార్తె శ్రీవిద్యలకు ఆహారంలో   విషం కలిపి ఇచ్చాడు. వారు ముగ్గురూ ప్రాణాలు విడిచినట్లు నిర్ధారించుకున్న తర్వాత, తానూ కూడా ఇంట్లోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. 

 ఆత్మహత్యకు ముందు దామోదర్ రాసిన ఒక సూసైడ్ నోట్ లో  తమ మరణానికి  ఎవరూ బాధ్యులు కారనీ..  భార్య అనారోగ్య బాధలను భరించలేకే తాము ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నామని  పేర్కొన్నాడు. అంతేకాకుండా, తాము చనిపోయిన తర్వాత తమ అంత్యక్రియల నిర్వహణ ఖర్చుల కోసం తమ ఏటీఎం   కార్డుల్లో తగినంత నగదు ఉందని, ఆ డబ్బులను డ్రా చేసుకుని అంతిమ సంస్కారాలు జరిపించాలని ఆ లేఖలో ప్రత్యేకంగా అభ్యర్థించాడు.  

By
en-us Political News

  
భారత స్టాక్ మార్కెట్ లో నేడు పండగ వాతావరణం నెలకొంది. సెన్సెక్స్ 400 పాయింట్లు జంప్ చేయగా, నిఫ్టీ 24,100 మార్కును దాటి దూసుకుపోయింది. రిలయన్స్, ఐటీ షేర్ల ర్యాలీ వివరాలు, అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం మరియు ఐపీఓ అప్‌డేట్స్ ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి.
గ్లోబల్ ఐటీ దిగ్గజం అక్సెంచర్ ఇచ్చిన షాక్‌తో భారతీయ ఐటీ రంగంలో 1.35 లక్షల కోట్ల రూపాయల సంపద హరించుకుపోయింది. 52 వారాల కనిష్టానికి పడిపోయిన ఇన్ఫోసిస్, టీసీఎస్, కోఫోర్జ్ షేర్లు మళ్లీ కోలుకుంటున్న తరుణంలో మార్కెట్ నిపుణులు ఇన్వెస్టర్లకు ఇస్తున్న కీలక సూచనలు మరియు టార్గెట్ లెవెల్స్ ఏమిటో ఇక్కడ తెలుసుకోండి.
ఖతార్‌లోని ప్రముఖ రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీలోని బర్జన్ గ్యాస్ ప్లాంట్‌లో ఘోర పేలుడు సంభవించింది. 54 మంది గాయపడగా, 18 మంది గల్లంతయ్యారు. ప్రపంచ ఇంధన మార్కెట్‌పై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
న్యూజిలాండ్‌తో జరిగిన ఓవల్ టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా ఇంగ్లాండ్ జట్టుకు ఐసీసీ 12 డబ్ల్యూటీసీ పాయింట్ల కోత విధించింది. అలాగే ఆటగాళ్లకు 50 శాతం మ్యాచ్ ఫీజు జరిమానా పడింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఫిఫా వరల్డ్ కప్ 2026లో కేవలం 10 రోజుల్లోనే 8 ఓన్ గోల్స్ నమోదయ్యాయి. 2018 రష్యా రికార్డును బద్దలు కొట్టే దిశగా సాగుతున్న ఈ విచిత్రమైన ఫుట్‌బాల్ రికార్డుల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
రకాల, భూపాలపల్లి ప్రధాన రహదారిపై సరిగ్గా జిల్లా రవాణా అధికారి కార్యాలయం ముందే ఈ ప్రమాదం జరిగింది. రవాణా శాఖకు చెందిన సిబ్బందితో కలిసి డీటీఓ వెంకన్న కార్యాలయం ముందు రోడ్డుపై వెళ్తున్న వాహనాలను ఆపి తనిఖీలు చేస్తున్నారు.
పుల్లంపేట వద్ద కడప డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, ఒక భారీ లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది తిరుపతి నుంచి కడప వైపు వెళ్తున్న నాన్‌స్టాప్ ఆర్టీసీ సర్వీసు బస్సు పుల్లంపేట సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది.
విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఓ టీచర్.. కీచకుడిగా మారి.. ఏఐ టూల్స్ సహాయంతో తన వద్దే చదువుకునే ఒక మైనర్ విద్యార్థినిపై మానసిక దాడికి తెగబడ్డాడు. ఈ అఘాయిత్యానికి పాల్పడిన సదరు ఉపాధ్యాయుడిని విశాఖపట్నం సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ట్రంప్ చేసిన ఈ అవమానకరమైన, బెదిరింపు వ్యాఖ్యలపై ఇరాన్ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేసి చర్చలను బాయ్ కాట్ చేస్తున్నట్లు ప్రకటించి వాకౌట్ చేశారు. దీంతో చర్చలు విఫలమై కథ మళ్లీ మొదటికొచ్చిందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.
సింధు జలాల వివాదాన్ని రాజకీయం చేస్తూ యుద్ధ నాటకానికి తెరలేపింది. సింధు నదీ జలాల విషయంలో తమ దేశ ప్రయోజనాలకు, నీటి ప్రవాహానికి ఏమాత్రం ముప్పు వాటిల్లుతోందని భావించినా భారత్‌తో యుద్ధానికైనా వెనుకాడబోమని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. నీటి హక్కులు తమ జాతీయ భద్రతలో ఒక భాగమని, అవసరమైతే సైనిక చర్యకు దిగే అవకాశాన్ని తాము కొట్టిపారేయలేమని చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.
ఈ ప్రమాదంలో కనీసం 60 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో చాలా మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో ప్లాంట్ లోపల విధులు నిర్వహిస్తున్న మరో 18 మంది కార్మికుల ఆచూకీ తెలియాల్సి ఉంది.
లెబనాన్‌లోని హిజ్బుల్లా వంటి తమ మిత్రపక్ష సాయుధ గ్రూపులను ఇరాన్ వెంటనే నియంత్రించకపోతే, ఆ దేశంపై మునుపెన్నడూ లేని విధంగా తీవ్రమైన బాంబు దాడులు, సైనిక చర్యలు తప్పవంటూ ట్రంప్ సోషల్ మీడియా ద్వారా హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు చర్చల హాల్‌లోకి చేరడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ట్రంప్ చేసిన తీవ్రమైన బెదిరింపు వ్యాఖ్యలపై ఇరాన్ అధికారిక ప్రతినిధి బృందం అభ్యంతరం వ్యక్తం చేసింది.
గోడౌన్‌లో నిల్వ ఉంచిన పెయింట్లు, ర రసాయనాల వల్లే ఈ ప్రమాదం సంభవించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పేలుడు ధాటికి అనూప్ ప్రధాన్ శరీనం ఛిత్రమై శరీర భాగాలు పది మీటర్ల దూరం వరకూ ఎగిరి పడ్డాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.