Publish Date:Apr 25, 2022
ఉగ్రవాదంతో పాటు డ్రగ్స్‌తోనూ భారత్‌ను దెబ్బ తీయాలని ప్రయత్నిస్తోంది పాపిస్తాన్. పాక్ ప్రేరేపిత టెర్రరిస్టులను భారత సైన్యం పిట్టల్లా కాల్చిపడేస్తుంటే దాయాది దేశానికి మైండ్ బ్లాంక్ అవుతోంది. తుపాకులతో పని కాదనుకుందో ఏమో.. డ్రగ్స్‌తో మనల్ని దెబ్బకొట్టాలని స్కెచ్ వేస్తోంది. పాకిస్తాన్ నుంచి పెద్ద ఎత్తున మత్తు పదార్థాలను భారత్‌లోకి అక్రమంగా డంప్ చేస్తోంది. గతంలో గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడటం.. అక్కడ డొంక లాగితే.. ఆ లింకులు ఏపీకి, వైసీపీ నేతలకు చుట్టుకోవడం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. లేటెస్ట్‌గా మరోసారి గుజరాత్ తీరంలో పెద్ద మొత్తంలో హెరాయిన్ చిక్కడంతో ఏపీ మరోసారి ఉలిక్కిపడింది. అయితే ఈసారి ఆ పాపం.. పాకిస్తాన్‌దని తేలింది.
గుజరాత్ తీరంలో మరోసారి భారీ ఎత్తున మాదకద్రవ్యాల పట్టివేత కలకలం రేపింది. పాకిస్థాన్ నుంచి భారత్‌కు అక్రమంగా తరలిస్తోన్న వందల కోట్ల విలువైన హెరాయిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారీగా మాదకద్రవ్యాలతో భారత జలాల్లోకి ప్రవేశించిన పాకిస్థాన్ ఫిషింగ్ బోటును గుజరాత్ తీరంలో అధికారులు పట్టుకొన్నారు. రూ.280 కోట్ల విలువైన హెరాయిన్‌ను సీజ్ చేశారు. ఆ పడవలోని తొమ్మిది మంది సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు.
అరేబియా సముద్రం మీదుగా హెరాయిన్ స్మగ్లింగ్ జరుగుతున్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో ఇండియన్ కోస్ట్ గార్డ్, గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్-ఏటీఎస్ సంయుక్తంగా ఆదివారం రాత్రి స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది. భారత్ వైపు వస్తున్న పాకిస్థాన్ పడవ ‘అల్ హజ్’ను అడ్డుకున్నారు. తనిఖీలు నిర్వహించగా.. భారీ ఎత్తున హెరాయిన్‌ను గుర్తించారు. పడవలోని సిబ్బందిని అదుపులోకి తీసుకుని.. డ్రగ్స్‌ను ఎక్కడికి సరఫరా చేస్తున్నారనే దానిపై ఆరా తీస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/huge-drugs-at-gujarat-port-25-134923.html
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.