Publish Date:Apr 25, 2022
రెండేళ్లుగా ప్రపంచ జనాభాను అతలాకుతలం చేసిన కరోనా వైరస్ గత కొద్ది రోజులుగా కాస్త తగ్గుముఖం పట్టింది. దీంతో అందరం ఊపిరి పీల్చుకుంటున్నాం. అయితే.. విజృంభణను కొద్దిగా తగ్గించిన కరోనా పలు రూపాంతరాలు మార్చుకుంటూనే ఉంది. ఇప్పుడు ఒమిక్రాన్ తాజా వేరియంట్లతో మళ్లీ విరుచుకుపడుతోంది. కరోనా పుట్టుకకు మూలకారణం అని ప్రపంచం మొత్తం భావిస్తున్న చైనాలో మళ్లీ విజృంభించి అక్కడి జనజీవనాన్ని అష్టదిగ్బంధనం చేస్తోంది. బ్రిటన్, అమెరికా దేశాల్లో కూడా తన ప్రతాపం చూపిస్తోంది. వాటితో పాటుగా భారతదేశంలో కూడా కరోనా కేసులు గత కొద్ది రోజులుగా కోరలు చాస్తోంది. ప్రజలను తీవ్రంగా ఆందోళనకు గురిచేస్తోంది.
దేశంలో గడచిన 24 గంటల్లో 2 వేల 541 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి వెయ్యి 862 మంది బాధితులు కోలుకున్నారు. కరోనా మహమ్మారికి 30 మంది బలైపోయారు. దేశంలోని 12 రాష్ట్రాల్లో కరోనా మరింత ఎక్కువగా విరుచుకుపడుతోంది. అంతకు ముందు వారంతో పోల్చితే.. ఈ వారం రోజుల్లో ఆ 12 రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు రెట్టింపు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి కంటే కొత్త కేసులే ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 16 వేలు దాటిపోయింది. కరోనా వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 5 లక్షల 22 వేల 223 మంది ఈ మహమ్మారితో ప్రాణాలు కోల్పోయారు.
దేశ వ్యాప్తంగా ఏప్రిల్ 18 నుంచి 24వ తేదీ మధ్య కాలంలో15 వేల 700కు పైగా కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి. అంతకు ముందు వారం 8 వేల కేసులు నమోదయ్యాయి. అంటే కొత్త కేసుల సంఖ్య 95 శాతం పెరిగిందన్నమాట. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 187 కోట్ల డోసుల పంపిణీ జరిగినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.
కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించిన గణాంకాలను చూస్తే.. రోజువారీ పాజిటివిటీ రేటు 0.84 శాతం ఉంది. రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 16 వేల 522 మంది కరోనాతో బాధపడుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/again-corona-cases-registering-high-25-134928.html
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్