ధనవంతులు కావడం ఎలా?

Publish Date:Feb 12, 2026

Advertisement


నేటికాలంలో మనిషి కష్టపడి డబ్బు సంపాదించేది ధనవంతుడు కావడానికే. ఎందుకంటే ధనవంతుడిగా ఉంటే చాలా రకాల సమస్యలు దూరం అవుతాయి.  కానీ చాలామంది ఆర్థికంగా ఎదగలేరు. ఈ కారణంగా మధ్యతరగతి, దిగువ తరగతి వారిగానే ఉండిపోతారు తప్ప, ధనవంతుల లిస్ట్ లోకి వెళ్లలేరు.  అయితే దీనంతటికి కారణం ఆ వ్యక్తులే అంటున్నారు ఆర్థిక నిపుణులు,  లైఫ్ స్టైల్ విశ్లేషకులు.  ఇంతకీ మనిషి చేసే తప్పులు మనిషిని ధనవంతుడు కాకుండా ఎలా  ఆపుతాయి.  ధనవంతుడు కావాలంటే ఏం చేయాలి? తెలుసుకుంటే..

మనిషి చేసే తప్పు..

శ్రమ మనిషికి నిజమైన సంపద, కానీ మనిషి చాలా సార్లు శ్రమిస్తాడు కానీ అతనికి సొంతంగా ఎదగడం తెలియదు.  గంధం తీయాలంటే గందపు చెక్కను అరగదీయాలి,  అలాగే ఒక మంచి పూల హారం కావాలంటే పూలను దారంలోకి జొప్పించి అల్లాలి.  ఇవన్నీ వ్యక్తిలో ఓపిక,  శ్రమకు చక్కని నిదర్శనాలు. అలాంటి శ్రమ, ఓపిక ఉన్నప్పుడే.. దేవుడి ముందు నిలబడి దేవుడిని తృప్తిగా ప్రార్థిస్తారు. ఆ భగవంతుడి అనుగ్రహం కూడా పొందగలుగుతారు. అదే విధంగానే.. మనిషి కష్టపడి పనిచేస్తేనే తనకు తాను ఫలితాన్ని పొందగలుగుతాడు. అంతేకానీ కష్టపడకుండా ఇతరుల మీద ఆధారపడి చివరిలో ఫలితం రావాలని అనుకుంటే అది ఆశాజనకంగా ఉండదు.

సద్గుణాలు..

మనిషిలో సద్గుణాలు ఉంటే అతను ధనవంతుడు కావడానికి మార్గాలు పదే పదే కలిసి వస్తూనే ఉంటాయి.  పేదరికంలో ఉన్న వ్యక్తికి ఓర్పు ఉంటే గొప్ప అవకాశాలు చూపిస్తుంది.  మాసిపోయిన బట్టలు మంచి నీటితో ఉతికితేనే అవి తెల్లగా మెరుస్తాయి. అలాగే వ్యక్తి మొదట సద్గుణాలు అలవర్చుకున్నప్పుడు అతను  అతను ఆకర్షిస్తాడు.  అతని వ్యక్తిత్వంలో మంచి, చెడు బయటకు ప్రకాశిస్తాయి.  ధనవంతులు కావడం అంటే చెడు గుణాలు కలిగి ఉండటమా లేదా అనేది కాదని కొందరు అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే.. చెడు దారిలో కలిగే ధనం ఎప్పటికీ మనిషిని ఉన్నతంగా ఉంచదు.

నిజమైన ధనవంతుడు..

పేదరికంలో ఉన్న వ్యక్తి అసలు పేదవాడిగా  పరిగణించకూడదని ఆచార్య చాణక్యుడు చెబుతాడు. ఎందుకంటే నిజమైన పేదవాడు డబ్బు లేని వాడు.. జ్ఞానం,  వ్యక్తిత్వం లేనివాడే నిజమైన పేదవాడు అంటాడు ఆచార్య చాణక్యుడు. జ్ఞానం లేని వ్యక్తికి ఎంత సంపద ఉన్నా అతను వ్యర్థ్యం అంటాడు.

అవకాశాలు..

మనిషి జీవితంలో అవకాశాలు రావడం లేదని వాపోతుంటాడు. కానీ నిజానికి అవకాశాలను సృష్టించుకునే వాడే ఆర్థికంగా ఎదగగలడని అంటారు. ఎడారిలో అయినా ఇసుకను లోతుగా తవ్వితేనే నీటి చెలమ లభించే అవకాశం ఉంటుంది. అలాగే అవకాశాలే లేవు అనుకున్నప్పుడు వాటిని సృష్టించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడే ఫలితం దక్కుతుంది.

అపాత్ర దానం..

దానం చేయడం చాలా గొప్ప గుణం. కానీ దానం చేస్తే పుణ్యం వస్తుందనే కారణంతో చేతిలో ఉన్నది అనవసరమైన వ్యక్తులకు దానం చేయడం పేదరికాన్ని కొనితెచ్చుకున్నట్టే. దానం చేయడం ఎంత మంచి కార్యమో.. అర్హత లేని వారికి దానం చేయడం వల్ల ఎలాంటి పుణ్యం లభించకపోగా, ఆర్థికంగా దిగజారిపోతారు.  

పొదుపు..

చాలామందికి పొదుపు చేయడం అంటే అవసరాలు మాని మరీ దాచిపెట్టడం అనుకుంటారు. కానీ అవసరాలు మానుకుని దాచిపెట్టే డబ్బే పేదరికానికి కారణం అవుతుంది.  

                                *రూపశ్రీ.

By
en-us Political News

  
గుడ్ ఫ్రైడే క్రైస్తవ మతంలో అత్యంత పవిత్రమైన,  భావోద్వేగభరితమైన రోజు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రైస్తవులు యేసు క్రీస్తు శిలువపై మరణించిన సంఘటనను స్మరించుకుంటారు...
పిల్లలను సరిగ్గా పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది. ఒక చిన్న పొరపాటు కూడా పిల్లల జీవితాన్ని నాశనం చేయగలదు. సరైన పెంపకం పిల్లలను విజయ శిఖరాలకు చేరుస్తుంది అనడంలో  ఎలాంటి సందేహం లేదు...
నేటి డిజిటల్ ప్రపంచంలో, పిల్లలకు, ముఖ్యంగా టీనేజర్లకు చదువుకునేటప్పుడు ఏకాగ్రత పెట్టడం చాలా కష్టంగా మారుతోంది. స్మార్ట్‌ఫోన్‌లు, గేమ్‌లు, సోషల్ మీడియా,  మరెన్నో విషయాలు వారి చదువుకు చాలా..
వేసవికాలం అలా రాగానే.. అందరికీ చల్లదనం కావాలని అనిపిస్తుంది.  పడుకోవడానికి గది చల్లగా ఉండాలి.. దుకోసం కూలర్లు, ఏసీలు రెఢీ చేసుకుంటారు. అలాగే చల్లగా నీరు తాగాలని అనిపిస్తుంది.  నేటికాలంలో ప్రతి ఇంట్లో ఫ్రిజ్ లు ఉండటం సహజమే అయినా ఫ్రిజ్ లో ఉంచిన నీరు తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతుంటారు...
జైనమత 24వ తీర్థంకరుడు మహావీరుడు ఆధ్యాత్మికత ద్వారా తన జీవితాన్ని మార్చుకున్నాడు. యువరాజు వర్ధమానుడు  తన సాధన,  ఆధ్యాత్మిక మార్గం ద్వారా  మహావీరుడిగా  పరివర్తన చెందాడు.  అయితే ఇలా పరివర్తన చెందడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది..
భార్యాభర్తల బంధం చాలా ప్రత్యేకమైనది. నేటికాలంలో భార్యాభర్తల బంధం పెళుసుగా మారిందని చెప్పవచ్చు.  బార్యాభర్తలు గొడవ పడటం అనేది చాలా కామన్ గా మారింది.  అయితే కొన్నిసార్లు గొడవలు కాస్తా బంధాన్ని విచ్చిన్నం చేసే..
వేసవి వచ్చేసింది.. ఈ మండే ఎండల వల్ల ప్రతిఒక్కరూ చాలా ఇబ్బంది పడతారు, వేసవికాలం చాలా ఆరోగ్యపరంగా చాలా   ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన కాలం...
వేసవి అంటేనే కూలర్లు,  ఏసీలు గుర్తుకు వస్తాయి.  మధ్య తరగతి కుటుంబాలు కూడా వేసవి వేడి భరించలేక  ఏసీ పెట్టించుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. అయితే ఏసీ పెట్టించుకోవడం ఒక ఎత్తైతే.. ఏసీ వినియోగం తర్వాత...
మనిషి జీవితం చాలా విచిత్రంగా ఉంటంది. కొన్ని విషయాలు దాచుకోవాలి అనుకుంటాం, కొన్ని విషయాలు అందరితో చెప్పుకోవాలి అనుకుంటాం,  మరికొన్ని విషయాలు ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు అనే సందిగ్ధంలో పడిపోతుంటాం...
ప్రతి ఒక్కరూ జీవితంలో సంతోషంగా ఉండాలని  కోరుకుంటారు.  సంతోషంగా ఉండటం కోసం చేయాల్సినంత కష్టం చేస్తూనే ఉంటారు.  డబ్బు సంపాదిస్తారు,  నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు, నచ్చిన చోటికి వెళతారు..
వేసవి కాలం ప్రారంభమైంది, ఆరోగ్యం పట్ల శ్రద్ధ కూడా పెరుగుతుంది. చాలామంది నీటి శాతం అధికంగా ఉన్న పండ్లు, కూరగాయలు తినడానికి ఇష్టపడతారు. అలాంటి వాటిలో దోసకాయలు కూడా ముఖ్యమైనవి. దోసకాయను జ్యూస్ గా అయినా తీసుకుంటారు, సలాడ్ లో ఉపయోగిస్తారు, కొంతమంది నేరుగా దోసకాయలు ముక్కలు చేసుకుని తింటారు...
పరాభవం.. తెలుగు జానపద చిత్రాలు,  జానపద నవలలు చదివితే.. అందులో అవమానం జరిగిందనడానికి బదులుగా పరాభవం ఎదురైంది అనే పదం వాడటం చూస్తూనే ఉంటాము.  పరాభవం అంటే అగౌరవం,  అవమానం, కించపరచడం....
హిందువులకు తులసి మొక్క దైవంతో సమానం. తులసి మొక్క పచ్చగా కళకళలాడుతూ ఉంటే ా ఇంట్లో ఎంతో సానుకూల శక్తి,  మరెంతో సంతోషం ఉంటాయని చెబుతారు. అయితే వేసవి కాలం వచ్చేసింది. తులసి మొక్కతో సహా చాలా రకాల మొక్కలు వేసవి ఎండల కారణంగా...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.