ఇరాన్ లో చిక్కుకున్న తమ పైలట్ ను అమెరికా ఎలా కాపాడిందంటే.. ?

Publish Date:Apr 8, 2026

Advertisement

మధ్య ప్రాచ్యంలో అత్యంత తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలు నెలకొని ఉన్నాయి. ఇరాన్ లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ మొదలెట్టిన యుద్ధం నెలన్నరగా సాగుతూనే ఉంది. అగ్రరాజ్యాన్నే కాదు, మొత్తం ప్రపంచం విస్తుపోయేలా ఇరాన్ ఎదురుదాడులు ఉన్నాయి. ఈ యుద్ధంలో అమెరికా భారీగా నష్టపోయింది. అంతేనా ప్రపంచ దేశాలలో పరువు కూడా పోగొట్టుకుంది. ఇది అమెరికా యుద్ధం కాదు, ట్రంప్ వ్యక్తిగత యుద్ధం అన్న స్థాయికి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదలా ఉంటే.. ఇరాన్ తమ భూభాగంలోకి ప్రవేశించిన అమెరికా యుద్ధ విమానాన్ని కూల్చేసిన సమయంలో ఆ విమానంలోని ఇద్దరు పైలట్ల ఇరాన్ భూభాగంలో చిక్కుకుపోయారు. వారిలో ఒకరిని అమెరికా రక్షణ దళాలు వెంటనే కాపాడాయి. కానీ రెండో పైలట్ ఆచూకీ కనిపించలేదు. దీంతో అమెరికా తీవ్ర స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టింది. మరో వైపు ఇరాన్ అప్రమత్తమైంది. ఇరాన్ భూభాగంలో చిక్కుకున్న అమెరికా పైలట్ ను ప్రాణాలతో అప్పగించిన వారికి భారీ నజరానా ప్రకటించింది. 

ఈ నేపథ్యంలోనే అమెరికా రక్షణ దళాలు క్లిష్టమైన, సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్‌ను చేపట్టి విజయవంతంగా పూర్తి చేశాయి. ఇరాన్ భూభాగంలో చిక్కుకుపోయిన తమ యుద్ధ విమాన పైలట్‌ను ఇరాన్ కళ్లుగప్పి సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చాయి. పూర్తి స్థాయి యాక్షన్ సినిమాను తలపించేలా సాగిన ఈ ఆపరేషన్‌లో పదుల సంఖ్యలో యుద్ధ విమానాలు, వందలాది మంది ప్రత్యేక బలగాలు పాల్గొన్నాయి.

అమెరికాకు చెందిన ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానం  కూలిపోవడంతో, అందులోని పైలట్  పారాచూట్ సహాయంతో ఇరాన్‌లోని పర్వత ప్రాంతంలో దిగాడు. ఆ ప్రాంతం శత్రు బలగాల నిఘా నీడలో ఉండటంతో, ఆ పైలట్ ప్రాణాల ప్రమాదంలో పడ్డాయి. అంతకంటే ముఖ్యంగా ఆ పైలట్ ఇరాన్ కు ప్రాణాలతో పట్టుబడితే.. కీలక రహస్యాలను ఆ దేశం రాబడుతుందన్న ఆందోళన, భయం అమెరికాలో ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఆ పైలట్ ఆచూకీ కోసం అటు అమెరికా, ఇటు ఇరాన్ కూడా  ఇరాన్ కొండలను జల్లెడ పట్టాయి. ఆ పైలట్ ఇరాన్ సైనల కంటపడకుండా ఉండేందుకు ఓ కలుగులో దాగాడు.  ఓ వైపు ఇరాన్ దళాల నిఘా నీడలో ఉన్న ప్రాంతంలో చిక్కుకున్న ఆ పైలట్ ఆచూకీ కనుగొనడం అన్నది అమెరికాకు సవాల్ గా మారింది.

 తన వద్ద ఉన్న అధునాతన సాంకేతికతతో  ఇరాన్ కొండల్లోని ఓ కలుగులో దాగి ఉన్న పైలట్ జాడను కనుగొంది. ఇక ఇప్పుడు ఆ పైలట్ ను సురక్షితంగా అమెరికాకు తీసుకురావడం అన్న ఆపరేషన్  చేపట్టింది.  అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో సాగిన ఈ ఆపరేషన్  ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థ పరిధిలో ఉన్న ప్రాంతంలో జరిపి మరీ అమెరికా సక్సెస్ అయ్యింది. అమెరికా హెలికాప్టర్లు,  విమానాలు ఇరాన్ క్షిపణి దాడుల ముప్పును ఎదుర్కొంటూనే..  ఎఫ్-22 రాప్టర్స్ వంటి అధునాతన విమానాల రక్షణ కవచం మధ్య ప్రత్యేక దళాలు వ్యూహాత్మకంగా పైలట్ ఉన్న ప్రాంతానికి చేరుకుని అతడిని రక్షించాయి.  ఇరాన్ భూభాగం నుంచి తమ పైలట్ సురక్షితంగా వెనక్కు తీసుకురావడంతో   ఆ దేశ రక్షణ వ్యవస్థ యొక్క నైపుణ్యం మరోసారి ప్రపంచానికి తెలిసింది. 

By
en-us Political News

  
అన్‌క్యాప్డ్ ప్లేయర్లు, అండర్-19 ప్రతిభావంతులు మెగా లీగ్‌లో అనుభవజ్ఞులను అధిగమిస్తూ, కీలకమైన మ్యాచుల్లో విజయావకాశాలను మారుస్తూ రికీ పాంటింగ్ వంటి కోచ్‌ల ప్రశంసలు పొందుతున్నారు. తాజాగా ఐపీఎల్ ప్లాట్‌ఫారమ్‌పై లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ కుర్రాడు ముకుల్ చౌదరి అందరి దృష్టి ఆకర్షిస్తున్నాడు.
మహిళా భద్రతకు మరింత బలం చేకూర్చేలా షీ నేత్ర పేరిట ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. నగర కమిషనరేట్ పరిధిలోని ఏడు జోన్లకు ఒక్కో బృందం చొప్పున మొత్తం ఏడు ప్రత్యేక టీమ్స్‌ను రంగంలోకి దించారు.
మదీనా కాలనీలో ఉన్న సలామి కోల్డ్ స్టోరేజ్‌ లో కుళ్ళిన మాంసాన్ని విక్రయిస్తున్నట్లుగా అందిన విశ్వసనీయ సమాచారం మేరకు బాలాపూర్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కనీస పారిశుద్ధ్యం లేకుండా, మాంస వ్యర్థాలను నిల్వ ఉంచినట్లుగా అధికారులు గుర్తించారు.
గతంలో బడ్జెట్ లీక్ అయితే 30 మంది మంత్రులు రాజీనామా చేశారని, ఎన్టీఆర్ ఎవరూ లేకుండా 15 రోజులు ప్రభుత్వాన్ని నడిపారని చంద్రబాబు గుర్తు చేశారు. అలాగే. పేపర్ లీక్ కేసులో గతంలో ఓ మంత్రి రాజీనామా చేసిన విషయాన్నీ ప్రస్తావించారు.
పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నడుమ ప్రపంచ వ్యవస్థ గణనీయమైన పరివర్తనకు లోనవుతున్న తరుణంలో, భారతదేశం ఆర్థిక వృద్ధికి కీలక చోదకంగా తనను తాను నిలబెట్టుకుంటోంది.
లొంగిపోయిన వారిలో ప్రధానంగా పీఎల్జీఏ బెటాలియన్ ఇన్-చార్జ్ కమాండర్ సోది కేశాలు, , తెలంగాణ స్టేట్ కమిటీ మిలిటరీ చీఫ్ చప నారాయణ అలియాస్ మధు, డివిజనల్ కమిటీ సభ్యుడు కడ్తి సన్ను అలియాస్ మంతు వంటి అగ్రశ్రేణి నాయకులు ఉన్నారు. వీరితో పాటు మొత్తం 42 మంది క్యాడర్ బయటకు రావడంతో తెలంగాణలో మావోయిస్టు సంస్థాగత నిర్మాణం దాదాపుగా కుప్పకూలిందని పోలీసు వర్గాలు ప్రకటించాయి.
ప్రపంచ అణు విధానాలు, సాంకేతిక పురోగతులు, మరియు భౌగోళిక రాజకీయ ప్రమాదాలను అంచనా వేయడానికి, యురేనియం సుసంపన్నం మరియు ప్లూటోనియం ఉత్పత్తి మధ్య ఉన్న వ్యత్యాసాలను అర్థం చేసుకోవడం అత్యవసరం.
ఒక ప్రైవేట్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న ఓ బాలుడు, బాలికల మధ్య పరిచయం ఇన్‌స్టాగ్రామ్‌ చాటింగ్ వరకూ వెళ్లింది. ఇదే అవకాశంగా తీసుకున్న ఆ బాలుడు బాలికను ఇన్ స్టాగ్రామ్ లో వేధించడం మొదలు పెట్టాడు. ఆ వేధింపులు భరించలేక ఆ బాలిక పలు మార్లు ఆ బాలుడిని మందలించింది.
గుంటూరు స్వర్ణ భారతి నగర్ కు చెందిన 20 ఏళ్ల రసిక మణికంఠ రాజు, అంకమ్మనగర్ కి చెందిన యువతి గత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి ప్రేమను కుటుంబ సభ్యులు అంగీకరించక పోవడంతో పాటు ఆ యువతికి ఇటీవల వేరే వ్యక్తితో వివాహం జరిగింది. వివాహం అనంతరం మనస్తాపానికి గురైన యువతి తన భర్తతో ఉండలేనంటూ గుంటూరుకు వచ్చింది.
ఖాజీపేట అగ్రహారానికి చెందిన కీర్తన అనే విద్యార్థినితో తనకు ఉన్న పరిచయాన్ని అడ్డుపెట్టుకుని ప్రేమించానంటూ ఆమెను వేధించసాగాడు. అయితే ఆమె నిరాకరిచడంతో వెంకటేష్ ఉన్నాదిగా మారిపోయాడు. శనివారం కీర్తనపై కత్తితో దాడి చేశాడు.
మోనాలిసా, ఫర్మాన్ ఖాన్ ల పెళ్లి గత నెల 11న కేరళ అరుణ్మనూర్‌లోని శ్రీ నారాయణ గురు ఆలయంలో జరిగిన సంగతి తెలిసిందే. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేైసుకున్నారు. పెద్దలకు ఇష్టం లేకుండా వీరిద్దరూ వివాహం ద్వారా ఒక్కటయ్యారు. అయితే మోనాలిసా వయస్సుపై మొదటి నుంచీ అనుమానాలు వ్యక్తమయ్యాయి.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలంగాణ ప్రభుత్వానికి డీజీపీ పదవికి ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను సూచించింది. వీరిలో వినాయక్ ప్రభాకర్ ఆట్టే, సౌమ్య మిశ్రా తో పాటు సీవీ ఆనంద్ పేరు కూడా ఉంది.
జనగాం జిల్లాకు చెందిన మనోహర్ కుటుంబం 13 ఏళ్ల క్రితం జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్ నగరానికి వచ్చి పోచారం పరిధిలో నివాసం ఉంటున్నారు. మనోహర్ మరదలు రమణి హైదరా బాద్ నగరంలోని పోచారం ఐటి కారిడార్ అన్నోజిగూడ రాజీవ్ గృహకల్ప లో నివాసం ఉంటున్నారు. వీరిద్దరికీ కొద్ది కాలం కిందటే వివాహం నిశ్చయమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.