హౌస్ అరెస్ట్ ప్లీజ్.. బతిమాలుకుంటున్న వైసిపి నేతలు!

Publish Date:Mar 20, 2025

Advertisement

వైసీపీ నాయకుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఒకవైపు పార్టీ నుంచి ఒత్తిడులు, ఉద్యమాలు ఆందోళనలు చేయాలని పిలుపులు, పురమాయింపులు జారీ అవుతున్నాయి! మరొకవైపు ఏదైనా ఆందోళన చేద్దాం  అనుకుంటే ప్రజల నుంచి స్పందన కరువు! ఏం చేయాలనుకున్నా కూడా నలుగురు జనాన్ని పోగేయాలంటే వేలు, లక్షలలో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో పార్టీ ఏకపక్షంగా  మీరు ఉద్యమాలు చేయండి, పోరాడండి అని ఆదేశాలు మాత్రం జారీ చేస్తూ ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? అందుకే  వైసీపీ నాయకులు పోలీసులలో తమకు పరిచయం ఉన్న వారికి ఫోన్ చేసి పార్టీ పిలుపు ఇచ్చిన రోజులలో తమన హౌస్ అరెస్ట్ చేయాల్సిందిగా వేడుకుంటున్నారు! హౌస్ అరెస్టు అయిపోతే ఇక వేరే ఇబ్బందులు ఉండవని, బయటకు వెళ్లే పనిలేదని అనవసరపు ఖర్చు తప్పించుకోవచ్చు అని వారు భావిస్తున్నారు.
వైసీపీ ఓడిపోయిన నాటి నుంచి రకరకాల ఆందోళనలకు పిలుపు ఇస్తూ వస్తోంది. జగన్మోహన్ రెడ్డి మాత్రం ట్విటర్ నుంచి కదలకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులంతా  రోడ్లెక్కి పోరాటాలు  చేయాలని పిలుపు ఇస్తూ వస్తున్నారు. ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు పెట్టి, ఆస్తులు అమ్ముకున్న నాయకులు.. పార్టీ చెప్పే పోరాటాల పేరిట ప్రతిసారీ డబ్బుల ఖర్చుకు వెనుకాడుతున్నారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి తర్వాత.. జిల్లాల్లో చేస్తానన్నా తరువాత ఆ పర్యటనల గురించి పట్టించుకోకవపోవడానికి ఇది కూడా ఒక కారణం అని, ఖర్చు పెట్టడానికి స్థానిక నేతలెవ్వరూ సిద్ధంగా లేరని ఒక ప్రచారం ఉంది.  కాగా.. తాజాగా విశాఖపట్టణంలోని క్రికెట్ స్టేడియంకు వైఎస్సార్ పేరు తొలగించినందుకు వైసీపీ ఆందోళనలకు పిలుపు ఇచ్చింది. ఎప్పుడో ఏర్పాటు అయిన స్టేడియంకు ఉన్న పేరుకు ముందు జగన్ హయాంలో  వైఎసఆర్ పేరును ముందు జోడించారు. ఆ స్టేడియం విషయంలో ఆయన పాత్ర, ప్రమేయం ఏమీ లేనందున కూటమి ప్రభుత్వం ఆ పేరును తొలగించింది.  వైఎస్సార్ పేరు చూస్తే కూటమి ప్రభుత్వం భయపడుతున్నదంటూ వైసీపీ నేతలు కొందరు నానా యాగీ చేశారు. ఈలోగా విశాఖలో స్టేడియం వద్ద ధర్నా చేయాలని పిలుపు ఇచ్చారు. 
అసలే విశాఖ.. ఎగ్జిక్యూటివ్ రాజధాని చేస్తానని జగన్ ఎన్ని కబుర్లు చెప్పినా ఒక్క సీటులో కూడా పార్టీని గెలిపించని నగరం అది. అలాంటిచోట పార్టీ పిలుపు ఇచ్చే ఆందోళనకు జనాన్ని పోగేయడం అంటే.. నాయకులకు తలకు మించిన భారమే. ఆర్థికంగా చిలుము వదిలిపోతుందని వారి భయం. అందుకే.. పోలీసులను ఆశ్రయించి లోపాయికారీగా తమను హౌస్ అరెస్టులు చేయాల్సిందిగా బతిమాలు కున్నట్టుగా తెలుస్తోంది. 

పోలీసుల్ని బతిమాలి హౌస్ అరెస్టులు చేయించుకోవడం వైసీపీ నేతలకు ఇవాళ కొత్త కాదు. గతంలోనూ తిరుపతిలో నివాసం ఉండే ఓ వైసీపీ ఎంపీ.. తమ సొంత నియోజకవర్గంలో ఘర్షణల నేపథ్యంలో పర్యటనకు వస్తానని ప్రకటించి, వెళ్లే ధైర్యం లేక, తానుగా పోలీసులకు ఫోనుచేసి హస్ అరెస్టు చేయాల్సిందిగా వేడుకుని.. ఇల్లు కదలకుండా కూర్చున్నట్టుగా అక్కడ గుసగుసలు ఉన్నాయి.
 

By
en-us Political News

  
 వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డిలను కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో తండ్రి కొడుకులు ఎపి హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడంతో వీరికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.  
తెలంగాణలో పరువుహత్య వెలుగులోకి వచ్చింది. తన కుమార్తెను ప్రేమిస్తున్నాడన్న కోపంతో పెద్దపల్లి జిల్లాలో 17 ఏళ్ల యువకుడిని ఆ అమ్మాయి తండ్రి దారుణంగా హత్య చేశాడు. వివరాలిలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం (మార్చి 28) చెన్నైకు బయలు దరి వెళ్లారు. అక్కడ జరిగే అఖిల భారత రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిల్ లో ఆయన ప్రసంగిస్తారు.
ఏం కష్టమొచ్చిందో? ఎంతగా నలిగిపోయిందో.. ఆ తల్లి కడుపున పుట్టిన ముగ్గురు పిల్లలకు విషమిచ్చి, తానూ తీసుకుంది. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో చోటు చేసుకుంది.
పదిహేను నెలల నిరీక్షణ అనంతరం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం దక్కబోతోందన్న టాక్ వినిపిస్తోంది. శాసనసభలో, లాబీల్లోనూ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిని పలు వురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి అభినందనలు తెలుపుతున్నారు. శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన హామీతో రాజగోపాల్‌రెడ్డి తిరిగి సొంత పార్టీకి చేరుకున్నారు.
తెలంగాణను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరో మారు ఆరోపించారు. అంతే కాదు, కొట్లాడకపోతే కేంద్రం నిధులివ్వదు.. పోరాడాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హిత బోధ కూడా చేశారు. అలాగే మరో అడుగు ముందుకేసి కేంద్రంపై పోరాడేందుకు రేవంత్ ప్రభుత్వానికి మద్దతిస్తామని కేటీఆర్ సభా ముఖంగా ప్రకటించారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం సమీపిస్తుండటంతో శ్రీవారి దర్శనం కోసం భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు.
జైల్లో గడపవలసి రావడమే ఇబ్బందికరమైన పరిస్థితి. అలాంటిది సింగిల్ బ్యారక్ లో ఒంటరి గా ఉండాలంటే చాలా కష్టం. సాధారణంగా జైలు శిక్ష అనుభవిస్తూ అక్కడ కూడా కొత్త తప్పులు చేసిన వారిని, తీవ్రమైన నేరాలు చేసినవారిని ఇటువంటి సాలిటరీ సెల్ లలో ఉంచుతారు.
 వైసీపీ నేత,  గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి  సిఐడి  కోర్టులో  చుక్కెదురైంది.   కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ  బెయిల్ పిటిషన్ ను  దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
తెలంగాణాలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల గురించి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పింది, ముమ్మాటికీ నిజం. శాసన సభ వేదికగా ఆయన చేసిన ప్రసంగం మాటల్లోంచి, ఒక్క అక్షరాన్ని కూడా తప్పు పట్ట లేము. తీసి వేయలేము. సరే..కోర్టు విచారణలో ఉన్న పార్టీ ఫిరాయింపుల అంశాన్ని సభలో ప్రస్తావించ వచ్చునా? లేదా? అలా ప్రస్తావించడం కోర్టు ధిక్కరణ అవుతుందా? కాదా? అన్నది, వేరే విషయం.
అనుమానా స్పదస్థితిలో మృతి చెందిన పాస్టర్ పగడాల ప్రవీణ్  అంత్యక్రియలు ఘనంగా జరిగాయి. పాస్టర్  భౌతిక  కాయాన్ని సికింద్రాబాద్  సెంటినరీ బాపిస్ట్ చర్చిలో  గురువారం సాయంత్రం( మార్చి 27) వరకు ప్రజల సందర్శనార్థం ఉంచారు.
అస్వస్థతతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిని వైసీపీ అధినేత జగన్ ఫోన్ లో పరామర్శించారు. తీవ్ర అస్వస్థతకు గురైన కొడాలి నానికి బుధవారం (మార్చి 26) ఉదయం హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే.
వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిలు పిటిషన్ పై విచారణను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంగళవారం ( ఏప్రిల్ 1) నాటికి వాయిదా వేసింది. అక్రమంగా క్వార్ట్జ్‌ ఖనిజం కొల్లగొట్టిన కేసులో కాకాణి గోవర్దన్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.