Publish Date:Mar 31, 2025
గుడివాడ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నానిని ఏఐజీ ఆస్పత్రి నుంచి ఇలా డిశ్చార్జ్ కాగానే అలా ఎయిర్ అంబులెన్స్ లో ముంబైలోని ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ కు తరలించారు. ఈ నెల 26న కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయనను హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్చిన సంగతి తెలిసిందే.
Publish Date:Mar 31, 2025
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగింపు దశకు చేరుకున్నాయి. మరో నాలుగు రోజుల్లో అంటే ఏప్రిల్ 4 తో ఈ సమావేశాలు ముగుస్తాయి. అయితే,ఇంతవరకు జరిగిన కథ ఒకెత్తు అయితే ఈ చివరి నాలుగు రోజుల కథ మరొక ఎత్తు అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అవును ఇటు అధికార ఎన్డీఎ కూటమి, అటు విపక్ష ఇండియా కూటమి నాయకులు వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో పట్టు బిగిస్తున్నారు.
Publish Date:Mar 31, 2025
మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానిని మెరుగైన వైద్య చికిత్స కోసం ముంబైకి తరలించాలని ఆయన కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఈనెల 26న తీవ్ర అస్వస్థతతో హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరిన కొడాలి నాని సోమవారం (మార్చి 31)న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
Publish Date:Mar 31, 2025
పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ చార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ పరిచయం అక్కర్లేని పేరు. గత ఏడాది జరిగిన ఎన్నికలలో జనసేనాని పవన్ కల్యాణ్ కోసం తాను పిఠాపురం సీటు త్యాగం చేసి మరీ జనసేనాని విజయం కోసం పని చేసిన వర్మ.. పవన్ కల్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధించడంలో కీలక భూమిక పోషించారు. అప్పటి నుంచీ ఆయనను అంతా పిఠాపురం వర్మ అనడం మొదలైంది.
Publish Date:Mar 31, 2025
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పరారీలో ఉన్నారా? అక్రమ మైనింగ్ కేసులో నోటీసులు అందజేయడానికి ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులకు ఆయన ఇల్లు తాళం వేసి ఉండటం కనిపించింది. దీంతో ఆయనకు పోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. పోనీ ఆయన పీఏకైనా సమాచారం ఇద్దామని భావించిన పోలీసులకు పీఏ ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ అని రావడంతో చేసేదేం లేక కాకాణి నివాసానికి నోటీసులు అందించి వెనుదిరిగారు.
Publish Date:Mar 30, 2025
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
వరుస సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ పోటెత్తున్నది. గత వారం అంతా భక్తుల రద్దీ కొనసాగింది.
Publish Date:Mar 30, 2025
చత్తీస్ గడ్ లో మావోయిస్టులకు కోలుకోని దెబ్బ తగిలింది. ఏకంగా 50 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ విషయాన్ని బీజాపూర్ ఎస్ పి జితేంద్రకుమార్ యాదవ్ మీడియాకు చెప్పారు
Publish Date:Mar 30, 2025
ఎపిలో ఉగాది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయనగరం ఎంపి కలిశెట్టి అప్పల నాయుడు తన వ్యవసాయ క్షేత్రంలో ఏరువాక సేద్యం చేశారు. శ్రీకాకుళం జిల్లారణ స్థల మండలంలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్న ఎంపీ ఎద్దులు, నాగలికి పూజ చేసి భూమిని దున్నారు
Publish Date:Mar 30, 2025
మనదేశం సెక్యులర్ దేశం. హిందువులు ముస్లింలు కల్సి మెల్సి చేసుకునే పండగలు అనేకం. షియాముస్లింలు చేసుకునే పీర్ల పండుగకు హైద్రాబాద్ పాత బస్తీలో ముస్లింలకంటే హిందువులు ఎక్కువ సంఖ్యలో పార్టిసిపేట్ అవుతుంటారు. ఈ సంవత్సరం ఉగాది మరుసటి రోజే రంజాన్ రావడం విశేషం . కడప జిల్లాలో ఉగాది రోజు జరిగే క్రతువుకు హిందువుల కంటే ముస్లింలు ఎక్కువ. కడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతీ ఏడాది ముస్లింలు పూజలు చేస్తారు. తెల్లారితే రంజాన్ ఉన్నప్పటికీ పూజలు చేసే ముస్లింల సంఖ్య ఏం తగ్గలేదు. భారీగా ముస్లింలు రావడంతో ఆలయం కిక్కిరిసిపోయింది.
Publish Date:Mar 30, 2025
పండుగ పూట శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో విషాదం చోటు చేసుకుంది.
ఆర్థిక బాధలు తాళలేక ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సామూహిక ఆత్మహత్య చేసుకున్నారు. బంగారం దుకాణం యజమాని కృష్ణ చారి భార్య సరళ, కుమారులు సంతోష్, భువనేశ్ లు ఆదివారం ఇంట్లో విగత జీవులుగా పడి ఉన్నారు స్థానికులు మొదటి గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
Publish Date:Mar 30, 2025
ఉగాది పర్వ దినం పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమౌతుంది. పండుగ పూట చేసిన తొలిసంతకం వల్ల 3,456 మంది కుటుంబాల్లో ఆనందం నింపింది. అనారోగ్యంతో ఆస్పత్రిపాలైన ఈ కుటుంబాలకు లబ్ది చేకూరే విధంగా రూ 38 కోట్లను విడుదల చేస్తూ ముఖ్యమంత్రి సంతకం చేశారు.
Publish Date:Mar 30, 2025
ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ దశ దిశ లేకుండా పోయిందని, రాష్ట్రం కళ తప్పిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఉగాది పర్వ దినాన్ని పురస్కరించుకని విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రంలో కూటమి ప్రభుత్వం ఘనంగా వేడుకలు నిర్వహించింది. ఈ వే డుకల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. కూటమి అధికారంలో రాగానే ప్రజా సమస్యలపైనే దృష్టి కేంద్రీకరించామన్నారు.
Publish Date:Mar 29, 2025
విశ్వావసు నామ ఉగాది పర్వదినాన్నిపురస్కరించుకుని తిరుమల క్షేత్రంలో విశేష పూజలు, కార్యక్రమాలను నిర్వహించడానికి టీటీడీ సమాయత్తమైంది. ఉగాది ఆస్థానం, ఉగాది కవి సమ్మేళనం, నాద నీరాజనం, కవుల ఇష్టాగోష్టి వంటి కార్యక్రమాలు నిర్వహించనుంది.