కాళేశ్వరం కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు ఎప్పుడంటే?

Publish Date:Apr 7, 2026

Advertisement

కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు బుధవారం (ఏప్రిల్ 8) తీర్పు వెలువరించనుంది.  మాజీ ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మాజీ మంత్రి  హరీష్ రావు, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్  తదితరులు ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ  హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి విదితమే. అసలు కమిషన్ ఏర్పాటే చట్టబద్ధం కాదని, నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం సరైంది కాదని వారు తమ పిటిషన్లలో పేర్కొన్నారు. 

 ఈ కేసులో హైకోర్టు పిటిషనర్లకు హైకోర్టు మధ్యంతర రక్షణ కల్పించింది. కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తీసుకునే చర్యలను తాత్కాలికంగా నిలిపివేసింది. దీంతో కాళేశ్వరం వ్యవహారం న్యాయపరంగా నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. అయితే కోర్టు  తీర్పుతో ఈ వ్యవహారంలో  స్పష్టత రానుంది. కమిషన్ చట్టబద్ధతపై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది. కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలపై హైకోర్టు తీర్పుతో క్లారిటీ వచ్చే   ఉంది. నివేదికను చెల్లుబాటు చేస్తే ప్రభుత్వం తదుపరి చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది.  .మొత్తానికి   హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ నెలకొని ఉంది. 

By
en-us Political News

  
జగిత్యాల ముఖ్య నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు.
భాగ్యనగర వాసుల జీవనాడి, అత్యంత వేగవంతమైన ప్రయాణానికి వేదికైన నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డుపై మరోసారి నిబంధనలు తుంగలో తొక్కారు.
హైదరాబాద్‌లో నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న ముఠాపై చాదర్‌ఘాట్ పోలీసులు కొరడా ఝళిపించారు.
లోక్ సభ నియోజకవర్గాల పెంపు, మహిళా రిజర్వేషన్ బిల్లులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.
నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ప్రకారం, లోక్ సభ సీట్లు 543 నుంచి 850కు పెరిగే అవకాశం ఉంది
మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 88వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నకిలీ సీఐఎస్ఎఫ్ అధికారి హల్‌చల్.. 67 మంది యువతులకు వలపు వల
తెలంగాణ రాష్ట్రంలో వేసవి తీవ్రత పతాక స్థాయికి చేరుతోంది.
దేశంలో తొలి క్వాంటం ఫెసిలిటీ సెంటర్ ను సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిలో ఆవిష్కరించారు.
సిద్దిపేట అర్బన్ మండలం తడ్కపల్లి గ్రామంలో డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ఆవిష్కరించారు.
ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చి వ్యాఖ్యల ప్రకారం.. ఇరుపక్షాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరేందుకు సానుకూల వాతావరణం ఉంది. కానీ మారుతున్న లక్ష్యాలు, బాహ్య జోక్యం వల్ల శాంతి చర్చల్లో పురోగగతి నిలిచిపోయి ప్రతిష్ఠంభన ఏర్పడింది. ఇక ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కూడా అమెరికా తన విధానాన్ని మార్చి, ఇరాన్ హక్కులను గౌరవిస్తే ఒప్పందం సాధ్యమేనని స్పష్టం చేశారు.
తనదైన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచశ్రేణి బౌలర్లకు యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ చెమటలు పట్టిస్తున్నాడు.
మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వంట గ్యాస్ కొరత తీవ్రంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.