డ్రగ్స్ కేసు.. పరారీలో హీరోయిన్ సోదరుడు
Publish Date:Dec 26, 2025
Advertisement
డ్రగ్స్ కేసులో తెలంగాణ యాంటీ నారోటిక్స్ బ్యూరోకు చెందిన ఈగల్ దర్యాప్తు ముమ్మరం చేసింది. డ్రగ్స్ క్రయవిక్రయాలు చేసే వారిపై కొరడా ఝళిపిస్తున్నది.ఈ క్రమంలోనే ప్రముఖ నటి రకుల్ ప్రీతిసింగ్ సోదరుడు అమర్ ప్రీతి సింగ్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఈగల్ బృందం, మాసబ్ ట్యాంక్ పోలీసులతో కలిసి నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో ట్రూప్ బజార్‌కు చెందిన నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్వి అనే ఇద్దరు వ్యాపారులను అరెస్టు చేసింది. వీరి వద్ద నుంచి 43 గ్రాముల కొకైన్, 11.5 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను పోలీ సులు స్వాధీనం చేసుకు న్నారు. ఇలా ఉండగా రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమర్ ప్రీతి సింగ్ గత ఏడాది కూడా డ్రగ్స్ వ్యవహారంలో సైబరాబాద్ పోలీసులకు దొరికాడు, ఆ సందర్భంగా నిర్వహించిన పరీక్షల్లో అతడు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఇద్దరు డ్రగ్స్ వ్యాపారుల అరెస్టుతో అతడి పేరు బయటకు వచ్చింది. వ్యాపారుల అరెస్టు విషయం తెలియగానే అమర్ ప్రీతి సింగ్ పారారయ్యాడని తెలుస్తోంది. ఈగల్ బృందం అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
పట్టుబడ్డ ఇద్దరు వ్యాపారులు విచారణలో తమ నుంచి తరచుగా డ్రగ్స్ కొనుగోలు చేసే నలుగురి పేర్లు వెల్లడించారు. ఆ నలుగురిలో ఒకరు ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడని తేలింది. అతడికి డ్రగ్స్ డెలివరీ ఇచ్చే సమయంలోనే ఈగల్ ఆపరేషన్ లో ఈ వ్యాపారులు అరెస్టయ్యారని తెలిసింది.
http://www.teluguone.com/news/content/heroine-brother-absconding-36-211613.html





