హీరా గోల్డ్ రూ.159 కోట్ల ఆస్తులు వేలం

Publish Date:Jun 26, 2026

Advertisement

 

దేశవ్యాప్తంగా వేలాది మంది పెట్టుబడిదారులను భారీ రాబడుల పేరుతో ఆకర్షించి మోసానికి పాల్పడిన హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) జప్తు చేసిన రూ.159 కోట్ల విలువైన 23 ఆస్తులను ప్రభుత్వ సంస్థ MSTC ద్వారా ఈ-వేలం నిర్వహించింది. ఈ వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని సుప్రీంకోర్టు పర్యవేక్షణలో బాధిత పెట్టుబడిదారులకు పరిహారంగా పంపిణీ చేయనున్నట్లు ఈడీ వెల్లడించింది. దీంతో ఎన్నో ఏళ్లుగా తమ సొమ్ము కోసం ఎదురుచూస్తున్న బాధితులకు కొంత ఊరట లభించనుంది.

ఈ కేసులో ప్రధాన నిందితురాలు నౌహీరా షేక్ స్థాపించిన హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్.. "ఇస్లామిక్ పెట్టుబడులు", "హలాల్ వ్యాపారాలు" పేరుతో ఏడాదికి 36 శాతానికి పైగా లాభాలు వస్తాయని ప్రచారం చేసింది. ఈ హామీలను నమ్మిన దేశవ్యాప్తంగా వేలాది మంది సంస్థలో పెట్టుబడులు పెట్టారు. దర్యాప్తులో హీరా గ్రూప్ దాదాపు రూ.5,978 కోట్లకు పైగా నిధులు సేకరించినట్లు ఈడీ గుర్తించింది.

అయితే, పెట్టుబడిదారులకు వాగ్దానం చేసిన లాభాలు చెల్లించకపోవడమే కాకుండా, అసలు పెట్టుబడి సొమ్మును కూడా తిరిగి ఇవ్వకుండా మోసానికి పాల్పడినట్లు ఈడీ విచారణలో తేలింది. సేకరించిన నిధుల్లో కొంత భాగాన్ని వ్యక్తిగత అవసరాలు, విలాసవంతమైన ఆస్తుల కొనుగోలు, అనుబంధ సంస్థలకు నిధుల బదిలీ వంటి అక్రమ కార్యకలాపాలకు వినియోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

దీంతో మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద కేసు నమోదు చేసిన ఈడీ.. హీరా గ్రూప్‌కు చెందిన పలు స్థిర, చర ఆస్తులను జప్తు చేసింది. కేసు విచారణలో నౌహీరా షేక్ సహకరించడం లేదని ఈడీ సుప్రీంకోర్టుకు నివేదించగా, ఆమెకు మంజూరైన బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. అనంతరం మే 21న గురుగ్రామ్‌లో ఆమెను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.

తాజాగా ఆస్తుల వేలం పూర్తవడంతో బాధిత పెట్టుబడిదారులకు న్యాయం చేసే ప్రక్రియలో కీలక ముందడుగు పడినట్లు అధికారులు చెబుతున్నారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో వేలం ద్వారా వచ్చిన నిధులను అర్హులైన బాధితులకు దశలవారీగా పంపిణీ చేయనున్నట్లు ఈడీ స్పష్టం చేసింది. దీంతో చాలా కాలంగా తమ సొమ్ము కోసం పోరాడుతున్న వేలాది మంది బాధితుల్లో మరోసారి ఆశలు చిగురించాయి.
 

By
en-us Political News

  
అంతర్జాతీయ MSME దినోత్సవం 2026 సందర్భంగా చిన్న వ్యాపారులకు ఇన్‌స్టంట్ లోన్లు, సబ్సిడీలు మరియు రూ. 5 కోట్ల వరకు తాకట్టు లేని రుణాల వివరాలు.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో రానున్న ఏడు రోజుల పాటు భారీ వర్షాలు
తెలంగాణలోని నల్గొండ జిల్లా కేంద్రంలో ఇటీవల సంచలనం సృష్టించిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి కేసు మిస్టరీ
ప్రముఖ కమెడియన్ లారీ డేవిడ్ సరికొత్త అమెరికన్ హిస్టరీ కామెడీ షో లైఫ్, లారీ అండ్ ది పర్స్యూట్ ఆఫ్ అన్‌హ్యాపినెస్ విశేషాలు మరియు దీనిని ఆన్‌లైన్‌లో ఎలా చూడాలో ఇక్కడ తెలుసుకోండి.
జూలై 4 నుంచి ప్రారంభం కానున్న అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2026లో ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్ కార్డులపై 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ మరియు ఐసీఐసీఐ కార్డుపై 5% క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్ టిప్స్ ద్వారా మీ షాపింగ్ బడ్జెట్‌ను ఎలా ఆదా చేసుకోవాలో ఇప్పుడే తెలుసుకోండి!
నిర్మాత కేవీఎన్ నియామకంపై తమిళనాట రాజకీయ దుమారం..
హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకోనుందా? SBI Caps నివేదిక, రెండో దశ విస్తరణ పనులు, టికెట్ ధరలపై ప్రభావం తదితర పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
రిలయన్స్ జియో యూజర్ల కోసం సరికొత్త క్యాష్‌బ్యాక్ ఆఫర్లు! జూన్ 30, 2026 లోపు మైజియో యాప్‌లో పేటీఎం, అమెజాన్ పే, మోబిక్విక్ ద్వారా రీఛార్జ్ చేసి ₹100 వరకు క్యాష్‌బ్యాక్ ఎలా పొందాలో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
జూన్ 26 నుంచి 28 వరకు ఈపీఎఫ్ఓ (EPFO) ఆన్‌లైన్ పోర్టల్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. వెబ్‌సైట్ డౌన్ అయిన సమయంలో మిస్డ్ కాల్, ఎస్ఎంఎస్ ద్వారా మీ పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడే తెలుసుకోండి.
స్టాక్ మార్కెట్ సెలవు రోజున మీ బ్యాంక్ ఖాతా నుండి ఎస్‌ఐపీ (SIP) డబ్బులు కట్ అయ్యాయా? ఆందోళన చెందకండి. మ్యూచువల్ ఫండ్స్ నిబంధనల ప్రకారం మీకు ఎన్ఏవీ (NAV) మరియు యూనిట్ల కేటాయింపు ఎప్పుడు జరుగుతుందో ఇక్కడ పూర్తి వివరంగా తెలుసుకోండి.
జూలై 1, 2026 నుండి జపాన్ ప్రభుత్వం గ్లోబల్ వీసా ఫీజులను పెంచుతోంది. ఈ కొత్త నిబంధనల వల్ల భారతీయ పర్యాటకులకు వీసా ధరలు మారతాయా? VFS సర్వీస్ ఛార్జీల వివరాలు మరియు జూన్ 30 లోపు అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను ఈ వెబ్ స్టోరీలో పూర్తిగా తెలుసుకోండి.
ఫిఫా వరల్డ్ కప్ 2026లో మాజీ ఛాంపియన్ జర్మనీకి ఈక్వెడార్ షాక్ ఇచ్చింది. 2-1 తేడాతో విజయం సాధించి 2006 తర్వాత తొలిసారి నాకౌట్ చేరిన ఈక్వెడార్ సంచలన మ్యాచ్ వివరాలు ఇవే!
టీజీ 20 లీగ్‌లో నల్గొండ నైట్స్ జట్టు 259 పరుగుల భారీ స్కోరుతో వరంగల్ వారియర్స్ జట్టుపై 91 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. నితీశ్ రెడ్డి (81), గౌరవ్ రెడ్డి (80) రన్స్‌తో అద్భుత ప్రదర్శన చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.