ఆరోగ్యకరమైన హోళికి ఆరోగ్య చిట్కాలు!

Publish Date:Mar 3, 2026

Advertisement

హోళి అంటే ఇష్టం లేనిది ఎవరికి?? చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు హోళి సందడిలో తమవంతు పాత్ర పోషిస్తారు. అయితే హోళి సంబరాలలో అక్కడక్కడా అపశ్రుతులు చోటుచేసుకుంటు ఉంటాయి. హోళిని హాయిగా ఎంజాయ్ చేస్తూ.. ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు అవసరం.

మీ చర్మ సంరక్షణ తప్పనిసరి: 

చర్మాన్ని వీలైనంత జిడ్డుగా చేయడం చాలా ముఖ్యం, తద్వారా రంగులు చర్మం మీద  వ్యాప్తి చెందడానికి లేదా అంటుకునే అవకాశం ఉండదు. ఇందుకోసం కొబ్బరి నూనె రాసుకోవచ్చు. కొబ్బరి నూనె వల్ల మరొక లాభం ఏంటంటే చర్మం పొడిబారకుండా చేస్తుంది. అలాగే శరీరం మీద రంగులు క్లీన్ చేయడం సులువు అవుతుంది. 

 సేంద్రీయ రంగుల ఎంపిక:  

పర్యావరణ అనుకూలంగానే కాకుండా మన చర్మానికి కూడా అనుకూలమైన రంగులతో హోలీని జరుపుకోవాలి. హానికరమైన రసాయనాలు కలిపిన రంగులను నివారించాలి. రసాయనాలు కలిపిన రంగులు ప్రకాశవంతంగా కనిపిస్తాయి అంతేకాఫు ఇవి నీటిలో చాలా తొందరగా కలిసిపోతాయి. ఈ రంగులు  చర్మం నుండి తొలగించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. చర్మాన్ని డ్యామేజ్ చేస్తాయి. ఇన్ఫెక్షన్లు, సైడ్ ఎఫెక్ట్ చూపిస్తాయి. బంతి పువ్వు, గులాబీ, మందారం, చెట్ల ఆకులు, పసుపు ఇలా పువ్వుల రెక్కల నుండి రంగులు తయారుచేసుకోవచ్చు. . 

హైడ్రేటెడ్ గా ఉండాలి: 

హోలీ వేసవిలో వస్తుంది, హోళి సమయానికి వేసవి మొదలైపోయి ఉంటుంది. దీనివల్ల బయట ఎండలు భగ్గుమంటుంటాయి. ఈ ఎండల్లో రంగులు చల్లుకుని ఎంజాయ్ చేసినా.. మరొకవైపు ఎండ దెబ్బ మాములుగా ఉండదు.  కాబట్టి హైడ్రేటెడ్ గా ఉండటం చాలా అవసరం. నీరు, గ్లూకోజ్, జ్యూస్‌లు, శరీరాన్ని తిరిగి శక్తివంతం చేయడంలో సహాయపడతాయి.  పైగా ఇవి చర్మం పొడిబారకుండా తేమగా ఉండేలా చేస్తాయి. 

 కళ్ళను తేలిగ్గా తీసుకోవద్దు: 

మీరు రోజూ  కాంటాక్ట్ లెన్స్‌లను ధరించేవారు అయితే, రంగులతో ఆడుకునే ముందు వాటిని తీసివేయడం మంచిది. కళ్ళజోడు మీద రంగులు లేదా నీళ్లు పడితే ఎదుటి ప్రాంతాన్ని మసగ్గా కనిపించేలా చేస్తాయి. ఇది ఇబ్బందే అనుకోవచ్చు. అలాగని కళ్ళజోడు లేకుండా హొలీ ఆడేటప్పుడు రంగులు నేరుగా కళ్ళలోకి పడకుండా అజాగ్రత్త పడాలి. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. కాబట్టి కళ్లను జాగ్రత్తగా చూసుకోవాలి. 

స్వీట్ల దగ్గరా జాగ్రత్త: 

హోలీ సమయంలో మార్కెట్‌లో కల్తీ ఖోయా, మావా అమ్ముతారు. ఇంకా ఇలాంటి కల్తీ పదార్థాలతో స్వీట్లు తయారుచేస్తారు. ఇలాంటివే ఆఫర్స్ కింద, డిస్కౌంట్ల కింద అమ్మేస్తారు. కాబట్టి స్వీట్స్ కొనేముందు జాగ్రత్తగా ఉండాలి. . 

శరీరాన్ని ఇలా కవర్ చేయాలి:

హొలీ ఆడేటప్పుడు యావరేజ్ గా ఉన్న బట్టలు వేసుకోవాలి. దీనివల్ల వాటిమీద రంగులు వదలకపోయినా పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ కొత్త బట్టలు అయితే నాశనం అయిపోతాయి. ఫుల్ హాండ్స్ ఉన్న టాప్స్, ఫుల్ గా కాళ్లను కవర్ చేసే ప్యాంట్స్ వేసుకోవాలి. దీనీవల్ల రంగులు శరీరాన్ని పాడుచేసే అవకాశం తక్కువ. పాత డెనిమ్ జీన్స్, పొడవాటి పైజామాలను ఎంచుకోవచ్చు. 

ఇలా ఆరోగ్యకరమైన హోళిని ఎంజాయ్ చేసి, ఆరోగ్యంగా ఉండండి.

                                   ◆నిశ్శబ్ద.

By
en-us Political News

  
తలనొప్పి, మైగ్రేన్, అసిడిటీ, అజీర్ణ సమస్యలకు గట్ హెల్త్ కూడా ఒక కారణం కావచ్చు. నీళ్లు సరైన విధంగా తాగడం ద్వారా ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలో ఈ వీడియోలో తెలుసుకోండి.
భారతీయుల ఆహారంలో  నెయ్యి ప్రధానంగా ఉంటుంది.  ఒకప్పుడు నెయ్యిని చాలా విరివిగా తినేవారు. పైగా నెయ్యిని పోసుకుని తినాలి అని చెప్పేవారు. అయితే ఆ తరువాత నెయ్యి వాడకం తగ్గినా, ఇప్పటికీ నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వుల కారణంగా..
పిల్లలు ఫోన్ వాడితే కళ్ళు పాడవుతాయా? కంటి అలసట, స్క్రీన్ టైమ్ ప్రభావం, ఐ ఎక్సర్‌సైజులు మరియు కంటి ఆరోగ్యంపై డా. కాసు ప్రసాద్ రెడ్డి ఇచ్చిన ముఖ్యమైన సూచనలు తెలుసుకోండి.
కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఆహారంలో రకరకాల కూరగాయలు ఉండేలా చూసుకుంటే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం అని వైద్యులు చెబుతారు...
ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు లేదా  ఖాళీ సమయంలో..  చాలామంది  చిప్స్, నామ్కీన్, బిస్కెట్లు , ఇతర జంక్ ఫుడ్‌ను తింటుంటారు...
భారతీయుల ప్రధాన ఆహారం అన్నం.  మరీ ముఖ్యంగా దక్షిణ భారతీయులకు రోజులో కనీసం రెండు పూటల అయినా అన్నం ఉండాల్సిందే.. ఒకవేళ మధ్యాహ్న  భోజనంలో అయినా,  రాత్రి భోజనంలో అయినా చపాతీ లాంటివి తిన్నా....
వినికిడి లోపం అంటే ఒక వ్యక్తి అకస్మాత్తుగా శబ్దాలను వినలేకపోవడం అని చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. చాలా సందర్భాలలో వినికిడి సమస్యలు మెల్లిగా  మొదలవుతాయి. మొదట్లో దీని లక్షణాలు  చాలా సాధారణంగా అనిపిస్తాయి...
ఈ రోజుల్లో వయసుతో నిమిత్తం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య నరాల బలహీనత మరియు విపరీతమైన నీరసం. షుగర్, బీపీ, అధిక బరువు, పోషకాహార లోపం లేదా దీర్ఘకాలికంగా వాడే కొన్ని మందుల....
ఎసిడిటీ నేటి కాలంలో చాలా మందిలో కామన్ గా మారిన సమస్య.  చిన్న వయసు వారి నుండి పెద్దల వరకు అందరికీ గ్యాస్, ఎసిడిటీ పెద్ద సమస్యగా మారుతోంది. మసాలా పదార్థాలు ఎక్కువగా తినడం,  రాత్రి  ఆలస్యంగా..
ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవడానికి చాలా మంది ఎన్నెన్నో చిట్కాలు పాటిస్తుంటారు. చర్మాన్ని ప్రకాశవంతం చేసుకోవడానికి..
ఇంట్లో కాఫీ, టీలు సాధారణంగా స్టీల్ లేదా పింగాణీ కప్పులలో తాగుతారు. కానీ బయటకు వెళ్లినప్పుడు చాలామంది  దుకాణాల దగ్గర కాఫీ..
ఎక్కిళ్లు ఏ వయసు వారికైనా వచ్చే ఒక సాధారణ సమస్య. ఎక్కిళ్లు సాధారణంగా కొన్ని నిమిషాల్లో వాటంతట అవే ఆగిపోతాయి, కానీ కొన్నిసార్లు అవి తగ్గకుండా చాలా అసౌకర్యాన్ని కలిగిస్తాయి...
మన చుట్టూ ఉండే ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఔషధాలలో జామ ఆకులు ఒకటి. ఎలాంటి ఖర్చు లేకుండా మన ఇంట్లోనే లభించే ఈ జామ ఆకులతో కషాయం....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.