మీ దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తెలుసుకుని తీరాలి..

Publish Date:Mar 6, 2023

Advertisement

దంత సంరక్షణ మన ఆరోగ్య సంరక్షణలో ఒక భాగం. కానీ చాలామంది ఆరోగ్య సంరక్షణకు ఇచ్చినంత ప్రాధాన్యత దంత సంరక్షణకు ఇవ్వరు. చక్కని దంతాలు చక్కనైన రోజును నడిపిస్తాయనడంలో సందేహం లేదు. దంతాలు బాగుంటేనే రోజువారీ అవసరమైన ఆహారాన్ని సరిగ్గా తీసుకోగలుగుతాం. అదే పంటి నొప్పి, పన్ను ఊగడం, పళ్ళ మధ్య దూరం, పిప్పి పన్ను మొదలైనవి ఉన్నప్పుడు దేన్నీ సరిగ్గా తినలేం, తాగలేం. అందుకే దంత ఆరోగ్యం చాలా ముఖమైంది. దంతాల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటే..

పుట్టకముందే దంతాలు ఏర్పడటం మొదలవుతుంది: 

పిల్లలు పళ్లతో పుట్టకపోయినప్పటికీ, అవి తల్లి కడుపులో పిల్లలు ఉన్నట్టే ఏర్పడటం ప్రారంభిస్తాయి.  ఈ దంతాలు శిశువు పుట్టకముందే అభివృద్ధి చెందడం మొదలవుతుంది. సాధారణంగా శిశువుకు 6 మరియు 12 నెలల వయసులో పళ్ళు రావడం ప్రారంభమవుతుంది.

  దంతాలే స్ట్రాంగ్..: 

మన దంతాల మీద ఉండే ఎనామిల్ మానవ శరీరంలో అత్యంత గట్టి పదార్థం, మన ఎముకల కంటే కూడా ఇది చాలా గట్టిది.  పంటి ఎనామిల్‌లో కనిపించే ప్రధాన ఖనిజాన్ని హైడ్రాక్సీఅపటైట్ అంటారు.

  దంతాలను స్ట్రెయిట్ చేయవచ్చు: 


వంకరగా ఉండటం, ఎత్తు పళ్ళు, పన్ను మీద పన్ను రావడం వంటి సమస్యలను సరిచేయవచ్చు. వీటిని  అలైన్‌నర్‌లతో స్ట్రెయిట్ చేయవచ్చు.  ఈ ఆర్థోడోంటిక్ చికిత్సలు దంతాలను క్రమంగా సరైన స్థానాల్లో పళ్ళు ఉండేలా చేయడానికి  సున్నితమైన ఒత్తిడిని తీసుకొస్తాయి.

 ప్రతి వ్యక్తికి దంతాలు ప్రత్యేకంగా ఉంటాయి: 

మన వేలిముద్రల మాదిరిగానే, మన దంతాలు ప్రతి వ్యక్తికి ప్రత్యేకంగా ఉంటాయి.  ఇద్దరు వ్యక్తుల దంతాలు ఎప్పుడు ఒకేలా ఉండవు, వాటిని గుర్తించడానికి ఇది  ఒక అద్భుతమైన మార్గం.

మాటకు ముఖ్యం:

దంతాలు కొన్ని పదాలను స్పష్టంగా ఉచ్చరించడంలో సహాయపడతాయి. దంతాలు సరిగా లేకపోయినా, తొందరగా వీటిని కోల్పోయిన కొన్ని పదాలను పలకడంలో ఇబ్బంది స్పష్టంగా కనిపిస్తుంది. కొన్నిసార్లు ఇది నత్తి అనే భావన చాలామందిలో ఏర్పడిపోతుంది. తెలుగు వ్యాకరణంలో నోటిలో ఏ భాగం దంతాలతో ఏ అక్షరాలు ఉత్పన్నం అవుతాయనే విఆహాయం కూడా ఉంటుంది. కాబట్టి దంతాలు మన మాటకు మూలం.

నోటి పరిశుభ్రత ఉంటే: 


సాధారణ దంత సంరక్షణతో పాటు అప్పుడప్పుడు వైద్యులను కలవడం, దంతాల ఆరోగ్యాన్ని చెక్ చేయించుకోవడం ముఖ్యం. దంతాలు తొందరగా పాడయ్యేందుకు సహకరించే ఆహారాలు, కూల్ డ్రింక్స్, తీపి పదార్థాలు ఎక్కువ తీసుకోరాదు.

  ఓరల్ హెల్త్ మొత్తం ఆరోగ్యంతో ముడిపడి ఉంది:

 పేలవమైన నోటి ఆరోగ్యం ద్వారా గుండె జబ్బులు, మధుమేహం మరియు అల్జీమర్స్ వ్యాధితో సహా అనేక రకాల ఆరోగ్య సమస్యలు ముడిపడి ఉంటాయి.  మీ దంతాల సంరక్షణ మీ మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో దోహదం చేస్తుంది.

  నోటి పరిశుభ్రత, చక్కని అలవాట్లు, సమతుల్య ఆహారం తీసుకోవడం క్రమం తప్పకుండా దంతవైద్యుడిని కలవడం మొదలైనవి చేయడం వల్ల మరింత ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండొచ్చు. చక్కగా నవ్వుతూ..

                                      ◆నిశ్శబ్ద

By
en-us Political News

  
తలనొప్పి, మైగ్రేన్, అసిడిటీ, అజీర్ణ సమస్యలకు గట్ హెల్త్ కూడా ఒక కారణం కావచ్చు. నీళ్లు సరైన విధంగా తాగడం ద్వారా ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలో ఈ వీడియోలో తెలుసుకోండి.
భారతీయుల ఆహారంలో  నెయ్యి ప్రధానంగా ఉంటుంది.  ఒకప్పుడు నెయ్యిని చాలా విరివిగా తినేవారు. పైగా నెయ్యిని పోసుకుని తినాలి అని చెప్పేవారు. అయితే ఆ తరువాత నెయ్యి వాడకం తగ్గినా, ఇప్పటికీ నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వుల కారణంగా..
పిల్లలు ఫోన్ వాడితే కళ్ళు పాడవుతాయా? కంటి అలసట, స్క్రీన్ టైమ్ ప్రభావం, ఐ ఎక్సర్‌సైజులు మరియు కంటి ఆరోగ్యంపై డా. కాసు ప్రసాద్ రెడ్డి ఇచ్చిన ముఖ్యమైన సూచనలు తెలుసుకోండి.
కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఆహారంలో రకరకాల కూరగాయలు ఉండేలా చూసుకుంటే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం అని వైద్యులు చెబుతారు...
ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు లేదా  ఖాళీ సమయంలో..  చాలామంది  చిప్స్, నామ్కీన్, బిస్కెట్లు , ఇతర జంక్ ఫుడ్‌ను తింటుంటారు...
భారతీయుల ప్రధాన ఆహారం అన్నం.  మరీ ముఖ్యంగా దక్షిణ భారతీయులకు రోజులో కనీసం రెండు పూటల అయినా అన్నం ఉండాల్సిందే.. ఒకవేళ మధ్యాహ్న  భోజనంలో అయినా,  రాత్రి భోజనంలో అయినా చపాతీ లాంటివి తిన్నా....
వినికిడి లోపం అంటే ఒక వ్యక్తి అకస్మాత్తుగా శబ్దాలను వినలేకపోవడం అని చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. చాలా సందర్భాలలో వినికిడి సమస్యలు మెల్లిగా  మొదలవుతాయి. మొదట్లో దీని లక్షణాలు  చాలా సాధారణంగా అనిపిస్తాయి...
ఈ రోజుల్లో వయసుతో నిమిత్తం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య నరాల బలహీనత మరియు విపరీతమైన నీరసం. షుగర్, బీపీ, అధిక బరువు, పోషకాహార లోపం లేదా దీర్ఘకాలికంగా వాడే కొన్ని మందుల....
ఎసిడిటీ నేటి కాలంలో చాలా మందిలో కామన్ గా మారిన సమస్య.  చిన్న వయసు వారి నుండి పెద్దల వరకు అందరికీ గ్యాస్, ఎసిడిటీ పెద్ద సమస్యగా మారుతోంది. మసాలా పదార్థాలు ఎక్కువగా తినడం,  రాత్రి  ఆలస్యంగా..
ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవడానికి చాలా మంది ఎన్నెన్నో చిట్కాలు పాటిస్తుంటారు. చర్మాన్ని ప్రకాశవంతం చేసుకోవడానికి..
ఇంట్లో కాఫీ, టీలు సాధారణంగా స్టీల్ లేదా పింగాణీ కప్పులలో తాగుతారు. కానీ బయటకు వెళ్లినప్పుడు చాలామంది  దుకాణాల దగ్గర కాఫీ..
ఎక్కిళ్లు ఏ వయసు వారికైనా వచ్చే ఒక సాధారణ సమస్య. ఎక్కిళ్లు సాధారణంగా కొన్ని నిమిషాల్లో వాటంతట అవే ఆగిపోతాయి, కానీ కొన్నిసార్లు అవి తగ్గకుండా చాలా అసౌకర్యాన్ని కలిగిస్తాయి...
మన చుట్టూ ఉండే ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఔషధాలలో జామ ఆకులు ఒకటి. ఎలాంటి ఖర్చు లేకుండా మన ఇంట్లోనే లభించే ఈ జామ ఆకులతో కషాయం....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.