ముల్లంగి ఆకులు దొరికితే అస్సలు వదలకండి.. వీటితో ఎన్ని లాభాలంటే..!

Publish Date:Nov 17, 2024

Advertisement

 

ముల్లంగి ఆరోగ్యానికి చాలా మంచిది.  ఎక్కువ శాతం నీరు,  ఫైబర్ కలిగిన ఈ దుంపలు చాలా రకాల ఆరోగ్య సమస్యలకు చెక్ పెడతాయి.  ముఖ్యంగా మొలలు, మలబద్దకం.  మధుమేహం వంటి సమస్యలున్న వారికి ముల్లంగి ఔషధం కంటే తక్కువ కాదు.  అయితే ముల్లంగి దుంపలే కాకుండా ముల్లంగి ఆకులు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయట.  ముల్లంగి ఆకులు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో.. ఇవి ఎవరికి ఎక్కువ ప్రయోజనాలు చేకూరుస్తాయో తెలుసుకుంటే..

ముల్లంగి ఆకులలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి  చాలా పోషకాలు అందిస్తాయి.  కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ముల్లంగి ఆకులను తరచుగా తింటూ ఉంటే చాలా మేలు జరుగుతుంది. సాధారణంగా ముల్లంగిని కొన్నప్పుడు వాటికి ఆకులు ఉంటే వాటిని చాలామంది విసిరేస్తారు. చెత్తబుట్టలో వేస్తారు.

ముల్లంగి ఆకులు జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి.  ముల్లంగి ఆకులలో ఫైబర్ మెరుగ్గా ఉంటుంది.  ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.  మలబద్దకం, అజీర్ణం,  ఇతర కడుపు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.  ముల్లంగి ఆకులను తరచుగా ఆహారంలో తీసుకోవాలి.

మధుమేహం ఉన్నవారికి కూడా ముల్లంగి ఆకులు సహాయపడతాయి.  సాధారణంగా ముల్లంగి దుంపలు మధుమేహం ఉన్నవారికి మేలు చేస్తాయి.  రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రిస్తాయి.  అలాగే ముల్లంగి ఆకులు కూడా అంతే శక్తివంతంగా పనిచేస్తాయి.  శరీరంలో గ్లూకోజ్ స్థాయిని సమతుల్యం చేయడంలో ముల్లంగి ఆకులు సహాయపడతాయి.

శరీరంలో టాక్సిన్లు తొలగించడంలో ముల్లంగి ఆకులు
సహాయపడతాయి.  కాలేయాన్ని శుధ్ది చేసి కాలేయ పనితీరును మెరుగ్గా ఉంచుతాయి. అదే విధంగా మూత్ర పిండాల పనితీరును కూడా మెరుగుపరుస్తాయి.

రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉండాలంటే శరీరానికి విటమిన్-సి చాలా అవసరం.  ముల్లంగిలో విటమిన్-సి మెరుగ్గా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గు సమస్యలను సులువుగా తగ్గిస్తుంది.

మొలల సమస్యతో బాధపడేవారు ముల్లంగి ఆకులను ఆహారంలో తీసుకుంటే మంచిది.  సాధారణంగా మలబద్దకం సమస్య వల్ల మొలల సమస్య వస్తుంది.  ముల్లంగి ఆకులు ఆహారంలో తీసుకుంటే మలబద్దకం సమస్య తగ్గి మొలల సమస్య వచ్చే అవకాశమే ఉండదు.  ఒక వేళ మొలల సమస్య ఉన్నా ముల్లంగి ఆకులను ఆహారంలో తీసుకుంటే చాలా తొందరగా సమస్య నుండి బయటపడతారు.


                                          *రూపశ్రీ.

By
en-us Political News

  
ప్రస్తుత ఆధునిక కాలంలో శారీరక ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో, మానసిక ఆరోగ్యానికి (Mental Health) కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో అవసరం. కానీ, నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, వ్యక్తిగత సమస్యల వల్ల చాలా మంది...
ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మలబద్ధకం. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే పైల్స్, గ్యాస్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఎలాంటి మందులు వాడకుండా, ఇంట్లోనే సహజంగా మలబద్ధకాన్ని ఎలా తగ్గించుకోవచ్చో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు..
మానవ శరీరంలో ప్రేగుల పాత్ర చాలా ఉంది.,  తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో,  శరీరానికి అవసరమైన పోషకాలను గ్రహించడంలో, వ్యర్థాలను బయటకు పంపడంలో ప్రేగులు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. తిన్న ఆహారం..
మన శరీరంలో పొటాషియం స్థాయిలు హెచ్చుతగ్గులు కావడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, వాటి కారణాలు మరియు నివారణ మార్గాల గురించి ప్రముఖ వైద్యులు డాక్టర్ పాపారావు గారు ఈ వీడియోలో క్లుప్తంగా వివరించారు...
మూత్రపిండాలు శరీరం నుండి విషపదార్థాలను తొలగించడం, రక్తపోటును నియంత్రించడం,  శరీరంలో నీరు, ఖనిజాలను బాలెన్స్డ్ గా ఉంచడం వంటి   ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తాయి. అయితే, కొన్ని అనారోగ్యకరమైన..
చాలా మందిని వేధించే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘తల తిరగడం’ (Vertigo/Dizziness) ఒకటి. హఠాత్తుగా కళ్ళు తిరగడం వల్ల భయం, అసౌకర్యం కలగడమే కాకుండా రోజువారీ పనులు చేసుకోవడం కష్టమవుతుంది.
చాలా మందికి రాత్రిపూట వేడివేడి అన్నం తింటే గాని నిద్ర పట్టదు. కానీ, బరువు తగ్గాలని లేదా ఫిట్‌గా ఉండాలని ప్రయత్నించే వారికి..
మనలో చాలా మందికి అద్దంలో చూసుకున్నప్పుడు కొన్ని శరీర భాగాలు నచ్చవు. ముఖ్యంగా ఎంత వ్యాయామం చేసినా, ఎంత కఠినమైన డైట్ పాటించినా తగ్గని మొండి కొవ్వు మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది...
ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది మహిళలను వేధిస్తున్న అతిపెద్ద సమస్య పి.సి.ఓ.డి (PCOD). అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది..
ఈనాటి వేగవంతమైన జీవనశైలిలో మనకు తెలియకుండానే మనం అనేక ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నాము. ముఖ్యంగా, నేటి యువతలో సెక్స్ పట్ల ఆసక్తి తగ్గడం అనేది ఒక ప్రధాన సమస్యగా మారుతోంది. ..
మధుమేహం (Diabetes) ఉన్నవారు చేసే మొదటి పని అన్నం మానేసి చపాతీలు తినడం. మరి నిజంగా చపాతీ తింటే షుగర్ తగ్గుతుందా? అన్నం తింటే పెరిగిపోతుందా? ఈ విషయంలో చాలా మందిలో..
నేటి వేగవంతమైన ఒత్తిడితో కూడిన జీవితంలో ఆందోళన ఒక సాధారణ సమస్యగా మారింది. కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలు కూడా మనసును అశాంతపరిచి, నిద్ర, ఆహరం, రోజువారీ జీవనశైలిపై  ప్రభావం చూపుతాయి...
కాలం మారినా మనిషి జీవన పోరాటం మాత్రం మారదు.  కొందరు కాలంతో పోటీ పడి ఎండ, వాన, చలి వంటి వాటిని లెక్క చేయకుండా సాగుతూ ఉండాలి. లేకపోతే వారితో పాటు వారిని నమ్ముకున్న కుటుంబాలు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.