పెనుగాలుల బీభత్సం.. వెయ్యి ఎకరాల్లో పంటనష్టం
Publish Date:May 2, 2026
Advertisement
మొన్నటివరకు కనీస మద్దతు ధర లేక చేతికి వచ్చిన పంటను అమ్ముకోలేక పశువులకు వదిలేసి కుదేలు అయిన రైతన్నలు.. ఇప్పుడైనా అయినా పరిస్థితులు దారిలోకి వస్తాయి అని ఆశిస్తే.. పెనుగాలి, అకాలవర్షాలు వారి ఆశలను అడియాశలు చేశాయి. పులివెందుల నియోజకవర్గంలో గురువారం రాత్రి వీచిన పెనుగాలి, అకాల వర్షం రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చాయి. ప్రధానండా అరటి పంట తీవ్రంగా దెబ్బతింది. వేల ఎకరాల్లో పంట నేలమట్ట మైంది. ప్రాథమిక అంచనాల ప్రకారం వెయ్యి ఎకరాల్లో అరటి పంట ధ్వంసమై.. రూ.12 కోట్ల మేర నష్టం వాటిల్లింది. పులివెందుల మండలం నల్లపురెడ్డి పల్లె, ఈ.కొత్తపల్లి, కనంపల్లె, మొట్నూతల పల్లి, నల్లగొండూవారి పల్లి, బ్రాహ్మణపల్లె తదితర గ్రామాల్లో సుమారు 520 ఎకరాల్లో అరటి తోటలు నేలకొరిగాయి. అలాగే.. లింగాల మండల పరిధిలో గుణకనపల్లి, రామట్లపల్లి, చిన్నకుడాల, మురారిచిం తలతో పాటు పలు గ్రామాల్లో 500 ఎకరాల్లో పంట పూర్తిగా దెబ్బంది. ఒక్కసారిగా వీచిన రాకాసి గాలులు అరటి చెట్లను నేలకూల్చడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పెట్టుబడులు పెట్టి పంటను కోత దశకు తీసుకువచ్చిన రైతులకు ఈ నష్టం తేరుకోలేని విధంగా దెబ్బతీసింది. అధికారులు దెబ్బతిన్న తోటలను పరిశీలించి ప్రాథమిక నివేదికలను సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే ప్రభుత్వానికి నివేదికలు పంపించి, నష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తీవ్రంగా నష్టపోయిన రైతులు మాత్రం తక్షణమే నష్టపరిహారం ప్రకటించాలని కోరుతున్నారు. సాగులో పెట్టిన పెట్టుబడులు, అప్పులు తిరిగి చెల్లించే పరిస్థితి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నామని వాపోతు న్నారు. పంట బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ రూపంలో సహాయం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. పంట కోతకు సిద్ధంగా ఉన్న సమయంలో ఇలా గాలికి పడిపోవడం చాలా బాధాకరమనీ ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు ఆదుకోవాలి అని బాధిత రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/havoc-wreaked-by-gusty-winds-36-218777.html





