హర్యానా ఎన్నికలు.. కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీ!

Publish Date:Aug 24, 2024

Advertisement

హర్యానా అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీలకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారాయి. అక్టోబర్‌ 1వ తేదీన హర్యానాలోని 90 స్థానాల శాసనసభకు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీ తథ్యమని పరిశీలకులు చెబుతున్నారు. ప్రధాన పోటీ ఈ రెండు పార్టీల మధ్యే ఉంటుందనీ, ఇక ప్రాంతీయపార్టీ అయిన  జననాయక్‌ జనతా పార్టీ (జె.జె.పి) ఎప్పటి మాదిరిగానే తన మూడవ స్థానంలో నిలిచే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఈ సారైనా హర్యానాలో అడుగుపెట్టాలని గట్టి పట్టుదలతో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)  ఇండీ కూటమి భాగస్వామ్యపక్షంగా కొన్ని సీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయి.  రాష్ట్రంలో గత పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీకి ఈసారి తీవ్రమైన యాంటీ ఇంకంబన్సీ ఎదుర్కొంటోందనీ, ఆ ప్రభుత్వ వ్యతిరేకతే తమకు అవకాశంగా మారుతుందని కాంగ్రెస్ ఆశాభావంతో ఉంది.  అయితే బీజేపీ కూడా ప్రజలలో నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించుకునేందుకు పలు చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను తప్పించి ఆయన స్థానంలో నాయబ్ సింగ్ సైనీని కూర్చోబెట్టింది. అలాగే పలు సంక్షేమ పథకాలను చేపట్టి ప్రజాభిమానాన్ని పొందడంపై దృష్టి కేంద్రీకరించింది. 

అదే విధంగా ప్రభుత్వంపై సర్పంచ్ ల అసంతృప్తిని తగ్గించి, వారి ఆగ్రహాన్ని శాంతింపచేయడానికి చర్యలు చేపట్టింది. అందులో ప్రధానంగా సర్పంచ్ ల వ్యయపరిమితిని 5 లక్షల రూపాయల నుంచి 21 లక్షల రూపాయలకు పెంచింది.  ప్రజలలో అసంతృప్తిని తగ్గించేందుకు, ప్రభుత్వంపై అభిమానాన్ని పెంచి మద్దతు కూడగట్టేందుకు సమాధాన్ శిబిర్ లే ఏర్పాటు చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి నడుంబిగించింది.  కాంట్రాక్టు ప్రాతిపదిన పనిచేస్తున్న సుమారు 1.20 లక్షల మంది ఉద్యోగులకు వారు పదవీ విరమణ చేసేవరకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ సైనీ ప్రభుత్వం  నిర్ణయం తీసుకుంది. ఆరు లక్షల రూపాయల ఆదాయం ఉన్న ఓబీసీలను క్రీమీలేయర్‌ గా ప్రకటిస్తూ ఖట్టర్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసి, ఆ ఆదాయ పరిమితిని 8 లక్షలకు సైని సర్కార్ పెంచడం ద్వారా ఆదాయవర్గాలను సంతోషపెట్టింది.  అగ్నివీర్‌ పథకం కింద పనిచేసిన సైనికులకు ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని, పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతామని సైనీ ప్రభుత్వం వాగ్దానం చేసింది.

అయితే ఎన్ని చేసినా బీజేపీకి ఇబ్బందికలిగించే అంశాలు రాష్ట్రంలో చాలానే ఉన్నాయి. ప్రధానంగా వ్యవసాయ చట్టాలు, అగ్నివీర్ పథకం వంటివి అధికార బీజేపీ పట్ల ప్రజలలో తీవ్ర ఆగ్రహం, అసంతృప్తికి కారణమయ్యాయి. అందుకే గత పదేళ్లుగా బీజేపీకి అనుకూలించిన జాట్, జాటేతరుల విభేదాలు ఈ సారి ఆ పార్టీకి పెద్దగా ఉపయోగపడే పరిస్థితి కనిపించడం లేదు.  బీజేపీ అంతర్గత కుమ్ములాటలతో సతమతమౌతుంటే.. అంతర్గత కుమ్ములాటలకు కేరాఫ్ అడ్రస్ లాంటి కాంగ్రెస్ మాత్రం అవి రచ్చకెక్కకుండా జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా, పార్టీ ఐక్యంగా ఉందన్న సంకేతాలు ఇస్తోంది. 

అన్నిటికీ మించి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన ప్రచార సారథి,  మాజీ ముఖ్యమంత్రి భూపీందర్‌ సింగ్‌ హూడా వ్యవసాయ రంగాన్ని ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కిస్తామని, నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని చేసిన వాగ్దానం రైతులను, యువతకు కాంగ్రెస్ కు చేరువ చేసింది.  ఇటీవలి సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రంలోని 20 లోక్ సభ స్థానాలకు గాను పదింటిలో బీజేపీ విజయం సాధించింది. అలాగే కాంగ్రెస్ కు కూడా పది స్థానాలు దక్కాయి. అయితే లోక్ సభ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకూ చాలా తేడా ఉందనీ, పార్లమెంటు ఎన్నికలలో ఉన్న సానుకూలత, రాష్ట్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపికీ అసెంబ్లీ ఎన్నికలలో ఉండే అవకాశాలు తక్కువని పరిశీలకులు అంటున్నారు.  

By
en-us Political News

  
భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.
కానీ కూటమి మధ్య అవగాహన రోజు రోజుకూ బలపడుతోందని తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ చెప్పారు. ఆ విషయం చెబుతూ.. ఇటీవల తాను చేసిన ఒక వ్యాఖ్యను పవన్ కల్యాణ్ ఫోన్ చేసి మరీ సరిదిద్దిన విషయాన్ని వెల్లడించారు.
దాదాపు మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఇది చట్టంగా మారింది. ఎప్పటి నుంచి ఇది చట్టసభల్లో నలుగుతోందని చూస్తే.. మహిళా బిల్లు ప్రస్థానం నేటిది కాదు, దీని వెనుక ఏళ్ల పోరాటం ఉంది. ఈ దిశగా తొలి అడుగులు 1996లో పడ్డాయి. హెచ్.డి. దేవెగౌడ ప్రభుత్వం మొదటిసారిగా 81వ రాజ్యాంగ సవరణ బిల్లు రూపంలో దీనిని ప్రవేశపెట్టింది. కానీ లోక్‌సభ రద్దు కావడంతో అది వీగిపోయింది.
పేద అమ్మాయిల వివాహాలకు ఎనిమిది గ్రాముల బంగారం, ఓ పట్టుచీర కానుకగా ఇస్తామన్నారు. ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామన్నారు. స్వయం సహాయక బృందాలకు రూ.5 లక్షలు వడ్డీ లేని రుణాలు, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో డ్రాపవుట్‌ లేకుండా చేసేందుకు విద్యార్థుల తల్లులకు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సహాయం చేస్తామన్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
నారా లోకేష్ నాయకత్వానికి ఈ ఆమోదం, ఈ అంగీకారం అంత సులభంగా ఏమీ రాలేదు. అసలు నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి.
ఆ పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఈ అంశంపై స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై ప్రశంసలు కురిపించారు. పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ మరియు లోక్‌సభ స్థానాలను సుమారు 50 శాతం మేర పెంచాలని కేంద్రం భావించడం అభివృద్ధికి సంకేతంగా అభివర్ణించారు. ఈ ప్రక్రియ కోసం ఒక స్పష్టమైన విధివిధానాన్ని అనుసరిస్తుండటం పట్ల వైసీపీకి ఎలాంటి అభ్యంతరాలూ లేవని వాకృచ్చారు.
మహిళా రిజర్వేషన్ ను డిలిమిటేషన్‌తో లింక్ చేయడం కేంద్రం చేస్తున్న పెద్ద కుట్రగా అభివర్ణించారు. మహిళా బిల్లు, డిలిమిటేషన్ రెండూ వేర్వేరు అంశాలన్న కల్వకుంట్ల కవిత.. ఈ రెంటినీ లింక్ చేసి.. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డిలిమిటేషన్ అంశాన్ని కాల్చాలని కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.
తృణమూల్ నేతల వాహనాలను సోదాలు చేస్తున్న అధికారులు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ కీలక నేతల కాన్వాయ్‌లను ఎందుకు తనిఖీ చేయడం లేదని నిలదీశారు. నిబంధనలు అందరికీ సమానంగా ఉండాలని, కానీ బెంగాల్‌ లో మాత్రం పక్షపాత వైఖరి కనిపిస్తోందన్నారు.
కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సభలో రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టారు. అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లును సభ ముందు ఉంచారు. నారీ శక్తి వందన్ అధినియమ్ ద్వారా 2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంటోంది.
నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత క్రియాశీలక నాయకుడు.
బిహార్ రాజకీయ ముఖచిత్రం మరోసారి అనూహ్య మలుపు తిరిగింది.
2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టడం వెనుక నిస్సందేహంగా లోకేష్ యువగళం పాత్రదే ప్రధాన, కీలక భూమిక. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో లోకేష్ అత్యంత క్రీయాశీల పాత్ర పోషిస్తున్నారడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.