కమలం గూటికి హార్దిక పటేల్ ... హస్తం పార్టీకి బిగ్ షాక్
Publish Date:Jun 2, 2022
Advertisement
నుకున్నట్లే, ముందుగా ప్రకటించిన విధంగానే, కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన, గుజరాత్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, పాటిదార్ ఉద్యమనేత హార్దిక్ పటేల్.. గురువారం బీజేపీలో చేరారు. నిజానికి రెండు రోజుల క్రితమే ముహూర్తం ఖరారు చేసుకున్న, హార్దిక్ పటేల్ ఈరోజు గురువారం బీజేపీ గుజరాత్ చీఫ్ సీఆర్ పాటిల్ సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా, ఆయన మోడీ నాయకత్వంలో సైనికుడిగా పనిచేస్తానని అన్నారు పటేల్. గుజరాత్ కు కాంగ్రెస్ ను దూరం చేస్తానని హెచ్చరించారు. అదెలా ఉన్నప్పటికీ, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, పాటిదార్ ఉద్యమనేతగా మంచి పట్టున్న హార్దిక్ పటేల్.. కమలం గూటికి చేరడం, కాంగ్రెస్ కు గట్టి షాక్ ఇచ్చినట్లే నని పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటికే, గుజరాత్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నఅహ్మద్ పటేల్ అస్తమయంతో కాంగ్రెస్ పార్టీ కష్టాలను ఎదుర్కుంటోంది. ఇలాటి సమయంలో, హార్దిక్ పటేల్.. పార్టీకి గుడ్ బై చెప్పి, బీజేపీలో చేరడం కాంగ్రెస్ కష్టాలను రెట్టింపు చేస్తుందని పరిశీలకులు అంటున్నారు. పాటిదార్ అనామత్ ఆందోళన్ ఉద్యమంతో ప్రజాదరణ పొందిన హార్దిక్ పటేల్.. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరారు. రాష్ట్ర యూనిట్లో కీలక స్థానంలో ఉంటూ వచ్చిన పటేల్.. ఇటీవల పార్టీపై బహిరంగంగానే విమర్శలు చేశారు. మే 19న కాంగ్రెస్ ను వీడుతున్నట్లు ప్రకటించారు. అంతా ఊహించినట్లే ఇప్పుడు బీజేపీలో చేరారు. కాగా ఇప్పటికే, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన బీజేపీకి హార్దిక్ పటేల్ చేరిక మరింత బూస్ట్ ఇస్తుందని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షడు జేపీ నడ్డా, ఇతర కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు ఒకరి వెంట ఒకరుగా, రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. భారీ బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితిలో గత (2017) అసెంబ్లీ ఎన్నికలలో హార్దిక పటేల్ మద్దతుతో బీజేపీకి గట్టి పోటీ ఇచ్చిన కాంగ్రెస్ ఈ ఎన్నికలలో ఎంత వరకు పోటీ ఇవ్వగలుగుతుంది అనేది, చూడవలసి ఉందని పరిశీలకులు అంటున్నారు. మరోవంక, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, కమలం గూటికి చేర్చేందుకు వారం వారం ప్రత్యేక కార్యక్రమం (పశువుల సంత?) నిర్వహిస్తానని హార్దిక్ పటేల్ ప్రకటించారు. సో .. కాంగ్రెస్ పార్టీ ..కి హార్దిక్ పటేల్ కోలుకోలేని దెబ్బ కొట్టారని అంటున్నారు.
అంతకుముందు కమలం పార్టీలో తన చేరికపై ట్విట్టర్ వేదికగా స్పందించిన హార్దిక్.. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఒక చిన్న సైనికుడిగా సేవ చేయాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. నేటి నుంచి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిపారు. పార్టీలో చేరే ముందు అహ్మదాబాద్‌లోని తన నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు పటేల్.
http://www.teluguone.com/news/content/hardikpatel-joins-bjp-a-big-shock-to-congress-25-136915.html





